జరిమానాలు, శిక్షల్ని పట్టించుకోని మందుబాబులు
20-01-202020-01-2020 08:33:58 IST
2020-01-20T03:03:58.504Z20-01-2020 2020-01-20T03:03:53.284Z - - 16-04-2021

డ్రంక్ అండ్ డ్రైవ్ ఇప్పుడు మామూలైపోయింది. పోలీసులకు దొరకకుండా వాహనదారులు నానా దారులు వెతుక్కుంటున్నారు. హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా వీకెండ్స్ లో మందుబాబులు తెగ రెచ్చిపోతున్నారు. పోలీసులు తనిఖీలు చేసేచోట కాకుండా వేరే దారిలో వారు వెళుతున్నారు. అయితే అంతా ఊహించే ప్రాంతాలలో కాకుండా వేరే చోట్ల పోలీసులు బ్రీత్ ఎనలైజర్లు ఏర్సాటుచేసి మందుబాబులకు చెక్ పెడుతున్నారు. మిగతా రోజుల్లో ఎలా వున్నా శుక్రవారం రాత్రి, శని, ఆదివారాల్లో వివిధ ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. అయితే మందుబాబులు మాత్రం ఇవన్నీ పట్టించుకోవడం లేదు. పట్టుకుంటే పట్టుకోండి మాకేంటి భయం అన్న రీతిగా మందుతాగి వాహనాలపై రయ్యిన వెళ్లిపోతున్నారు. మద్యం సేవించి వాహనాలను నడపొద్దని పోలీసులు ఎంత చెప్పినా వారిలో మార్పు రావడం లేదు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో మందుబాబుల కిక్ దించుతూనే వున్నారు పోలీసులు. ఈమధ్య మద్యం తాగి వాహనాలు నడుపుతూ 32 మంది వాహనదారులు పట్టుబడ్డారు.వీరిపై కేసులు నమోదు చేసి 16 కార్లు,16 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డవారిలో నలుగురు మహిళలు కూడా ఉండడం విశేషం. మద్యం తాగి దొరికిపోయిన వాళ్లందరికీ కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి కోర్టులో హాజరుపరుస్తున్నా వారు మాత్రం కొన్నాళ్ళకు పాత దారిలోనే వెళుతున్నారు. మందుబాబుల పుణ్యమాని కేసులతో కోర్టులు నిండిపోతున్నాయి. జరిమానాలతో ఖజానాకు కాసుల వర్షం కురుస్తోంది. దీనికి కారణం అన్ని వేళల్లో మద్యం అందుబాటులో ఉండడమేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మద్యం షాపులకు, ఎక్సైజ్ శాఖకు భారీ లక్ష్యాలు నిర్దేశించడంతో అమ్మకాలు పెంచుకునేందుకు మద్యం షాపుల యజమానులు నిబంధనలను కూడా పక్కన పెట్టేస్తున్నారు. మందుబాబులు కూడా తామే భారీ టాక్స్ పేయర్స్ మని, తమ వల్లే ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతోందని అంటున్నారు.

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
an hour ago

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
14 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
10 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
13 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
15 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
17 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
19 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
20 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
a day ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
a day ago
ఇంకా