newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జగన్, కేసీఆర్ మధ్య వ్యవహారం పూర్తిగా చెడినట్లేనా?

23-09-202023-09-2020 13:17:04 IST
Updated On 23-09-2020 13:20:35 ISTUpdated On 23-09-20202020-09-23T07:47:04.170Z23-09-2020 2020-09-23T07:47:01.436Z - 2020-09-23T07:50:35.836Z - 23-09-2020

జగన్, కేసీఆర్ మధ్య వ్యవహారం పూర్తిగా చెడినట్లేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్ ల మధ్య స్నేహ బంధం సంగతేంటి? రెండు రాష్టాల మధ్య వివాదాలు కాస్త రెండు ప్రభుత్వాల మధ్య అగాధాన్ని పెంచేశాయా? కల్వకుంట్ల, వైఎస్ కుటుంబాల మధ్య సామరస్య వ్యవహారం ఇక పూర్తిగా చెడినట్లేనా? అన్న చర్చలు రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాలలో జరుగుతూనే ఉన్నాయి. కేసీఆర్-జగన్ మధ్య స్నేహం గురించి అందరికీ తెలిసిందే. ఔను సీఎం జగన్ మాకు మిత్రుడేనని సీఎం కేసీఆర్ అవకాశం వచ్చిన ప్రతిసారి వెల్లడించగా.. జగన్ మాకు ఆప్తుడేనని షాడో సీఎంగా పేరున్న కేటీఆర్ కూడా పలుమార్లు ప్రకటించారు. 

ఇక అటు నుండి జగన్ కూడా అంతే. సాక్షాత్తు ఏపీ అసెంబ్లీలోనే సీఎం కేసీఆర్ ను ఆహా ఓహో అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. వయసు రీత్యా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య వ్యత్యాసాలు ఉన్నా ప్రభుత్వం పరంగా మా స్నేహం విడదీయరానిది అనేలా పలు సందర్భాలలో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఒకరిపై మరొకరు ప్రశంసల వర్షం కురిపించుకుంటూ ఒకరు ఇళ్లకు మరొకరు ఆప్యాయంగా రాకపోకలు కూడా సాగించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమానికి కూడా సీఎం జగన్ ను ముఖ్య అతిధిగా ఆహ్వానించిన కేసీఆర్ ఇకపై రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగానే తగిన నిర్ణయం తీసుకుంటామని ఇద్దరూ వల్లెవేసి చెప్పారు.

కానీ అంతలోనే చేసుకున్న బాసలు మాసిపోయాయి. ఇద్దరు రాష్ట్రాధిపతుల మధ్య స్నేహగీతాలు ఆగిపోయాయి. వ్యహారం చెడింది కూడా నీళ్ల వ్యవహారంలోనే అని బహిరంగంగా కన్పిస్తున్నదే. సీఎం జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలకు గండి కొట్టేలా ఏపీలో అక్రమ ప్రాజెక్టులకు జీవోలు ఇచ్చారని తెలంగాణ ప్రభుత్వ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతుండగా మాది కానిది మేము ఒక్క టీఎంసి వాడుకోమని జగన్ ఆర్భాటంగా చెప్పారు. ఈ వ్యవహారాన్ని కేంద్ర పెద్దలు పంచాయతీకి పిలిచినా సాకులు చెప్తూ ఇద్దరు ముఖ్యమంత్రులు తప్పించుకుంటూనే ఉన్నారు.

ఒక్క నీళ్ల వ్యవహారమే కాదు ఇప్పుడు రెండు రాష్ట్ర మధ్య బస్సుల వ్యవహారం, లిక్కర్ వ్యవహారం వంటి అంశాలు కూడా ప్రభుత్వాల మధ్య నివురుగప్పిన నిప్పులా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీకి ట్రావెల్స్ బస్సులు తిరుగుతున్నా ఆర్టీసీ బస్సులకు తెలంగాణ నుండి అనుమతులు ఇవ్వలేదు. రెండు రాష్ట్రాల ఆర్టీసీ యాజమాన్యాలు సమావేశమైనా అది కొలిక్కి రాలేదు. అయితే, అసలు వ్యవహారం ప్రభుత్వ పెద్దల వద్ద ఉంది. అధినేతలు తలచుకుంటే అది పెద్ద సమస్య కాదు. కానీ కిందటి స్నేహ సామరస్యం ఇప్పుడు కనిపించకపోవడమే పెద్ద సమస్యగా కనిపిస్తుంది.

ఆర్టీసీ వ్యవహారంలో మరింత పంతానికి పోతున్న ఏపీ ప్రభుత్వం త్వరలో ఈ అంశంపై కోర్టుకు వెళ్లే ఆలోచన కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే న్యాయ సలహాలు తీసుకుంటున్న సీఎం జగన్ మరోసారి ఆర్టీసీ యాజమాన్యాల సమావేశంలో స్పష్టత రాకపోతే కోర్టులకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. ఆర్టీసీ ద్వారానే న్యాయస్థానాలను ఆశ్రయించాలనేది ఏపీ ప్రభుత్వం ఆలోచన. అయితే, అదే జరిగితే రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు మరింత జఠిలం కావడం ఖాయంగా కనిపిస్తుంది. అదే జరిగితే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సంబంధాలు పూర్తిగా చేసినట్లేనని తెలుస్తుంది. మరి తదుపరి పరిస్థితి ఏంటన్నది ఆసక్తిగా చూడాల్సిన అంశమే!

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   5 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   2 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   8 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   11 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   12 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle