newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జగ్గారెడ్డి వర్సెస్‌ హరీష్‌రావు మళ్లీ ఏం జరిగింది?

24-12-201924-12-2019 10:04:58 IST
Updated On 24-12-2019 11:23:27 ISTUpdated On 24-12-20192019-12-24T04:34:58.745Z24-12-2019 2019-12-24T04:34:54.548Z - 2019-12-24T05:53:27.585Z - 24-12-2019

జగ్గారెడ్డి వర్సెస్‌ హరీష్‌రావు మళ్లీ ఏం జరిగింది?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎప్పుడు ఎవరిపై ఫైర్‌ అవుతారో అర్థంకాదు.. తన నోటితో పొగిడిన వ్యక్తినే.. మళ్లీ విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. తాజాగా అదే పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుని టార్గెట్‌ చేస్తూ మళ్లీ జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు హరీష్‌రావు ప్రజానాయకుడు కాదని, కేవలం సీఎం కేసీఆర్‌ తన మామకావటంతోనే హరీష్‌రావుకు పేరు వచ్చిందని తీవ్రవ్యాఖ్యలు చేశారు.

ఇటీవల వరకు హరీష్‌రావుపై జగ్గారెడ్డి విమర్శలు చేస్తూనే వచ్చాడు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగ్గారెడ్డి అరెస్టు తదితర కారణాల నేపథ్యంలో హరీష్‌రావును, సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌గా తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్‌, హరీష్‌రావులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. 2018 ఎన్నికల అనంతరం కొద్దిరోజుల తరువాత మళ్లీ జగ్గారెడ్డి తన రూటు మార్చి సీఎం కేసీఆర్‌పై పొగడ్తల వర్షం కురిపించారు.

హరీష్‌రావు ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజులకే జగ్గారెడ్డి వెళ్లి హరీష్‌రావును అభినందించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు గ్రేట్‌ లీడర్‌ అంటూ ప్రశంసలు కురిపించారు. తనకు హరీష్‌రావుకు ఎలాంటి విబేధాలు లేవని, కేవలం నియోజకవర్గం అభివృద్ధే తన ధ్యేయమంటూ చెప్పుకొచ్చారు. హరీష్‌రావుతో కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకొనేలా కృషి చేస్తానని జగ్గారెడ్డి తెలిపారు. దీంతో కొన్నేళ్లుగా హరీష్‌రావు, జగ్గారెడ్డి మధ్య సాగుతున్న రాజకీయ వైరంకు తెరపడినట్లయింది.

తాజాగా ఊహించని రీతిలో మళ్లీ జగ్గారెడ్డి హరీష్‌రావుపై విమర్శల దాడికి తెరలేపారు. గతంలో నేను చెప్పినా వినకుండా సింగూరు జలాలను హరీశ్‌ రావు తరలించారంటూ మండిపడ్డారు. దీనివల్ల సంగారెడ్డిలో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయని, ఈ ప్రాంతాల్లో బోరు బావుల నుంచి చుక్క నీరు కూడా రాని పరిస్థితి ఉందంటూ మండిపడ్డారు. హరీశ్‌ ప్రజా నాయకుడు కాదని.. తన మామ కేసీఆర్‌ పేరుతో మాత్రమే ఆయన ఎదిగారని విమర్శించారు. హరీష్‌రావు షార్ట్‌కట్‌లో నాయకుడు అయ్యారని ఎద్దేవా చేశారు. ఇక ఆయన మంత్రిగా పనికి వస్తారా? లేదా? అనేది కాలమే చెబుతుందని ఆరోపించారు.

సింగూరుకు గోదావరి నీటిని తీసుకొచ్చి, సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ప్రజల మధ్యే హరీశ్‌ను నిలదీస్తానని జగ్గారెడ్డి హెచ్చరించారు. ఈ నెల 31 వరకే హరీశ్‌ రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి స్వేచ్ఛగా తిరగగలుగుతారని, ఆ తర్వాత వారి వల్ల కాదని తేల్చి చెప్పారు. సంగారెడ్డిలో నీటి సమస్య పరిష్కరించకపోతే వచ్చే నెల 2న భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. తనను ఆపడం పోలీసుల వల్ల కూడా కాదని హెచ్చరించారు.

జగ్గారెడ్డి వ్యాఖ్యలతో మళ్లీ హరీష్‌రావు వర్సెస్‌ జగ్గారెడ్డిగా సంగారెడ్డి రాజకీయాలు మారిపోయాయి. హరీష్‌రావు వర్గీయులుసైతం జగ్గారెడ్డి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. జగ్గారెడ్డి తన స్వార్థం కోసం రాజకీయాలు చేస్తాడని, ఎప్పుడు ఎలా మాట్లాడుతాడో ఆయనకే అర్థంకాని వ్యక్తి అంటూ విమర్శించారు.

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు జగ్గారెడ్డి చేసిన అభివృద్ధి శూన్యమని, తన్నీరు హరీష్‌రావు కృషితోనే సంగారెడ్డిలో అభివృద్ధి జరిగిందని అన్నారు. ఇరువర్గాల మధ్య వాదనలతో మళ్లీ సంగారెడ్డి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జనవరి 2న తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పిన జగ్గారెడ్డి.. ఆమేరకు ముందుకెళ్తున్నారు. మరి రాబోయే కాలంలో హరీష్‌రావు, జగ్గారెడ్డి మధ్య వివాదం ఏమేరకు మలుపు తిరుగుతుందోనని జిల్లా వాసులు ఆసక్తిగా గమనిస్తున్నారు.  

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   4 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   6 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   an hour ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   8 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   8 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   29 minutes ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   2 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   8 hours ago


ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

   10 hours ago


బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   18-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle