newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జగ్గారెడ్డి మనసులో మాట అదేనా?

11-12-201911-12-2019 12:48:01 IST
Updated On 11-12-2019 13:00:41 ISTUpdated On 11-12-20192019-12-11T07:18:01.818Z11-12-2019 2019-12-11T07:17:59.498Z - 2019-12-11T07:30:41.349Z - 11-12-2019

జగ్గారెడ్డి మనసులో మాట అదేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?

పీసీసీ అధ్యక్ష పీఠం దక్కేదెవరికి?

సంగారెడ్డి ఎమ్మెల్యే వ్యూహం ఏంటి?

జగ్గారెడ్డి ఎవరికి మద్దతిస్తున్నారు?

చటాన్ పల్లి ఎన్ కౌంటర్ పై జగ్గారెడ్డి కామెంట్స్ కి అర్థం ఏంటి?

జగ్గారెడ్డి మనసులో మాట ఏంటి?

పీసీసీ రేసులో జగ్గారెడ్డి లేనట్టేనా?

జగ్గారెడ్డి కామెంట్స్‌కి అర్థం ఏంటి?

తెలంగాణ కాంగ్రెస్ లో విలక్షణ వ్యక్తి, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. కేసీయార్ కి పాలాభిషేకం చేస్తానంటారు. కేసీయార్ కు గుడి కడతానంటారు. ఆయనేం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారితీస్తుంది. తాజాగా జగ్గారెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి గురించి మాట్లాడారు.

అంతేకాదు దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. 21 రోజుల్లో శిక్ష పడేలా చట్టం చేస్తా అని ఏపీ సీఎం జగన్ చెప్పడాన్ని స్వాగతిస్తున్నా అన్నారు జగ్గారెడ్డి. కేసీఆర్ కూడా అలాంటి చట్టం తేవాలని కోరుతున్నానని, 2023లో డబ్బులు ఇవ్వకున్నా కాంగ్రెస్ కే జనం ఓటేస్తారన్నారు జగ్గారెడ్డి. 

సీఎం కేసీఆర్ నేనే ఎన్ కౌంటర్ చేయించా అని అనలేదని, అందుకే తాను ఎన్ కౌంటర్ పై స్పందించలేదన్నారు. చట్టసభల్లో సభ్యులం కాబట్టి దోషులు ఎలాంటి వారైనా, వారికి న్యాయపరంగా శిక్ష పడితే బాగుండు అనేదే తమ ఆలోచన అన్నారు. పీసీసీ నియామకం వెనుక డబ్బుతో సంబంధం ఉండదన్నారు. రూ. 1000 కోట్లు ఖర్చు పెడతానని చెప్పినా పీపీసీ అధ్యక్ష పదవిని అధిష్టానం కట్టబెట్టదన్నారు. కేసీఆర్, జగన్, నేను ఆడపిల్ల తండ్రిగా ఎన్ కౌంటర్ ని సమరిస్తున్నాం అన్నారు జగ్గారెడ్డి.

పీసీసీ అధ్యక్ష పదవికి అధిష్టానం ఎవరిని ఎంపికచేస్తుందో తెలీదన్నారు. అయితే, వివాదాలు లేని నాయకులే పీసీసీ అధ్యక్షుడవుతారన్నారు. కాంగ్రెస్ పార్టీలో కాంట్రవర్సీ లేని వాళ్ళు నేతలు ఇద్దరే అన్నారు జగ్గారెడ్డి. శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి లే వివాదరహితులు అన్నారు. వివిధ వివాదాల్లో ఉన్న నాయకులు పీసీసీ పరిశీలన జాబితాలో మాత్రమే ఉంటారని అంతిమంగా లభించేది అలాంటి నాయకులకే అన్నారు జగ్గారెడ్డి. 

కాంగ్రెస్ లో నేతలు ఎక్కువగా ఉంటారని, సింగిల్ హీరోలు తమ పార్టీలో ఉండరన్నారు. రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ.. ఎలా ఎవరైనా వ్యక్తిగతంగా ఎదగవచ్చు అన్నారు.

వ్యక్తిగతంగా ఏ నాయకుడు ఎదిగినా వారిని శాసించేది మాత్రం గాంధీభవనే అన్నారు జగ్గారెడ్డి. రేవంత్ రెడ్డి మరో పవర్ సెంటర్ అని జరిగే ప్రచారంలో తప్పులేదన్నారు. రేవంత్ ఎంత బలపడితే కాంగ్రెస్ కి అంత బలం అంటున్నారు జగ్గారెడ్డి.

పార్టీలో వ్యక్తిగతంగా ఎవరు ఎదిగినా అది కాంగ్రెస్ కే మేలు జరుగుతుందని, దానిగురించి అంతగా బాధపడాల్సిన పనిలేదన్నారు. పీసీసీ అధ్యక్ష పదవికి జగ్గారెడ్డి కూడా తన బయోడేటా పంపించిన సంగతి తెలిసిందే. జగ్గారెడ్డి తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతున్నాయి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle