newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

చొప్పదండి పీఎస్.. ఇండియా టాప్ 10లో చోటు

07-12-201907-12-2019 08:14:15 IST
2019-12-07T02:44:15.139Z07-12-2019 2019-12-07T02:35:04.810Z - - 25-02-2020

చొప్పదండి పీఎస్.. ఇండియా టాప్ 10లో చోటు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు, హత్యలు, సజీవ దహనం కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. పోలీసులు సమర్ధంగా విధులు నిర్వర్తిస్తున్నా.. నేరస్తులు మాత్రం రెచ్చిపోతున్నారు.

నిర్భయ లాంటి కఠిన చట్టాలు వున్నా నిందితులు స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. అయితే పోలీసు శాఖ అత్యాధునిక పద్ధతులు అనుసరిస్తోంది. కేంద్ర హోంశాఖ సమర్ధంగా పనిచేసే టాప్‌-10 పోలీస్‌స్టేషన్ల జాబితాను ఇటీవల ప్రకటించింది. 

ఈ జాబితాలో తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా చొప్పదండి పోలీస్‌స్టేషన్‌ చోటు సంపాదించుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో చొప్పదండి 8వ స్థానంలో నిలిచింది. రాష్ట్రాల కంటే కేంద్రపాలిత ప్రాంతాలే ఇందులో అత్యుత్తమ స్థానాలు పొందడం విశేషం.

హోంశాఖ నివేదిక ప్రకారం అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని అబెర్‌దీన్‌ పోలీస్‌స్టేషన్‌ తొలి స్థానం దక్కించుకోవడం విశేషం. ఆస్తి తగాదాలు, మహిళలు.. అణగారిన వర్గాలపై నేరాల సంఖ్య ఆధారంగా ఈ జాబితాను ప్రకటించారు. 

ఈ జాబితాలో రెండో స్థానంలో గుజరాత్ లోని  బాలా సినోర్‌, మూడోస్థానంలో మధ్య ప్రదేశ్ లోని అజిక్‌ బుర్హాన్‌పూర్‌,  నాలుగో స్థానంలో తమిళనాడులోని ఏడబ్ల్యూపీఎస్‌ థేని, ఐదో స్థానంలో అనిని (అరుణాచల్‌ప్రదేశ్‌), ఆరో స్థానంలో ద్వారక (ఢిల్లీ), ఏడో స్థానంలో బకాని (రాజస్థాన్‌), తొమ్మిదో స్థానంలో బిచోలిమ్‌ (గోవా), పదో స్థానంలో బార్‌గావా (మధ్యప్రదేశ్) ఉన్నాయి. తెలంగాణలో చొప్పదండి పోలీస్ స్టేషన్ హోంశాఖ టాప్ 10లో చోటు సంపాదించుకోవడం పట్ల పోలీసు శాఖ హర్షం వ్యక్తం చేసింది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle