newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జగ్గారెడ్డి చొరవతో దుబ్బాక ఎన్నిక ఏకగ్రీవం అయ్యేనా?

07-08-202007-08-2020 10:02:24 IST
Updated On 07-08-2020 10:38:29 ISTUpdated On 07-08-20202020-08-07T04:32:24.856Z07-08-2020 2020-08-07T04:26:46.515Z - 2020-08-07T05:08:29.119Z - 07-08-2020

జగ్గారెడ్డి చొరవతో దుబ్బాక ఎన్నిక ఏకగ్రీవం అయ్యేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతోంది. సిద్ధిపేట జిల్లా దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మృతితో అక్కడ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కేంద్ర ఎన్నిక సంఘానికి నివేదిక పంపిన అనంతరం ఇక్కడ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రానుంది. సీనియర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత రామలింగారెడ్డి స్థానంలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై టీఆర్ఎస్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

దుబ్బాక నియోజకవర్గానికి చెందిన ఆయన.. నాలుగు సార్లు శాసనసభ్యుడిగా గెలుస్తూ వచ్చారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడుగా మెలిగారు. రామలింగారెడ్డికి కేసీయార్ కి మధ్య ఎంతో అనుబంధం ఉంది. 2001లో మలిదశ తెలంగాణ ఉద్యమంలో రామలింగారెడ్డి కీలకపాత్ర పోషించారు. కేసీఆర్‌ 2001లో టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించినప్పటి నుంచి ఆయన జర్నలిస్టుగా ఉంటూనే పలు కథనాలు రాసి ఉద్యమ బలోపేతానికి కృషి చేశారు. కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేసే క్రమంలో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లినపుడు రామలింగారెడ్డి వెన్నంటి ఉండి ఆయన గెలుపులో ముఖ్యపాత్ర పోషించారు. 

అప్పటి నుంచి రామలింగారెడ్డి కేసీఆర్‌కు బాగా దగ్గరయ్యారు. కేసీఆర్‌ రామలింగారెడ్డిని పిలిచి 2004లో టీఆర్‌ఎస్‌ తరపున దొమ్మాట నియోజకవర్గం టికెట్‌ ఇచ్చా రు. ఆ ఎన్నికల్లో రామలింగారెడ్డి గెలవడం ద్వారా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. 2008 ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిచిన ఆయన 2009లో ఓటమిపాలయ్యారు. మళ్లీ 2014, 2018 ఎన్నికల్లో గెలుపొందారు.

తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమం లో భాగంగా రామలింగారెడ్డిపై 30కిపైగా పోలీస్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ ఏర్పడ్డాక కూడా రామలింగారెడ్డికి దుబ్బాక సీటిచ్చారు. మరి రామలింగారెడ్డి భార్య సుజాతకు సీటిచ్చి కేసీయార్ తన చాణక్యంతో  ఏకగ్రీవం చేస్తారేమో చూడాలి. ఆయన మృతిపట్ల సంతాపం తెలపడంతో పాటు.. సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు, ఇతర పార్టీల నేతలు కూడా నివాళులర్పించారు.

రామలింగారెడ్డి పార్ధివ దేహానికి అంత్యక్రియలు జరిపే సమయంలో మంత్రి హరీష్ రావు స్వయంగా పాడె మోశారు. రామలింగారెడ్డితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. రామలింగారెడ్డి మరణం పట్ల తీవ్ర సంతాపం ప్రకటించిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒక ప్రతిపాదన తెరమీదకు తెచ్చారు. దుబ్బాక ఉప ఎన్నికలో రామలింగారెడ్డి భార్యకే టికెట్ ఇవ్వాలని కోరారు. ఆయన భార్యకు టికెట్ ఇస్తేనే రామలింగారెడ్డికి నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందన్నారు. 

రామలింగారెడ్డి భార్యకు టికెట్ ఇస్తే.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో తాను మాట్లాడుతానన్నారు జగ్గారెడ్డి. అంతేకాదు తమ పార్టీ సీనియర్ నేతలు మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ, మాజీ మంత్రి గీతారెడ్డితో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తానని అన్నారు.దుబ్బాకలో  ఆయన భార్యను టీఆర్ఎస్ తరపున ఎంపిక చేస్తే పోటీకి రాబోమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెబుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో చూడాలి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle