newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జనగామలో ‘ఢిల్లీ’ భయం... బిక్కుబిక్కుమంటున్న జనం

01-04-202001-04-2020 11:56:31 IST
2020-04-01T06:26:31.965Z01-04-2020 2020-04-01T06:26:07.620Z - - 16-04-2021

జనగామలో ‘ఢిల్లీ’ భయం... బిక్కుబిక్కుమంటున్న జనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా భయం తగ్గుతుందని భావిస్తున్న వేళ ఒక్కసారిగా ఢిల్లీ భయం వెంటాడుతోంది. ఢిల్లీలో ప్రార్ధన మందిరంలో పాల్గొని స్వగ్రామమైన జనగామ జిల్లా నర్మెట్ట మండలం వెల్దండ గ్రామానికి చెందిన కరోనా అనుమానితుడు ఎండి ఖాజామియాను ఐసోలేషన్ కు తరలించారు అధికారులు. కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన వైద్యాధికారులు,  ఐసోలేషన్ వార్డుకు పరీక్షల నిమిత్తం తరలించారు. 

కరోనా అనుమానిత వ్యక్తి ఖాజామియా ఈ నెల 13వ తేదీ నుండి 15 వ తేదీ వరకు మార్కజ్ ప్రార్ధన మందిరం సభకు హాజరయ్యాడు. ఈ నెల 18న కాజీపేట కు చేరుకొని స్వగ్రామమైన జనగామ జిల్లా నర్మెట్ట మండలం వెల్దండ కు చేరుకున్నాడు.  కరోనా అనుమానిత వ్యక్తి ఖాజామియా మటన్ వ్యాపారి, ఇతను అక్కడి నుంచి వచ్చిన తరువాత రెండు సార్లు మటన్ కొట్టి అమ్మాడు..దీంతో వెల్దండ గ్రామంలోని  మటన్ తీసుకున్న వారందరికీ హోం క్వారయింటెన్లో ఉండాలని 35 మంది పైగా ఇళ్ళకు నోటీసులు జారీచేశారు. దీంతో భయాందోళనలో వెల్దండ గ్రామ ప్రజలు ఇళ్ళల్లోంచి బయటకి రావడానికి భయపడిపోతున్నారు.

ఇటు రంగారెడ్డి జిల్లాలోని గండిపేట్ మండలంలోని బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలోని సన్ సిటీ, పీఅండ్ టీ కాలనీలో  కరోనా వైరస్ కలకలం రేపింది. ఈ కాలనీలకు చెందిన ఆరుగురు ఢిల్లీలో జరిగిన ప్రార్థనలో పాల్గొనట్లు సమాచారం అందటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

ప్రస్తుతం వీరందరినీ రాజేంద్రనగర్ యూనివర్సిటీలోని  ఐసోలేషన్ వార్డ్ కు తరలించారు. ఢిల్లీ జమాత్ లోంచి హైదరాబాద్ కు చేరుకున్న సుమారు 37 మంది ను మూడు అంబులెన్స్ లలో హాబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని, మల్లేపల్లి బడి మజిద్ నుంచి బేగంపేట్ నేచర్ క్యూర్ సెంటర్ కు టెస్ట్ కోసం తరలించారు.

ఫిబ్రవరి 28 న ఢిల్లీ నుంచి బయలుదేరి అక్కడ నుండి తిరుగుతూ మార్చి 24 న హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇందులో 13 మంది ఢిల్లీ కు చెందిన వాళ్ళు మరియు 24 మంది హైదరాబాద్ కు చెందిన వారున్నారు. ఢిల్లీలో జరిగిన మత ప్రార్ధనల్లో పాల్గొన్న కుటుంబాల వద్దకు వైద్యారోగ్యశాఖ తో పాటు పోలీసులు, రెవెన్యూ అధికారులు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడితో పాటు జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగి, నర్మెట మండలం వెల్లండకు చెందిన వాసిగా తేలింది.

ఇందులో వెల్లండ గ్రామానికి చెందిన వ్యక్తితో పాటు ఆయన భార్య, కుమారుడిని రెస్క్యూ టీం పర్యవేక్షణలో సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. జనగామకు చెందిన ఇద్దరిని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి వారి కుటుంబీకులను హోం ఐసోలేషన్‌లోనే ఉంచారు. వీరికి సంబంధించిన నివేదికలు వచ్చాక అధికారులు వివరాలు వెల్లడిస్తారు.ఢిల్లీ ఘటన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో బ్లీచింగ్‌ చేస్తుండగా, వెల్లండ గ్రామంలో ఇంటింటి సర్వే చేస్తున్నారు.

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   15 minutes ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   14 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   10 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   12 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   14 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   17 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   18 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   20 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   21 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle