newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

జగన్-కెసిఆర్ మధ్య అగాధానికి కారణమిదేనా?

18-11-201918-11-2019 13:34:32 IST
Updated On 18-11-2019 14:56:28 ISTUpdated On 18-11-20192019-11-18T08:04:32.282Z18-11-2019 2019-11-18T08:04:29.125Z - 2019-11-18T09:26:28.658Z - 18-11-2019

జగన్-కెసిఆర్ మధ్య అగాధానికి కారణమిదేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్యోన్యత అనే మాధుర్యాన్ని రెండు రాష్ట్రాల ప్రజలకు రుచిచూపించారు. ఎన్నికలై విజయ తీరాలను అందుకున్న క్షణం నుండే కెసిఆర్-జగన్ ఇద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించారు. ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో ముందుంటామని చెప్పిన మాటలు ఉద్యమం నాటి చేదు ఘటనను మురిపించింది. అలా అలా సాగిన ఆ స్నేహగీతం రాజకీయ ప్రత్యర్థులకు ఈర్ష పుట్టించింది.

కాగా ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య వ్యవహారం చెడిందని రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. దీనికి ఉదాహరణలు చాలానే కనిపిస్తున్నాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టులను నిర్మించుకుంటామని కేంద్రం వద్ద పాలసీలు పెట్టగా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఊసేలేదు. పైగా జగన్ ప్రత్యామ్నాయ ప్రాజెక్టులకు శంకుస్థాపన సన్నాహాలు జరిగిపోతున్నాయి.

ఇక కెసిఆర్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రారంభానికి ముఖ్య అతిధిగా హాజరైన సీఎం జగన్ తాజాగా ఆ కాళేశ్వరం ఏపీ ప్రజలకు నష్టం కలిగిస్తుందని, ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకూడదని అఫిడవిట్స్ జారీచేశారు. ఒక్క కాళేశ్వరం మాత్రమే కాదు తెలంగాణలో మరికొన్ని ప్రాజెక్టుల మీదకూడా అలాంటి అభిప్రాయమే తెలియజేశారు. మొత్తంగా చూస్తే వ్యవహారం చెడిందన్న ప్రచారం నిజమేననిపిస్తుంది.

అయితే అసలు ఇద్దరి మధ్య పెరిగిన ఈ అగాధానికి కారణమేంటి? అన్నది కూడా చర్చగా మారింది. అయితే ఇద్దరి మనస్తత్వమే ఈ వ్యవహారానికి కారణంగా విశ్లేషణలు సాగుతున్నాయి. కెసిఆర్-జగన్ ఇద్దరూ కూడా తనకు నచ్చనిది మరొకరికి నచ్చకూడదు అనే మనస్తత్వం ఉంటుందని, అదే ఇప్పుడు స్నేహబంధానికి బీటలువారేలా చేసిందని చెప్పుకొస్తున్నారు.

ఉదాహరణకు తెలంగాణలో చేయలేమని చేతులెత్తేసిన ఆర్టీసీని ఏపీ ప్రభుత్వంలో విలీనం చేసి చూపిస్తామని జగన్ పట్టుబట్టారు. ఉద్యోగులకు ఇచ్చే ఐఆర్ వ్యవహారంలో కూడా జగన్ నిర్ణయం కెసిఆర్ కు తలనొప్పే తెచ్చింది. తెలంగాణలో సిన్సియర్ ఐఏఎస్‌ ఆఫిసర్‌గా పేరున్న ఆకునూరి మురళి ప్రభుత్వంపై మాటల దాడి చేసి వీఆరెఎస్ తీసుకుంటే సీఎం జగన్ సలహదారుడిగా నియమించుకున్నారు.

జర్నలిస్ట్ సంఘాల నేత అమర్, మరో జర్నలిస్ట్ రామచంద్రమూర్తిల విషయంలో కూడా జగన్ నిర్ణయం కెసిఆర్ కు మంట తెప్పించేదే. ఇక గోదావరి జలాల విషయంలో కెసిఆర్ నిర్ణయాలు, తన సిబిఐ వ్యవహారంపై ప్రగతి భవన్ లో చర్చ, బీజేపీపై ఏకాంత వ్యవహారం బయట పెట్టడం వంటి విషయాలు సీఎం జగన్ కు కోపం తెప్పించాయని, ఈ తరహా కారణాలతోనే ఈ అగాధానికి పునాది పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle