newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

19-11-201919-11-2019 13:44:17 IST
Updated On 19-11-2019 15:19:37 ISTUpdated On 19-11-20192019-11-19T08:14:17.985Z19-11-2019 2019-11-19T08:05:01.008Z - 2019-11-19T09:49:37.506Z - 19-11-2019

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గాంధీభవన్లో కాంగ్రెస్ నేతలు ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశం కోసం ఆమె చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ , మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీలు ఇందిరాగాంధీ స‌మాధి వ‌ద్ద అంజలి ఘటించారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా.. ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆమెకు నివాళులు అర్పించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. 

తన నాయనమ్మ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ ఉద్వేగభరితంగా ట్వీట్ చేశారు. ‘‘నానమ్మ ఇందిర ఐరన్ లేడీ అని కొనియాడారు. భారత్ ను ధృడంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన మా నాన్నమ్మ శ్రీమతి ఇందిరమ్మ జయంతి సందర్భంగా ఆమెకు నా ఘన నివాళి. ఆమె ఎంతో శక్తివంతమయిన, సమర్థవంతురాలైన నేత ’’ అన్నారు రాహుల్ గాంధీ.  

ఇందిరమ్మ మనమరాలు ప్రియాంకా గాంధీ వాద్రా నాన్నమ్మతో ఆడుకుంటున్న ఫోటో ఒకటి షేర్ చేశారు. ఈ ఫోటో వైరల్ అవుతోంది. నాకు బాగా తెలిసిన అత్యంత ధైర్యసాహసవంతురాలు అంటూ ట్వీట్ చేశారు ప్రియాంకా గాంధీ. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle