newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

చిన్నపొరపాటు.. లిఫ్టు నొక్కారంతే..

30-08-202030-08-2020 08:34:48 IST
Updated On 30-08-2020 09:21:25 ISTUpdated On 30-08-20202020-08-30T03:04:48.190Z30-08-2020 2020-08-30T03:04:45.503Z - 2020-08-30T03:51:25.151Z - 30-08-2020

చిన్నపొరపాటు.. లిఫ్టు నొక్కారంతే..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనాతో సహజీవనం చేయాల్సిందే అని ముఖ్యమంత్రుల స్థాయి నేతలు కూడా చెబుతుంటడంతో.. ఇక తప్పదులే అని ఏమరుపాటుగా ఉంటే ఒకరు చేసే పొరపాటు అందరినీ ప్రభావితం చేస్తోందని అనుభవపూర్వకంగా తెలిసివస్తోంది. దేశంలో లాక్ డౌన్ విధించి 5 నెలలు దాటినా కరోనాతో ఎలా వ్యవహరించాలో తెలియని జనం అమాయకంగా కరోనాతో తప్పురీతిలో సహజీవనం చేస్తూ అందరి నెత్తికీ తెస్తున్నారు. నగరాలు, పట్టణాలు మాత్రమ కాదు, బస్తీల్లో, గ్రామాల్లో కూడా కరోనాతో జాగ్రత్తగా వ్యవహరించకపోతే అది ప్రాణాంతకమవుతందని ఖమ్మం సమీపంలో జరిగిన ఒక ఘటన చెబుతోంది.

తెలంగాణ ప్రభుత్వం వైరస్‌ కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా కరోనా  ఏమాత్రం నియంత్రణలోకి రావడంలేదు. ప్రాణాంతక పురుగు ఏ మూల నుంచి దాడి చేస్తోందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మొదట్లో కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే వ్యాప్తి చెందిన కరోనా రోజులు గడుస్తున్నా కొద్దీ జిల్లాలకు, పల్లెలకు పాకుతోంది. 

ఈ క్రమంలోనే ఖమ్మం పట్టణం సమీపంలో ఆపార్టమెంట్‌లో కరోనా కలకలం రేపింది. ఓ వ్యక్తి తెలియక చేసిన తప్పిదానికి ఓ అపార్ట్‌మెంట్‌లోని అందరికీ వైరస్‌ పాకింది. తొలుత లిఫ్ట్‌ బటన్‌ నొక్కిన వారంరికీ వచ్చిందని, ఈ తరువాత వారి ద్వారా అపార్ట్‌మెంట్‌లోని 20 ఫ్లాట్స్‌లో ఉన్న వారందరికీ వైరస్‌ పాకినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. 

ఈ అపార్ట్‌మెంట్లలోని వారందరూ దాదాపుగా గృహాల్లోనే ఏకాంత వాసం చేస్తున్నా వీరిలో ఒక వ్యక్తి మాత్రం హైదరాబాదులో కోవిడ్-19కి చికిత్స చేయించుకుంటూ మరణించాడు. ఈ నేపథ్యంలో ఉన్నట్లుండి ఆ అపార్ట్ మెంట్ పై భవనాల్లో ఉన్నవారందరూ వైరస్ బారిన పడ్డారు. లిఫ్టు బటన్‌ను ప్రతి రోజూ పై అంతస్తుల్లో ఉన్నవారు నొక్కుకుంటో పోవడంతో 20 కుటుంబాల వారికీ వైరస్ సోకింది.

అదే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటున్న కుటుంబాలకు వైరస్ అస్సలు సోకలేదు. దీంతో కచ్చితంగా లిఫ్టును వాడటం ద్వారా పై అంతస్తుల వారందరికీ కరోనా వైరస్ సోకినట్లు ఊహిస్తున్నారు. బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

ఆ అపార్ట్ మెంటులోని అయిదు అంతస్తుల్లోని వారు ఎవరి ఇళ్లకూ పోలేదు. పక్క ఇళ్లలో ఉన్నవారిని కలవలేదు. అయినా ఎలా వచ్చిందన్నది మొదట్లో అర్థం కాలేదు. దీంతో వైరస్ వారు నిత్యం వాడుతూ వచ్చిన లిఫ్ట్ బటన్‌ ద్వారా సోకిందని అధికారులు నిర్ధారిస్తున్నారు. 

ఫ్లాట్లలోని అందరికీ పాజిటివ్ సోకడంతో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటూ కరోనా బారినుంచి తప్పించుకున్న వాచ్‌మన్ కుటంబం వెంటనే ఆ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయింది.

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   8 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   11 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   14 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   14 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   15 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   13 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   21-04-2021


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle