ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. ఎన్టీయార్ ఘాట్లో కుటుంబసభ్యుల శ్రద్ధాంజలి
28-05-202028-05-2020 09:50:09 IST
Updated On 28-05-2020 10:01:54 ISTUpdated On 28-05-20202020-05-28T04:20:09.267Z28-05-2020 2020-05-28T04:19:55.033Z - 2020-05-28T04:31:54.908Z - 28-05-2020

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీరామారావు జయంతి తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు ఎన్టీఆర్ తనయుడు, నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న బాలకృష్ణ.. పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బాలయ్యతో పాటు కుటుంబసభ్యులు నివాళి అర్పించారు. అందరూ లాక్ డౌన్ నిబంధలు పాటిస్తూ, వైద్యుల సూచనలను తూ.చ. తప్పకుండా పాటించాలన్నారు. కరోనా మహమ్మారిపై పోరుసాగిద్దామన్నారు.

తన తండ్రి, దివంగత ఎన్టీ రామారావు ఎంతో ముందు చూపుతో ఆలోచించేవారని, ఇవాళ రాష్ట్రం సుభిక్షంగా ఉందంటే అందుకే ఎన్టీఆర్ చేసిన అభివృద్ది కార్యక్రమాలేనని బాలకృష్ణ అన్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి, తెలుగు గంగ ఇవన్నీ ఎన్టీఆర్ మానసపుత్రికలని, ఇలా ఎన్నో కార్యక్రమాలు ముందు చూపుతో చేశారని, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఎన్టీఆర్ను స్ఫూర్తిగా తీసుకుని అందరం ముందుకెళ్లాలని బాలయ్య పిలుపు ఇచ్చారు.ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. విప్లవాత్మక పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచారని కొనియాడారు. అలాగే ఎన్టీఆర్ నటించిన సినిమాలు కూడా చరిత్రలో నిలిచిపోతాయని చెప్పారు. ఎన్టీఆర్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు.

నా రూటే సెపరేటు
9 minutes ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
14 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
14 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
14 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
18 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
19 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
18 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
20 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
20 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
16 hours ago
ఇంకా