newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లను.. కేసీఆర్ స్పష్టీకరణ

08-09-202008-09-2020 10:07:00 IST
2020-09-08T04:37:00.572Z08-09-2020 2020-09-08T04:36:57.862Z - - 23-04-2021

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లను.. కేసీఆర్ స్పష్టీకరణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జాతీయ స్థాయిలో రాజకీయ నాయకత్వ శూన్యత ఉందని, అయితే ఇప్పట్లో తనకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సొంత పార్టీ నేతలకు స్పష్టతనిచ్చారు. 2023లోనూ రాష్ట్రంలో తిరిగి టీఆర్‌ఎస్‌ పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు. జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే మీ అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటా. జాతీయ రాజకీయాలకు సంబంధించి త్వరలో టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీతోనూ సమావేశం నిర్వహిస్తా. ప్రస్తుతం ఇక్కడ చేయాల్సింది ఎంతో ఉంది’అని కేసీఆర్‌ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. 

ప్రపంచంలోనే అత్యుత్తమ రెవెన్యూ చట్టం రూపొందించాం..

బ్రిటిష్‌ పాలన కాలంలో తయారైన రెవెన్యూ చట్టాలే ఇంకా చెల్లుబాటులో ఉన్నాయని, రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకత లోపించడంతో భూ వివాదాలు పెరిగిపోతున్నాయని, అందుకే సుమారు రెండు, మూడేళ్లుగా కసరత్తు చేసి దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత పారదర్శకమైన రెవెన్యూ చట్టాన్ని తయారు చేశామని కేసీఆర్ సగర్వంగా ప్రకటించారు. ఇకపై వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌ బాధ్యతలు తహసీల్దార్లకు అప్పగిస్తామని, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ బాధ్యతను రిజిస్ట్రార్లు నిర్వహిస్తారనీ, కొత్త రెవెన్యూ చట్టం నిబంధనలకు లోబడి కొత్త పాస్‌పుస్తకాలు కూడా జారీ చేస్తామనీ సీఎం చెప్పారు. 

వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసి, వారిని ఇతర చోట్ల సర్దుబాటు చేస్తాం అని చట్టంలోని అంశాల గురించి సీఎం సుదీర్ఘంగా వివరించారు. అసెంబ్లీలో రెవెన్యూ చట్టం ఆమోదం పొందిన తర్వాత ఊరూరా బాణసంచా పేల్చి సంబురాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో సోమవారం సాయంత్రం జరిగిన టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష సమావేశంలో కేసీఆర్‌ ప్రసంగించారు. శాసనసభ వాయిదా అనంతరం తెలంగాణ భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి దివంగత దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా పార్టీ శాసనసభా పక్షాన్ని ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ సుమారు గంటపాటు ప్రసంగించారు. ‘కేంద్రంలో బీజేపీ చేస్తున్న తప్పిదాలను ఆయుధాలుగా మలచుకోవడంలో కాంగ్రెస్‌ పదేపదే విఫలమవుతోంది. జాతీయ పార్టీలు అభివృద్ధి, సంక్షేమాన్ని మరిచి పాకిస్తాన్‌ వంటి ఇతర అంశాలను బూచిగా చూపిస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి. 

దుబ్బాక మనదే.. లక్ష ఓట్లతో గెలుస్తున్నాం. 

‘సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ స్థానాన్ని లక్ష ఓట్ల మెజారిటీతో గెలుచుకుంటాం. బస్సు కిరాయిలు లేని స్థితిలో ఉన్న రామలింగారెడ్డిని రాజకీయంగా ఎంతో ప్రోత్సహించా. ఆయన కూడా ఎంతో కష్టపడి రాజకీయాల్లో రాణించాడు. ఆయన కుటుంబానికి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటాం. దుబ్బాకలో గెలుస్తామంటూ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు డబ్బాలో రాళ్లు వేసినట్లు హడావుడి చేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో హడావుడి చూసి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’అని సీఎం వ్యాఖ్యానించారు. 

జీహెచ్‌ఎంసీలో వందకు పైగా సీట్లు మనవే..

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు మూడు రకాల సర్వేలు నిర్వహించగా 92 నుంచి 110 స్థానాలు వస్తాయని తేలింది. అంతమాత్రాన స్థానిక ఎమ్మెల్యేలు ఆషామాషీగా వ్యవహరించకుండా సమన్వయంతో పనిచేస్తూ, మనం చేసిన అభివృద్దిని ప్రజలకు వివరించాలి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇతర జిల్లాల ఎమ్మెల్యేల సహకారం కూడా తీసుకుంటాం అని కేసీఆర్‌ ప్రకటించారు. 

కరోనా పోరులో కేంద్ర సాయం శూన్యం 

‘కరోనా ప్రభావంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ పూటకో మాట చెప్తుండటంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రానికి రూ.12 వేల కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా రూ.300 కోట్లకు పడిపోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. వలస కార్మికుల వెతలు చూసి ఎంతో చలించిపోయా, వారు స్వస్థలాలకు చేరుకునేందుకు కొంత గడువు ఇవ్వాలనే వినతిని కేంద్రం పట్టించుకోకుండా లాక్‌డౌన్‌ విధించడంతో అనేక ఇబ్బందులు పడ్డారు. కేంద్రం నుంచి సాయం అందకున్నా బీజేపీ మాత్రం దుష్ప్రచారం చేస్తోంది. అసెంబ్లీ 18 రోజుల పాటు కొనసాగుతున్నందున సభ్యులు ప్రభుత్వ కార్యక్రమాలను సభా వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి‘అని సీఎం కేసీఆర్‌ శాసనసభా పక్ష సమావేశంలో దిశానిర్దేశం చేశారు.

 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   2 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   20 minutes ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   5 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle