ఛెస్ట్ ఆస్పత్రిలో ఏం జరిగింది? ఆక్సిజన్ పెట్టారా? లేదా?.. హైకోర్టు ఆగ్రహం
31-07-202031-07-2020 09:13:43 IST
2020-07-31T03:43:43.012Z31-07-2020 2020-07-31T03:42:43.541Z - - 12-04-2021

తెలంగాణలో కరోనా పరీక్షలు తక్కువగా జరగడంపై విమర్శలు వస్తూనే వున్నాయి. అలాగే వివిధ ఆస్పత్రుల్లో కరోనా రోగులకు సరైన వైద్యం అందడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా కారణంగా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు, ఆస్పత్రుల్లో సేవలు, రోగుల అవస్థలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఛెస్ట్ ఆస్పత్రిలో జరిగిన ఘటన హాట్ టాపిక్ అయింది. రోగికి ఆక్సిజన్ పెట్టామని మీరంటే.. లేదని బాధితుడు వీడియో తీసి పంపాడు. కరోనాతో బాధపడుతున్న రోగి రవికుమార్‌కు ఆక్సిజన్ పెట్టామని చెస్ట్ ఆస్పత్రి సూపరింటెండెంట్ చెబుతున్నారు. తనకు ఆక్సిజన్ మాస్కు తొలగించారని, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. మళ్లీ పెట్టాలని కోరినా పట్టించుకోలేదని రవికుమార్ వీడియో తీసి పంపారు. ఇందులో ఏది నిజం. ఈ వ్యవహారంలో వాస్తవాలేంటో తెలుసుకునేందుకు పోలీసు దర్యాప్తునకు ఆదేశించాలా?’’అని హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే రవికుమార్ మృతి చెందారంటూ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు బొల్గం యశ్పాల్గౌడ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది.రవికుమార్ గుండె సంబంధవ్యాధితో చనిపోయారని, వైద్యం అందించడంలో వైద్యుల నిర్లక్ష్యం లేదని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. రవికుమార్‌కు సంబంధించిన వైద్య నివేదికలు సమర్పించారా? అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. అయితే అలాంటిది ఏదీ లేదని సమాధానమిచ్చారు. కొంత సమయం ఇస్తే రికార్డులు సమర్పిస్తామని చెప్పగా ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘‘ఇందులో డాక్టర్ల నిర్లక్ష్యం లేదని తామెలా భావించాలి? నిబంధనల మేరకు కరోనా రోగికి అందించాల్సిన అన్ని చికిత్సలు చేశారా? మరి వైద్యనివేదికలు మా పరిశీలనకు ఎందుకు ఇవ్వడం లేదు ?’’అని ధర్మాసనం ప్రశ్నించింది. అదే ఆస్పత్రిలో మరో రోగి కూడా వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోయారని, అతడు కూడా చనిపోయే ముందు వీడియో తీసి పంపారని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రియాంకా చౌదరి నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం..రవికుమార్‌కు సంబంధించిన వైద్య నివేదికలను సమర్పించాలని చెస్ట్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశిస్తూ...విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
9 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
12 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
16 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
6 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
16 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
14 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
16 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
17 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
10 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
19 hours ago
ఇంకా