జగ్గారెడ్డి సాఫ్ట్ కార్నర్.. కేసీయార్ పై ప్రశంసలు
28-04-202028-04-2020 09:44:58 IST
Updated On 28-04-2020 09:58:49 ISTUpdated On 28-04-20202020-04-28T04:14:58.198Z28-04-2020 2020-04-28T04:13:38.242Z - 2020-04-28T04:28:49.842Z - 28-04-2020

తూర్పు జయప్రకాష్ రెడ్డి. అలియాస్ జగ్గారెడ్డి సంగారెడ్డి శాసనసభ్యుడు. సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే. గతంలో కేసీయార్ తో ఢీఅంటే ఢీ అని ఢీకొన్న నేత. తాజాగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గడంపై ఆయన వ్యాఖ్యలు చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో డిసెంబర్ వరకు లాక్డౌన్ పొడిగించాలని జగ్గారెడ్డి కోరారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే లౌక్డౌనే మంచి పరిష్కారమన్నారు. మే నెల నుంచి వరుసగా రంజాన్, బోనాలు, బతుకమ్మ పండుగలు ఉన్నాయని చెప్పారు. లాక్డౌన్ వల్ల మాత్రమే కరోనాను కట్టడి చేయలేమని కాంగ్రెస్ నేత రాహుల్ అన్నారని గుర్తుచేశారు. ప్రభుత్వం సమర్థవంతంగా ధాన్యం కొనుగోలు చేస్తుందని, అకాల వర్షాలతో నష్టపోయిన మామిడి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. పార్టీలన్నీ డిసెంబర్ వరకు రాజకీయ విమర్శలు మానుకోవాలని జగ్గారెడ్డి సూచించారు. పేదలు ఈ కష్టకాలంలో నలిగిపోతున్నారని వారు ఎలా నిలదొక్కుకోవాలో ఆర్థిక నిపుణులు, మేధావులు,. కేసీఆర్ సర్కారకు సూచనలివ్వాలని అభ్యర్థించారు. లాక్ డౌన్ ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఆర్ధికవేత్తలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరుపాలని... ఈ సూచనలపై సీఎం కేసీఆర్ ఆలోచించాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. వైరస్ విస్తరించకుండా ఉండాలంటే లాక్ డౌన్‌ను ఇంకా పొడిగించాల్సిన అవసరం ఉంది. రెండు, మూడు నెలలు పొడిగిస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి..’ అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. కరోనా నియంత్రణ విధుల్లో ఉన్న పోలీసులకు, వైద్యసిబ్బందికి అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. గతంలోనూ జగ్గారెడ్డి వైఖరిలో మార్పు వచ్చింది. సీఎం కేసీయార్ పట్ల సాఫ్ట్ కార్నర్ కనిపిస్తోందని అంటున్నారు. మిగతా కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా వీహెచ్ లాంటివారు అఖిలపక్ష సమావేశం కావాలని కోరుతుంటే జగ్గారెడ్డి మాత్రం కేసీయార్ నిర్ణయాలను స్వాగతించడం కాంగ్రెస్ నేతలకు రుచించడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు జాగ్రత్తతో కేంద్ర ప్రభుత్వం కంటే ఎక్కువ రోజులు లాక్‌డౌన్‌ను అమలు చేయడం దూరదృష్టితో కూడుకున్న నిర్ణయమని గతంలో అభిప్రాయపడ్డారు. పరిస్ధితి మెరుగుపడుతున్న దశలో ఒక్కసారిగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే పరిస్ధితి మరింత ఆందోళనకరంగా మారడం ఖాయం అన్నారు.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
13 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
14 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
14 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
18 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
19 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
17 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
20 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
20 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
15 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
a day ago
ఇంకా