newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

చుక్కలంటుతున్న మాస్క్‌ల ధరలు పది రెట్లు పెరిగిన రేట్లు

05-03-202005-03-2020 09:19:09 IST
Updated On 05-03-2020 15:14:04 ISTUpdated On 05-03-20202020-03-05T03:49:09.330Z05-03-2020 2020-03-05T03:49:06.924Z - 2020-03-05T09:44:04.091Z - 05-03-2020

చుక్కలంటుతున్న మాస్క్‌ల ధరలు పది రెట్లు పెరిగిన రేట్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సికింద్రాబాద్‌లోని మహేంద్ర హిల్స్‌లో నివాసముండే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా వైరస్‌ సోకిన నేపథ్యంలో నగర వ్యాప్తంగా కలకలం రేగింది. ఇక కోవిడ్‌-19 ఎఫెక్ట్‌తో మహేంద్రహిల్స్‌ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో ఆ ప్రాంత రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కరోనా భయాల నేపథ్యంలో వ్యాపారులు నోటి మాస్కులకు అమాంతం రేట్లు పెంచేశారు. 

రెండు లేయర్లతో ఉన్న మాస్క్‌ హోల్‌సేల్‌ ధర రూ.1.60 పైసలు కాగా, కొందరు మెడికల్‌ దుకాణాదారులు ఒక్కోదానికి రూ.20 నుంచి 25 వరకు వసూలు చేస్తున్నారు. రూ.30-40 విలువ చేసే ఎన్‌95 మాస్కును రూ.300 వరకు అమ్ముతూ ప్రజల్ని దోచేస్తున్నారు. 

ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల వద్ద మాస్కులు డిమాండ్‌ ఏర్పడింది. ప్రస్తుత డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని హోల్‌సేల్‌ అమ్మకందార్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు మాస్కులకు ఎలాంటి కొరతా లేదని ప్రభుత్వం ప్రకటిస్తున్నా.. వ్యాపారులు మాత్రం ఇదే అదనుగా అధిక ధరలు వసూలు చేస్తున్నారు.

ఆ చుట్టూ పక్కల ప్రాంతాల్లోని పలు స్కూళ్లు బుధవారం సెలవు కూడా ప్రకటించాయి. పొరుగునే ఉన్న అడ్డగుట్టలో సైతం స్కూళ్లకు వచ్చిన విద్యార్థులను తిరిగి ఇళ్లకు పంపించివేస్తున్నారు. సికింద్రాబాద్‌లోని పలు విద్యాసంస్థల్లో మాస్కులు ధరించి పిల్లలు తరగతులకు హాజరయ్యారు. ఈనేపథ్యంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. 

నగరంలో కరొనా వైరస్ ఉనికి గురించి తెలియగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా  మార్చి 15న హైదరాబాద్‌లో పౌరసత్వ సవరణ చట్టంపై జరుగనున్న భారీ బహిరంగ సభకు హాజరుకావడం రద్దు చేసుకున్నారు. నగర బీజేపీ కార్యకర్తలు, నేతలు లాల్ బహదూర్ స్టేడియంలో మార్చి 15న నిర్వహించతలపెట్టిన భారీ సభ రద్దయింది.

కాగా హైదరాబాద్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలు తమ ఉద్యోగులను మరో నెలరోజుల పాటు పనుల పేరిట విదేశాలకు పంపవద్దని పోలీసులు సూచించారు. విదేశాలకు వెళ్లి తిరిగి వస్తూ కరోనాను వెంటబెట్టుకు రావడం గమనించిన ప్రభుత్వం విమానాశ్రయాలను అప్రమత్తం చేసింది.

అయితే కంపెనీలు ఖాళీ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరఫున సీపీ సజ్జనార్‌తోపాటు, ఐటీశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్, ఆరోగ్యశాఖ డైరక్టర్‌ శ్రీనివాస్‌ విజ్ఞప్తి చేశారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అనుమతి ఇచ్చేటప్పుడు ఐటీ, పరిశ్రమల శాఖకు తెలపాలని సూచించారు. తమ అనుమతి లేకుండా కంపెనీలు ఖాళీ చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. డీఎస్‌ఎమ్‌ కంపెనీ ఒక్కరోజు మాత్రమే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశం కల్పించదన్నారు. కేవలం 23 మందికి మాత్రమే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశం ఇచ్చారని తెలిపారు. సహచర ఉద్యోగులుకు కరోనా సోకిందనేది అవాస్తవం అన్నారు. ఐటీ కారిడర్‌ ఖాళీ కాలేదని, వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   12 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   8 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   10 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   13 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   15 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   16 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   18 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   19 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   20 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   20 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle