newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

చర్చల్లో ప్రతిష్టంభన.. బస్సులు రోడ్డెక్కడం డౌటేనా?

27-10-201927-10-2019 08:50:23 IST
2019-10-27T03:20:23.252Z27-10-2019 2019-10-27T03:20:12.505Z - - 24-02-2020

చర్చల్లో ప్రతిష్టంభన.. బస్సులు రోడ్డెక్కడం డౌటేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అటు ప్రభుత్వమూ, ఇటు ఆర్టీసీ సిబ్బందీ తమ పట్టును వదలకపోవడంతో హైకోర్టు ఆదేశానుసారం శనివారం ఇరు పక్షాల మధ్య ప్రారంభమైన చర్చలు కాస్సేపటికే అర్థంతరంగా ముగిసిపోయాయి. మొబైల్ ఫోన్లను లాక్కుని మరీ యాజమాన్యం జరుపదలపెట్టిన నిర్బంధ చర్చల్లో భాగం కాలేమని ఆర్టీసీ జేఏసీ నేతలు ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ కార్యాలయం నుంచి బయటకు వచ్చేశారు. 

కోర్టు తీర్పును కూడా వక్రీకరించి 26 అంశాలకు బదులుగా  21 అంశాలపైనే చర్చిస్తామని యాజమాన్యం ఖరాకండీగా చెప్పడంతో చర్చలు కొనసాగించే వాతావరణమే దెబ్బతిందని కోర్టు ఉత్తర్వులను అమలు చేశామని చెప్పుకోవడానికే తప్ప సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యం సిద్ధంగా లేదని జేఏసీ నేతలు ఆరోపించారు. 22 రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సిబ్బంది సమ్మె యధావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. దీంతో హైకోర్టు జోక్యం వల్లనైనా సమ్మె ముగిసిపోతుందనుకున్న వారి ఆశలు గల్లంతయ్యాయి.

హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ జేఏసీ నేతలతో యాజమాన్యం తలపెట్టిన చర్చలు ఆదిలోనే విఫలమయ్యాయి. ఎర్రమంజిల్‌లోని ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం జరిగిన చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. కోర్టు ఉత్తర్వులు అమలు చేశామని చెప్పడానికే చర్చలు పెట్టారని, సమస్యల పరిష్కారం కోసం కాదని జేఏసీ నేతలు ఆరోపించారు. 

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ‘నిర్బంధంగా చర్చల ప్రక్రియ కొనసాగింది. మా మొబైల్‌ ఫోన్లు లాక్కున్నారు. కేవలం నలుగురిని మాత్రమే చర్చలకు ఆహ్వానించారు. కోర్టు తీర్పును వక్రీకరించి 21 అంశాలపైననే చర్చిస్తామని యాజమన్యం స్పష్టం చేసింది. పూర్తి డిమాండ్లపై చర్చలు జరపాలని మేము పట్టుబట్టాం. 26 డిమాండ్లపై చర్చలు జరపాలని అన్నాం. యాజమాన్యం మా మాటల్ని పట్టించుకోలేదు. అందుకే బయటికి వచ్చేశాం. సమ్మె యథావిధిగా కొనసాగుతుంది. భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తాం. మా డిమాండ్లపై చర్చలకు ప్రభుత్వం ఎప్పుడు పిలిచినా వెళ్తాం’అన్నారు. 

కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 22వ రోజుకు చేరింది. యాజమాన్యంతో శనివారం జరిగిన ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు విఫలమైన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (టీఎంయూ) కీలక నిర్ణయం తీసుకుంది. టీఎంయూ జెండా రంగు మార్చుకుంది. గులాబీ రంగులో ఉన్న జెండాలు తొలగించి.. తెల్లరంగు జెండాలు వాడాలని టీఎంయూ నిర్ణయించింది. తెల్లరంగు జెండాపై ధనస్సు గుర్తుతో టీఎంయూ జెండా కొత్త రూపు సంతరించుకుంది. రేపు కొత్త జెండాతో టీఎంయూ ఆవిర్భావ దినోత్సవం జరపుకోనుంది.

చర్చల పేరుతో పిలిచిన యాజమాన్యం ఆర్టీసీ జేఏసీ నేతలను మాట్లాడటానికి కూడా అనుమతించకపోవడాన్ని ఆర్టీసీ నేతలు సీరియస్‌గా తీసుకున్నట్లుంది. హైకోర్టు ముందు అంగీకరించినట్లుగా 26 డిమాండ్లపై చర్చలు జరపాలని, యాజమాన్యం తనకు చేతనైన డిమాండ్ల పరిష్కారం కోసమే ప్రయత్నించవచ్చు కానీ సమ్మెకు ప్రధాన కారణాలపై చర్చ అయినా జరపాలని జేఏసీ నేతలు అభ్యర్థిస్తే అలాంటి ఆదేశాలు తమకు లేవని యాజమాన్యం స్పష్టం చేసినట్లు సమాచారం. డబ్బులేదనే సాకు చెప్పి అతి చిన్న డిమాండ్లపై చర్చించడానికి కూడా యాజమాన్యం సిద్ధం కాలేదని అశ్వత్థామ రెడ్డి ఆరోపించారు. 

యాజమాన్యం చర్చల ప్రతినిధులపైన కూడా పరిమితి విధించడంతో జేఏసీ తరపున అశ్వత్థామరెడ్డి, కె. రాజిరెడ్డి, వి. శ్రీనివాసరావు, కె. వాసుదేవరావు అనే నలుగురు మాత్రమే ఆర్టీసీ సిబ్బంది ప్రతినిధులుగా చర్చలకు హాజరయ్యారు.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle