newssting
Radio
BITING NEWS :
భారీ విధ్వంసం సృష్టిస్తూ బుధవారం అర్థరాత్రి పుదుచ్చేరి వద్ద తీరం దాటిన నివర్ తుఫాన్. తీరందాటే సమయంలో భీకర గాలుల ధాటికి నేలకూలిన భారీ వృక్షాలు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత. * నివర్ తుఫాన్ ప్రభావంతో చిగురుటాకులా వణికిపోతున్న తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు. గత అర్థరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వాలు. ఇళ్లు సురక్షితం కాకుండా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచన. * తుఫాను సమయంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు. నెల్లూరు జిల్లా , తమిళనాడుకు చెందిన మత్స్యకారులు సేఫ్. శ్రీహరికోట తీరంలో తలదాచుకున్న మత్స్యకారులు. * ఎన్టీఆర్ ఘాట్ కూల్చాలన్న ఎంఐఎం వ్యాఖ్యల్ని ఖండించిన టీడీపీ నేతలు. ఎన్టీఆర్ పై అభిమానముంటే భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసిన టీడీపీ నేతలు. * అక్బరుద్దీన్ కు గట్టి కౌంటరిచ్చిన బీజేపీ నేత బండి సంజయ్. దమ్ముంటే పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్ ఘాట్లను కూల్చాలని సవాల్. వారి ఘాట్లను కూల్చిన వెంటనే దారుస్సలాంను కూల్చివేస్తామన్న బండి సంజయ్. * తెలంగాణలో కొత్తగా మరో 862 కరోనా కేసులు, ముగ్గురు మృతి. * సమ్మె చెేపట్టిన సింగరేణి కార్మికులు. కేంద్రం చేపట్టిన కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సమ్మె. సమ్మెలో పాల్గొన్న నాలుగు కార్మిక సంఘాలు. * 26/11 ముంబై ఉగ్రదాడులకు నేటితో 12 ఏళ్లు పూర్తి. ఉగ్రదాడుల్లో అమరులైన వారికి నివాళులర్పించిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, గవర్నర్.

జర్నలిస్టులకు కరోనా పాజిటివ్.. జాగ్రత్త అంటూ కవిత ట్వీట్

21-04-202021-04-2020 13:29:58 IST
Updated On 21-04-2020 13:37:26 ISTUpdated On 21-04-20202020-04-21T07:59:58.328Z21-04-2020 2020-04-21T07:56:01.820Z - 2020-04-21T08:07:26.329Z - 21-04-2020

జర్నలిస్టులకు కరోనా పాజిటివ్..  జాగ్రత్త అంటూ కవిత ట్వీట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.  ముంబైలో జర్నలిస్టులకు కరోనా వైరస్‌ పాజిటివ్ రావడంపై రాజకీయ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. న్యూస్ కవరేజ్ కొరకు బయటకు వెళ్తున్న జర్నలిస్టులకు కరోనా వైరస్ సోకుతోది. దీంతో మీడియా మిత్రులు అప్రమత్తంగా ఉండాలని పలువురు రాజకీయ నేతల సూచిస్తున్నారు.ముంబై నగరంలో భారీ సంఖ్యలో జర్నలిస్టులు కూడా కరోనా బారినపడ్డారు.చెన్నైలో ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్‌కు చెందిన 26మంది కరోనా పాజిటివ్ అని తేలింది. ఆస్పత్రులు, మార్కుట్‌లకు ఫీల్డ్‌ రిపోర్టింగ్‌కు వెళ్లి న్యూస్ కవర్ చేసిన రిపోర్టర్ల ద్వారా ఆఫీసులో పనిచేస్తున్న ఛానల్ సిబ్బందికి కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీంతో అందర్నీ చెన్నై జీజీహెచ్‌కు క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. ఇతర ప్రాంతాల్లో కూడా మీడియా సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. దీంతో కేంద్రమంత్రులు , రాజకీయ ప్రముఖులు జర్నలిస్టులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Image may contain: text

ముంబైలో మొత్తం 170 మంది రిపోర్టర్లు, వీడియో జర్నలిస్టులు, డ్రైవర్లకు కరోనా పరీక్షలు నిర్వహించగా, 53 మందికి పాజిటివ్ అని తేలింది. వీరిలో ఎవరిలోనూ కరోనా లక్షణాలు కనిపించలేదు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ జర్నలిస్టుకు కూడా కరోనా సోకింది. అంతకుముందు ఆయన కమల్‌నాథ్ సమావేశంలో ఆయన పాల్గొనడంతో కలకలం రేగింది. జర్నలిస్టులు కరోనా బారిన పడుతుండటంతో మీడియా సంస్థల యాజమాన్యాలు ముంబైలో రిపోర్టర్లను క్షేత్రస్థాయి రిపోర్టింగ్‌కు పంపవద్దని ఎడిటర్స్ గిల్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ శేఖర్ గుప్తా, న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్‌ను పలువురు జర్నలిస్టులు కోరారు.

ముంబైలో 53 మంది జ‌ర్న‌లిస్టుల‌కు క‌రోనా సోకిన విషయం తెలిసిందే. సోమవారం బీఎంసీ (బృహన్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌) నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో ఈ విష‌యం వెల్ల‌డైంది. ఏప్రిల్ 16,17 తేదీల్లో రిపోర్ట‌ర్లు, కెమెరామ‌న్‌లు క‌లుపుకుని మొత్తంగా 167 మంది జ‌ర్న‌లిస్టుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా వీరిలో సుమారు 53 మందికి సోకిందని తేలింది. మరోవైపు తమిళనాడులోనూ ముగ్గురు విలేఖరులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వైరస్ రాష్ట్రపతి భవన్‌కూ పాకింది. రాష్ట్రపతి భవన్‌లో పనిచేసే ఓ పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబ సభ్యుడికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో అతనికి కూడా వైరస్‌ సోకి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అతనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే అంతకుముందే అతని కుటుంబంలో ఒకరు వైరస్‌ కారణంగా మృతి చెందారు.

దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు కరోనా వైరస్ సోకడంపై నిజామాబాద్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు. జర్నలిస్ట్‌లకు కరోనా సోకడం దురదృష్టకరమని, విషయం తెలిసి ఎంతో కలత చెందానని అన్నారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా  ఓ పోస్ట్‌ చేశారు. ‘ముంబైలో జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ రావడం దురదృష్టకరం. కరోనాపై పోరాటంలో జర్నలిస్టు మిత్రులు ముందుండి పోరాడుతున్నారు. ప్రజల వద్దకు వార్తలను చేరవేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి’ అని ట్వీట్‌ చేశారు. కరోనా వైరస్ కు సంబంధించి వార్తలు సేకరించే మీడియా మిత్రులే ఈ వైరస్ బారిన పడడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదంటున్నాయి యాజమాన్యాలు. పలు మీడియా సంస్థలు న్యూస్ కవరేజ్ కు వెళ్లిన రిపోర్టర్లు, కెమెరామెన్లు ఆఫీసు లోపలికి రాకుండా ఇంటికి వెళ్లి స్నానాలు చేసి డ్రెస్ మార్చుకుని పూర్తి శుభ్రతతో ఆఫీసుకి రావాలని సూచిస్తున్నాయి. డ్యూటీకి వెళ్లి వచ్చినవారు ఇంట్లోనే కుటుంబ సభ్యులను, చిన్నపిల్లలను తాకవద్దని సూచిస్తున్నాయి. 

మహిళా ఖైదీలకు శుభ‌వార్త చెప్పిన జ‌గ‌న్ స‌ర్కార్‌

మహిళా ఖైదీలకు శుభ‌వార్త చెప్పిన జ‌గ‌న్ స‌ర్కార్‌

   9 hours ago


ప్ర‌చారం చివ‌రి రోజున భాగ్య‌న‌గ‌రానికి వ‌స్తున్న మోదీ.. మ‌త‌ల‌బేంటీ..?

ప్ర‌చారం చివ‌రి రోజున భాగ్య‌న‌గ‌రానికి వ‌స్తున్న మోదీ.. మ‌త‌ల‌బేంటీ..?

   9 hours ago


అమూల్ చేతికి సహకార డైరీలు.. అసలు రహస్యం ఇదే?! (పార్ట్-1)

అమూల్ చేతికి సహకార డైరీలు.. అసలు రహస్యం ఇదే?! (పార్ట్-1)

   9 hours ago


బండ్ల గ‌ణేశ్ కు ఇంట్లో బ్యాండుమేళం..!

బండ్ల గ‌ణేశ్ కు ఇంట్లో బ్యాండుమేళం..!

   10 hours ago


అబ్బో.. బీజేపీ మేనిఫెస్టో బందోబ‌స్తుగ‌నే ఉంది..!

అబ్బో.. బీజేపీ మేనిఫెస్టో బందోబ‌స్తుగ‌నే ఉంది..!

   11 hours ago


'కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలె' కేటీఆర్ సెటైర్లు

'కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలె' కేటీఆర్ సెటైర్లు

   12 hours ago


మొన్న స‌ర్జిక‌ల్, నిన్న కూల్చివేతలు, రేపేంటి..?

మొన్న స‌ర్జిక‌ల్, నిన్న కూల్చివేతలు, రేపేంటి..?

   13 hours ago


పంప‌కాల్లో తేడాలు.. వైసీపీలో గొడ‌వలు

పంప‌కాల్లో తేడాలు.. వైసీపీలో గొడ‌వలు

   13 hours ago


పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం.. ఇదీ ఏపీలో ఉద్యోగుల పరిస్థితి!

పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం.. ఇదీ ఏపీలో ఉద్యోగుల పరిస్థితి!

   13 hours ago


తెలంగాణ‌లో ఎంత మంది మంత్రి ప‌ద‌వులు ఊడ‌తాయో..!

తెలంగాణ‌లో ఎంత మంది మంత్రి ప‌ద‌వులు ఊడ‌తాయో..!

   13 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle