newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

జార్జిరెడ్డి క‌థ‌లో రెండో కోణం ఉందా..?

19-11-201919-11-2019 08:02:44 IST
Updated On 19-11-2019 10:52:19 ISTUpdated On 19-11-20192019-11-19T02:32:44.716Z19-11-2019 2019-11-19T02:31:10.335Z - 2019-11-19T05:22:19.020Z - 19-11-2019

జార్జిరెడ్డి క‌థ‌లో రెండో కోణం ఉందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉస్మానియా విశ్వ‌విద్యాల‌య విద్యార్థి నాయ‌కుడు జార్జిరెడ్డి జీవితం ఆధారంగా సినిమా తెర‌కెక్కుతోంది. సందీప్ మాధ‌వ్ హీరోగా, ద‌ళం సినిమా ద‌ర్శ‌కుడు జీవ‌న్‌రెడ్డి ఈ సినిమాను తెర‌కెక్కించారు.

ఈ సినిమా ఈ నెల 22వ తేదీన విడుద‌ల కానుంది. అయితే, విడుద‌ల‌కు ముందే ఈ సినిమా ప‌లు వివాదాల‌కు కేంద్రంగా మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ సినిమాకు వ్య‌తిరేకంగా అఖిల భార‌తీయ విద్యార్థి ప‌రిష‌త్‌(ఏబీవీపీ) ఆందోళ‌న‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంద‌ని తెలుస్తోంది.

1970ల‌లో ఉస్మానియా యూనివ‌ర్సిటీలో విద్యార్థి నేత‌గా ఎదిగాడు జార్జిరెడ్డి. ఆయ‌న జీవితంలో మంచి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో సినిమా తీసేంత‌ క‌థ ఉంది. పుట్టింటి వారు, మెట్టినింటి వారు సంప‌న్నులైనా అత్మ‌గౌర‌వంతో అనేక క‌ష్టాలు ప‌డి పిల్ల‌ల‌ను చ‌దివించిన జార్జిరెడ్డి త‌ల్లి కోణం, అనేక ఇబ్బందులు ప‌డుతూ చ‌దువుకొని ఫిజిక్స్‌లో గోల్డ్ మెడ‌ల్ సాధించడం, త‌క్కువ కాలంలోనే విద్యార్థుల్లో నాయ‌కుడిగా ఎద‌గ‌డం, చిన్న వ‌య‌స్సులోనే హ‌త్య‌కు గురికావ‌డం వంటి సంఘ‌ట‌న‌లు సినిమా తీయ‌డానికి స‌రిప‌డే ఎలిమెంట్స్‌.

అయితే, జార్జిరెడ్డి క‌థ‌పై పీడీఎస్‌యూ, ఏబీవీపీ మ‌ధ్య వివాదం మొద‌లైంది. ఉస్మానియా యూనివ‌ర్సిటీలో చ‌దువుతున్న స‌మ‌యంలో జార్జిరెడ్డి విద్యార్థి నాయ‌కుడిగా ఎదిగాడు.

మొద‌ట కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉండే యంగ్ ట‌ర్క్స్‌లో ప‌ని చేసిన ఆయ‌న త‌ర్వాత పీడీఎస్ అనే విద్యార్థి సంఘాన్ని స్థాపించాడు. ఆ రోజుల్లో ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంలో ఎన్నిక‌ల‌ను విద్యార్థి సంఘాలు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకునేవి.

ఈ నేప‌థ్యంలో వామ‌ప‌క్ష భావాలున్న జార్జిరెడ్డికి, ఏబీవీపీకి మ‌ధ్య గొడ‌వ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. అనేక కొట్లాట‌లు జ‌రిగాయి. అంత‌లో క్యాంప‌స్‌లోని ఇంజ‌నీరింగ్ క‌ళాశాల వ‌ద్ద జార్జిరెడ్డి హ‌త్య జ‌రిగింది. ఈ హ‌త్య వెనుక ఏబీవీపీ ఉంద‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. కానీ, కోర్టులో ఈ విష‌యం నిరూప‌న కాలేద‌ని ఏబీవీపీ వాదిస్తోంది.

ఇప్పుడు జార్జిరెడ్డి జీవ‌తం ఆధారంగా సినిమా తెర‌కెక్కుతుంది అంటే ఏబీవీపీని విల‌న్‌గా చూపించే అవ‌కాశం ఉంద‌నే అంచ‌నాలు ఉన్నాయి. ఏబీవీపీ అనే పేరును చూపించ‌క‌పోయినా ఇత‌ర పేర్ల‌తో ఆ రోజుల్లోని క్యాంప‌స్ రాజ‌కీయాల‌ను చూపించే అవ‌కాశం ఉంది. జార్జిరెడ్డి సినిమాకు సంబంధించిన పాట‌లు, పోస్ట‌ర్లు, ట్రైల‌ర్‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.

నాలుగు రోజుల్లో సినిమా విడుద‌ల అవుతుంద‌న‌గా ఇప్పుడు ఏబీవీపీ నుంచి ఈ సినిమాపై అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. జార్జిరెడ్డిని హీరోగా చూపించ‌డం స‌రికాద‌నేది ఏబీవీపీ వాద‌న‌.

వామ‌ప‌క్షాల భావ‌న‌తో జార్జిరెడ్డి అనేక మందిని న‌క్స‌లైట్ల‌లో చేరే విధంగా ప్రోత్స‌హించి అనేక మందిని మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మ‌య్యార‌ని ఏబీవీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.

జార్జిరెడ్డి హీరో కాద‌ని, ఆయ‌న రౌడీయిజానికి క్యాంప‌స్‌లో అనేక‌మంది విద్యార్థులు ఇబ్బంది ప‌డ్డార‌ని వాదిస్తున్నారు. సినిమాలో ఏబీవీపీ నేత‌ల‌ను విల‌న్‌గా చూపిస్తే స‌హించేదిలేద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

కానీ, పీడీఎస్‌యూ నేత‌లు మాత్రం జార్జిరెడ్డి క‌చ్చితంగా హీరో అని, ఏబీవీపీ జార్జిరెడ్డి క‌థ‌ను వ‌క్రీక‌రించే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని వాదిస్తున్నారు.

జార్జిరెడ్డి హీరో అని ఒక ప‌క్షం, జార్జిరెడ్డి రౌడీయిజం చేశార‌ని మ‌రో వ‌ర్గం సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నాయి. సినిమా విడుద‌ల‌కు ముందే వివాదం మొద‌లైతే సినిమా విడుద‌ల‌య్యాక మ‌రిన్ని వివాదాలు చుట్టు ముట్టే అవ‌కాశం ఉంది. ద‌ర్శ‌కుడు జీవ‌న్‌రెడ్డి ఒక వివాదం ఉన్న ఒక క‌థ‌ను తీసుకొని ధైర్యంగా సినిమా చేస్తున్నాడు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle