newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

చాపకింద నీరులా స్కెచ్ వేసిన బీజేపీ..!

17-10-201917-10-2019 09:17:41 IST
Updated On 17-10-2019 16:58:48 ISTUpdated On 17-10-20192019-10-17T03:47:41.609Z17-10-2019 2019-10-17T03:47:36.536Z - 2019-10-17T11:28:48.836Z - 17-10-2019

చాపకింద నీరులా స్కెచ్ వేసిన బీజేపీ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ‌లో బీజేపీని విస్త‌రించేందుకు ఆ పార్టీల నేత‌లు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ఇప్ప‌టికే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌తో ప‌లు పార్టీల‌కు చెందిన నేత‌ల‌ను బీజేపీ చేర్చుకుంది. త్వ‌ర‌లోనే లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా కొంత మంది బ‌ల‌మైన నేత‌ల‌కు గాలం వేయాల‌ని జాబితాను సిద్ధం చేసింది. ఇదంతా ఒకెత్త‌యితే, ఇప్పుడు పార్టీ పునాదుల‌ను వేసేందుకు స‌రికొత్త ప్లాన్‌ల‌ను వేస్తున్నారు బీజేపీ నేత‌లు.

ఆర్టీసీ కార్మిక సంఘాల్లో ప‌ట్టుకోసం ఇప్ప‌టికే బీజేపీ నేత‌లు స‌మ్మెను ఉప‌యోగించుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. స‌మ్మె ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి బీజేపీ నేత‌లు ఆర్టీసీ కార్మిక సంఘాల‌కు మ‌ద్ద‌తుగా క‌దులుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కే.ల‌క్ష్మ‌ణ్‌, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్‌తోపాటు ఇత‌ర పార్టీల నేత‌లు ఆర్టీసీ కార్మికుల స‌మ్మెకు మ‌ద్ద‌తుగా ర్యాలీల‌ను నిర్వ‌హిస్తున్నారు.

తెలంగాణ‌లోని కార్మిక సంఘాల్లో ఇప్పటి వ‌ర‌కు వామ‌ప‌క్షాలు లేదా టీఆర్ఎస్‌కు మాత్ర‌మే ప‌ట్టున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో వామ‌ప‌క్షాల‌కు కార్మిక సంఘాల్లో చెక్‌పెట్టాల‌న్న‌ది బీజేపీ ఎత్తుగ‌డ‌గా తెలుస్తుంది. ఇప్ప‌టికే సింగ‌రేణి కార్మిక సంఘాల్లో కీల‌క నేత మ‌ల్ల‌య్య‌ను బీజేపీ చేర్చుకుంది. అక్క‌డ పార్టీ కార్మిక సంఘాన్ని విస్త‌రించేందుకు బీజేపీ ముమ్మ‌ర ప్ర‌య‌త్నాల‌నే చేస్తోంది.

ఇటు ఆర్టీసీ కార్మిక సంఘాల్లో స‌మ్మెను అదునుగా చూసుకుని త‌మ కార్మిక సంఘాన్ని విస్త‌రించేందుకు బీజేపీ చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్టు స‌మాచారం. అందులో భాగంగానే స‌మ్మెను ఒక ఆయుధంగా బీజేపీ నేత‌లు వాడుకుంటున్నార‌ని ఇత‌ర పార్టీల నేత‌లు అనుమానిస్తున్నారు.

మొత్తానికి తెలంగాణ‌లో విస్త‌ర‌ణ కోసం బీజేపీ పాచిక‌లు విసురుతోంది. అయితే, అవ‌న్నీ ఫ‌లిస్తాయా..?  లేదా..? అన్న‌ది ఎన్నిక‌లు వ‌స్తేగాని తెలియ‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆ ఎన్నిక‌లు వ‌చ్చేందుకు ఇంకా ఐదేళ్ల గ‌డువు ఉంది. దీంతో మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీజేపీ చూపించే ప్ర‌భావాన్నిబ‌ట్టి ఆ పార్టీ ఎదుగుద‌ల ఉంటుంద‌ని విశ్లేష‌కుల అంచ‌నాగా ఉన్న‌ట్టు తెలుస్తుంది.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle