newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జాతీయ రాజ‌కీయాల్లోకి కేసీఆర్ ఎంట్రీ..? కొత్త పార్టీ ఏర్పాటు దిశ‌గా అడుగులు..?

07-09-202007-09-2020 11:09:07 IST
Updated On 07-09-2020 12:19:08 ISTUpdated On 07-09-20202020-09-07T05:39:07.657Z07-09-2020 2020-09-07T05:39:03.706Z - 2020-09-07T06:49:08.592Z - 07-09-2020

జాతీయ రాజ‌కీయాల్లోకి కేసీఆర్ ఎంట్రీ..? కొత్త పార్టీ ఏర్పాటు దిశ‌గా అడుగులు..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు మ‌రోసారి నేష‌న‌ల్ పాలిటిక్స్‌పై న‌జ‌ర్ పెట్టారు. తెలంగాణ‌లో త‌న‌యుడు కేటీఆర్‌ను ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోబెట్టి తాను జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టాల‌ని చూస్తున్న‌ట్లు చాలా రోజులుగా తెలంగాణ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతుంది. టీఆర్ఎస్ నేత‌లు కూడా కేసీఆర్ ప్ర‌ధాని కావ‌డానికి, కేటీఆర్ ముఖ్య‌మంత్రి కావ‌డానికి అర్హ‌త‌లు ఉన్నాయంటూ త‌ర‌చూ వ్యాఖ్యానిస్తుంటారు. ఇందుకు ముహూర్తం కుదిరిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. 2022 చివ‌ర్లో లేదా 2023 మొద‌ట్లో జ‌మిలి ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉండ‌టంతో ఇక ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా జాతీయ రాజ‌కీయాల‌పై ఫోకస్ పెట్టాల‌ని కేసీఆర్ డిసైడ్ అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

నిజానికి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘ‌న విజ‌యం సాధించిన త‌ర్వాత కేసీఆర్ జాతీయ స్థాయి రాజ‌కీయాల్లోకి వెళ్లాల‌ని ఆలోచించారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా స‌మాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప‌ని చేస్తున్నాయ‌ని, రాష్ట్రాల‌పై పెత్త‌నం చేలాయిస్తున్నాయ‌నేది కేసీఆర్ మొద‌టి ఆరోప‌ణ‌. అధికారాలు అన్నీ కేంద్రం వ‌ద్దే పెట్టుకుంటోంద‌ని, గ్రామ స్థాయి అంశాల‌కు సంబంధించిన‌వి కూడా కేంద్రం వ‌ద్ద అధికారాలు ఉండ‌టం  ఏంట‌నేది కేసీఆర్ రెండో ఆరోప‌ణ‌. దేశాన్ని ఇంత‌కాలం పాలించిన కాంగ్రెస్‌, బీజేపీ వ‌ల్ల ఏమీ ఒర‌గ‌లేద‌ని, దేశం ఎదుర్కుంటున్న స‌మ‌స్య‌ల‌ను స‌రిగ్గా ప‌రిష్క‌రించ‌లేక‌పోతున్నార‌ని కేసీఆర్ చెప్పారు.

2019 ఎన్నిక‌లకు వివిధ ప్రాంతీయ పార్టీల‌ను క‌లుపుకొని ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాల‌నేది కేసీఆర్ ఆలోచ‌న‌. అయితే, కేసీఆర్ ఆలోచ‌న‌కు 2019 స‌రైన స‌మ‌యం కాదు. అప్ప‌టికి దేశంలో మోడీ గాలి బ‌లంగా వీస్తోంది. బీజేపీ అధికారం చేప‌ట్టేందుకు కావాల్సిన సీట్లు రావ‌ని అప్ప‌ట్లో కేసీఆర్ వేసిన అంచ‌నా త‌ప్పింది. దీంతో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఆలోచ‌న‌లు అక్క‌డికే ఆగిపోయాయి. ఇప్పుడు జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఇప్ప‌టి నుంచే జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు.

అయితే, ఈసారి గ‌తంలో లాగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ వంటి కూట‌మి ద్వారా కాకుండా తానే స్వంతంగా ఒక పార్టీని స్థాపించాల‌ని ఆయ‌న డిసైడ్ అయ్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందుకు సంబంధించి వివిధ రంగాల ప్ర‌ముఖుల‌తో ఆయ‌న గ‌త కొద్ది రోజులుగా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. జాతీయ పార్టీకి సంబంధించి న‌యా భార‌త్ అనే పేరును ఖ‌రారు చేశార‌ని, ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ కూడా త్వ‌ర‌లోనే ప్రారంభించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త కొన్ని రోజులుగా కేసీఆర్ ఈ ప్ర‌య‌త్నాల్లోనే ఉన్నార‌ట‌.

అయితే, 2019లో మోడీ హ‌వాతో త‌న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఆలోచ‌న‌లు విఫ‌ల‌మ‌య్యాయి. కానీ, ఇప్పుడు మాత్రం జాతీయ రాజ‌కీయాల్లో ఒక వెలితి ఉంద‌ని కేసీఆర్ భావిస్తూ ఉండ‌వ‌చ్చు. మోడీ హ‌వా గ‌తంతో పోలిస్తే త‌గ్గుతోంద‌నే విశ్లేష‌ణ‌లు ఉన్నాయి. క‌రోనాను ఎదుర్కోవ‌డంలో, చైనాను నియంత్రించ‌డంలో, దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బాగు చేయ‌డంలో మోడీ స‌ర్కార్ ఫెయిల్ అవుతోంద‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో కొంత మేర‌కు వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో జాతీయ పార్టీ ఏర్పాటుకు ఇది స‌రైన స‌మ‌య‌మ‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.

కేసీఆర్‌కు దేశ రాజ‌కీయాల ప‌ట్ల కూడా మంచి అవ‌గాహ‌న ఉంది. దేశ భౌగోలిక‌, సాంస్కృతిక, ఆర్థిక ప‌రిస్థితుల‌పై కూడా ప‌ట్టుంది. హిందీ, ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడ‌గ‌ల‌రు. ఆక‌ట్టుకునే వాక్చాతుర్యం ఆయ‌న సొంతం. కొట్లాడి తెలంగాణ సాధించార‌నే ఇమేజ్ ఉంది. అయితే, ఒక జాతీయ పార్టీని స్థాపించి బ‌ల‌మైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ముందు పోటీకి నిల‌బ‌డేందుకు ఇవి స‌రిపోతాయా అనేది ప్ర‌స్తుతం అతి పెద్ద ప్ర‌శ్న‌. కేసీఆర్ జాతీయ పార్టీని స్థాపిస్తే ఫ‌లానా రాష్ట్రం నుంచి ఫ‌లానా నాయ‌కులు వ‌చ్చి పార్టీలో చేర‌తాడు అని క‌చ్చితంగా చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది. కాబ‌ట్టి, జాతీయ పార్టీని స్థాపించాల‌ని ఉంది క‌నుక కేసీఆర్ నిర్ణయించుకుంటే  అది చాలా ధైర్యంతో తీసుకున్న నిర్ణ‌య‌మే అని చెప్పాలి. అయితే, కేసీఆర్ వంటి రాజ‌కీయ దిగ్గ‌జం అనుకూల‌త‌లు, ప్ర‌తికూల‌త‌లు బేరీజు వేసుకున్నాక‌నే ఒక నిర్ణ‌యం తీసుకోవ‌చ్చు.

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   3 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   an hour ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   4 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   6 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle