చెత్తకుప్పలోకి మల్లన్నలడ్డూలు.... భక్తుల ఆగ్రహం
10-06-202010-06-2020 11:59:45 IST
2020-06-10T06:29:45.837Z10-06-2020 2020-06-10T06:29:39.572Z - - 15-04-2021

లాక్ డౌన్ కారణంగా రెండునెలలకు పైగా ఆలయాలకు భక్తులు రాకుండా ఇళ్ళకే పరిమితం అయిపోయారు. తమ ఇష్టదైవాన్ని దర్శించుకోవాలని తపించిపోయారు భక్తులు. ఎట్టకేలకు కేంద్రం లాక్ డౌన్ నిబంధనల్ని సడలించింది. వివిధ ఆలయాల్లో మళ్ళీ భక్తుల సందడి మొదలైంది. సిద్దిపేట జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన కొమురవెళ్లి మల్లన్న లడ్డు ప్రసాదాన్ని చెత్తకుప్పలో వేసిన సంఘటన భక్తుల ఆగ్రహానికి కారణం అవుతోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల స్వామి వారి బ్రహ్మోత్సవాల చివరి ఆదివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారన్న ఆలోచనతో సుమారు 40వేల లడ్డూలు తయారు చేశారు ఆలయ అధికారులు. ముగింపు ఘట్టమైన అగ్ని గుండాల ప్రజ్వలన కార్యక్రమం రోజు లాక్ డౌన్ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. అగ్ని గుండాల ప్రజ్వలన కార్యక్రమానికి భక్తులు రాక తయారు చేసిన లడ్డుప్రసాదాన్ని కొమురవెళ్లి గ్రామ ప్రజలతో పాటు చుట్టూ వున్న గ్రామాల ప్రజలకు సుమారు 38వేల లడ్డూలను ఉచితంగా పంపిణీ చేశారు అధికారులు. అయితే అధికారుల అలసత్వం వలన లడ్డూప్రసాద వితరణ కేంద్రంలో 2వేల లడ్డూలు వుండిపోయాయి. వీటిని గుర్తించని అధికారులు లాక్ డౌన్ తో ఆలయాన్ని మూసివేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సడలింపుతో జూన్ 8వతేదీ నుండి ఆలయాలకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మల్లన్న ఆలయాన్ని శుభ్రం చేసే క్రమంలో లడ్డు ప్రసాద తయారీ శాలలో ఉన్న 2వేల లడ్డూలను గుట్టుచప్పుడు కాకుండా ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్కరోని గుట్ట డంప్ యార్డుకు తరలించి చేతులు దులుపుకున్నారు. కనీసం ఆలయ ఈవో,సహాయ ఈవో లకు కూడా సమాచారం అందించకుండా మల్లన్న ప్రసాదాన్ని చెత్త కుప్పలో వేయటం ఏంటని గ్రామస్థులు మండిపడుతున్నారు. లాక్ డౌన్ విధించాక లడ్డూ ప్రసాదం తయారీ కేంద్రాన్ని తనిఖీ చేయాల్సింది పోయి లడ్డూలను అలాగే వదిలేయడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై అధికారులు విచారణ జరపాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
13 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
14 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
14 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
18 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
19 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
17 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
20 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
20 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
15 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
a day ago
ఇంకా