newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

చిచ్చురేపుతున్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలు

19-02-202019-02-2020 08:05:35 IST
2020-02-19T02:35:35.370Z19-02-2020 2020-02-19T02:35:26.194Z - - 15-04-2021

చిచ్చురేపుతున్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైలు కూత సరిగా వినిపించేది కాదని, మోడీ ప్రభుత్వం వచ్చాకే రైలు సర్వీసులు ప్రారంభం అయ్యాయన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎర్రబస్సు తప్ప.. రైలు అంటేనే తెలియదు అన్నారు.

రైలు ప్రయాణం అలవాటు లేని ప్రజలకు రైలు మార్గాలను ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చారన్నారు. హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ ప్రధాన సమస్య అని..సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌ల నుంచి వేల మంది ప్రయాణిస్తారని..చర్లపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద శాటిలైట్‌ టర్మినల్‌ ఏర్పాటుతో రద్దీ భారం తగ్గుందన్నారు. 

సికింద్రాబాద్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ తో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణను నిర్లక్ష్యం చేయడం లేదన్నారు. ఎంఎంటీఎస్‌, సబ్బరన్‌ రైళ్ల సంఖ్య పెంచాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రిని ఆయన కోరారు. యాద్రాది వరకు ఎంఎంటీస్‌పై కేంద్రం దృష్టిపెడితే రైల్వే ట్రాఫిక్‌ సమస్య తగ్గుతుందన్నారు. 427 రైల్వేస్టేషన్లలో ఉచిత హైస్పీడ్‌ వైపై సౌకర్యం కల్పించడం మంచి పరిణామం అని కిషన్‌ రెడ్డి అన్నారు. 

కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు ఎర్రబస్సు మాత్రమే తెలిసిన తెలంగాణ ప్రజలకు.. రైల్వేను పరిచయం చేసింది మోడీయే నంటూ ఆయన చేసిన కామెంట్లపై నెటిజన్లు సెటైర్లు పేలుతున్నాయి. దీంతో ‘‘నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా’’నని కిషన్ రెడ్డి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle