newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

‘‘చంద్రబాబుకి ఓటమి భయం... అందుకే డ్రామాలు’’

15-04-201915-04-2019 16:42:08 IST
Updated On 06-07-2019 13:05:36 ISTUpdated On 06-07-20192019-04-15T11:12:08.842Z15-04-2019 2019-04-15T11:12:06.797Z - 2019-07-06T07:35:36.600Z - 06-07-2019

‘‘చంద్రబాబుకి ఓటమి భయం... అందుకే డ్రామాలు’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఎన్నికలు ముగిశాయి. గతంలో ఎన్నడూ లేనవిధంగా ఈవీఎంలపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఏపీలో ఎన్నికలు జరిగిన తీరుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ గెలుపు, చంద్రబాబు ఘోర ఓటమి తప్పదని ఇప్పటికే సీఎం కేసీఆర్ జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా తలసాని సైతం ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. 

ఆంధ్రప్రదేశ్‌ జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని గ్రహించి చంద్రబాబు నాయుడు కుంటిసాకుగా ఢిల్లీకి పారిపోయి ఈవీఎంలపై రాద్ధాంతం చేస్తున్నారని తలసాని శ్రీనివాస యాదవ్‌ అన్నారు. ఓటమి తప్పదని ఈవీఎంలపై చంద్రబాబు దుమ్మెత్తి  పోస్తున్నారని ఆయన నల్లగొండలో విమర్శించారు. ఐటీ టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్‌ తానేనని చెప్పుకునే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ఈవీఎంలపై రాద్ధాంతం చేయడం అంత అవసరమా అన్నారు. రెండురోజుల క్రితమే తలసాని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల పోలింగ్‌పై టీడీపీ డ్రామాలాడుతోందన్నారు.

ఏపీ ఎన్నికల్లో దాదాపు 42 వేల ఈవీఎంలు వాడితే అందులో 300 ఈవీఎంలలోనే సమస్యలు తలెత్తాయి. ఆ 300 ఈవీఎంలపైనే టీడీపీ ఆధారపడి ఉందా? అని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు నోరు తెరిస్తే అన్ని అబద్దాలే అని వ్యాఖ్యానించారు. 2014లో గెలిచినప్పుడు చంద్రబాబుకి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్‌ మంచివయ్యాయని, ఇప్పుడు నేను ఓటేస్తే.. నా పార్టీకే పోయిందా అని బాబు అంటున్నారని, ఇదేం ద్వంద్వవైఖరి అని తలసాని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతల జోస్యాలు, సర్వేలు టీడీపీ నేతలను అయోమయానికి గురిచేస్తున్నాయి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle