newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

చిన్నారులపైన కరోనా పంజా... మహమ్మారికి వయసుతో పనిలేదా?

17-04-202017-04-2020 10:33:25 IST
Updated On 17-04-2020 11:20:55 ISTUpdated On 17-04-20202020-04-17T05:03:25.535Z17-04-2020 2020-04-17T05:01:28.081Z - 2020-04-17T05:50:55.544Z - 17-04-2020

చిన్నారులపైన కరోనా పంజా... మహమ్మారికి  వయసుతో పనిలేదా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి అతివేగంగా వ్యాప్తి చెందుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం 700 కేసుల్లో.. 15 శాతానికి పైగా అంటే 106 కేసులు కేవలం 11 కుటుంబాల్లోనే నమోదయ్యాయి.. అన్నీ మర్కజ్‌ నుంచి వచ్చిన ప్రయాణికుల కుటుంబాలే.  తెలంగాణలో కేవలం ఒకరి నుంచి 20, 15, 14 మంది చొప్పున కుటుంబ సభ్యులు కరోనా వైరస్‌ బారీన పడ్డారు. వీరిలో 6 నెలల పసికందు నుంచి పదేళ్లలోపు చిన్నారులు కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా సుమారు 10వేల పరీక్షలు నిర్వహించగా.. వీటిల్లో 645 పాజిటివ్‌ కేసులు మర్కజ్‌ ప్రయాణికులు, వారి సన్నిహితులవే. 

వ్యక్తిగత దూరం, పరిశుభ్రత వంటి నివారణ చర్యలను అవలంబించకపోతే.. వైరస్‌ కుటుంబాలనే కబళిస్తోందనడానికి ఇదో ఉదాహరణ. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 50 కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 90 శాతం జీహెచ్‌ఎంసీ పరిధిలోవే.  తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కేసులు 700కు పెరిగాయి.. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆ సంఖ్య 374కు చేరింది. ఆసుపత్రుల్లో 496 మంది చికిత్స పొందుతుండగా.. వీరిలో నలుగురు మాత్రమే ఐసీయూలో ఆక్సిజన్‌ పొందుతున్నారు.

వైరస్‌ బారినపడి చికిత్స పొందుతున్నవారిలో 128 మంది నమూనాలు పరీక్షిస్తే.. వారిలో రెండుసార్లు నెగిటివ్‌ వచ్చిన 68 మందిని గురువారం డిశ్ఛార్జి చేశారు. దీంతో మొత్తంగా కరోనా కోరల్లోంచి బయటపడిన వారి సంఖ్య 186కు చేరింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మహమ్మారి బారిన పడి 18 మంది మృతిచెందారు. 

అమ్మానాన్నలతో పాటు తాత, అవ్వ, చిన్నాన్న, చిన్నమ్మ.. ఇలా కుటుంబాల్లో అత్యధికులు కరోనా బారినపడుతుండడంతో.. వారిళ్లలో వైరస్‌ సోకని చిన్నారుల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించింది. ఇలాంటి చిన్నారుల కోసం గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేకంగా వార్డు ఏర్పాటుచేశారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆయమ్మలను నియమించి, పిల్లల సంరక్షణ బాధ్యతలకు చర్యలు చేపట్టారు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ముందుగా కోలుకొని బయటకు వస్తే.. వారికి పిల్లలను అప్పగిస్తారు.

గాంధీ ఆసుపత్రిలోని ఒకే అంతస్తులో ఒకవైపు పురుషులకూ, మరోవైపు మహిళలకు వేర్వేరు వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. మరుగుదొడ్లు మాత్రం కామన్‌గా ఉన్నాయి. దీంతో అత్యవసరంగా మహిళలకు, పురుషులకు వేర్వేరు అంతస్తుల్లో చికిత్స వార్డులను ఏర్పాటుచేస్తున్నారు.గ్రేటర్లో ఎక్కువగా అన్ని వయసుల వారికి సోకుతోంది. కరోనా వచ్చిన కొత్తలో యువకులకు, చిన్నారులకు ఈ వైరస్ సోకదనే ప్రచారం వుంది. కానీ ఇప్పుడు కరోనా ఎవరినీ వదలడం లేదు. 

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

   2 hours ago


రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

   2 hours ago


ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

   2 hours ago


కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

   3 hours ago


లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

   3 hours ago


కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

   4 hours ago


ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

   4 hours ago


హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

   5 hours ago


తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

   5 hours ago


ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   18 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle