గ్రేటర్ హైదరాబాద్‌పై కరోనా పంజా.. ఒకే ఫ్యామిలీలో ఆరుగురికి
16-05-202016-05-2020 08:29:31 IST
Updated On 16-05-2020 09:26:20 ISTUpdated On 16-05-20202020-05-16T02:59:31.119Z16-05-2020 2020-05-16T02:59:17.643Z - 2020-05-16T03:56:20.541Z - 16-05-2020

గ్రేటర్ హైదరాబాద్ కరోనా పాజిటివ్ కేసులకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏవైనా కొత్త కేసులు నమోదయితే అవి ఖచ్చితంగా హైదరాబాద్ లోనే వుంటున్నాయి. గ్రేటర్లో కొవిడ్ కేసుల హెచ్చుతగ్గుల పరంపర కొనసాగుతూనే వుంది. బుధవారం 31 కేసులు నమోదయితే, ప్రస్తుతం 40 మందికి వైరస్ సోకింది. హైదరాబాద్‌లో 34, మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలో ఆరుగురు కరోనా పాజిటివ్ బారినపడ్డారు. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట మున్సిపాలిటీ పరిధిలో ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్ వచ్చిందంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధి షాహీన్‌నగర్, ఎర్రకుంట కంటైన్మెంట్ జోన్లను రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ పరిశీలించారు. పలు సూచనలు చేశారు. ఆర్కేపురంలో రిటైర్డ్ ఉద్యోగితో పాటు ఆయన భార్యకు వైరస్ సోకింది. తాజాగా న్యూ నాగోల్‌లో ఉంటున్న సదరు రిటైర్డ్ ఉద్యోగి చిన్న కుమారుడితో పాటు ఆయన భార్య, కూతురు, చైతన్యపురి డివిజన్ సత్యనారాయణపురంలో నివాసముండే కూతురుకు పాజిటివ్‌గా తేలింది. తిరుమలానగర్‌కు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు కరోనాతో చనిపోగా, ఆయన కుటుంబసభ్యులు చికిత్స పొందుతున్నారు. మరికొందరు హోం క్వారంటైన్లో ఉన్నారు. మీర్పేట్ పరిధి సిర్లాహిల్స్ కాలనీకి చెందిన దంపతులకు పాజిటివ్ నిర్ధారణ అయింది. అలాగే జిల్లెలగూడలోని న్యూవివేకానగర్లో ఉండే వీరి కూతురు, అల్లుడు, తొమ్మిది నెలల మనువడికి వైరస్ సోకింది. రాష్ట్రంలో అత్యధిక కేసులు గ్రేటర్ పరిధిలోనే నమోదవుతుండడం అధికారులను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. బంజారాహిల్స్‌లో ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరిన యువకుడికి కరోనా వైరస్ సోకడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. మాదన్నపేట, తిరుమలనగర్కాలనీ, మీర్పేట్ సిర్లాహిల్స్లో పలువురికి వైరస్ సోకింది. కరోనా లక్షణాలతో నిలోఫర్ ఆస్పత్రికి వచ్చే వారికి అందుతున్న వైద్య సేవలపై కేంద్ర బృందం ఆరా తీసింది. గురువారం ఇద్దరు సభ్యులతో కూడిన కేంద్ర బృందం ఆస్పత్రికి చేరుకొని ఇంటెన్సివ్ కేర్ బ్లాక్‌లోని ఐసోలేషన్ వార్డు, ఐసీయూతోపాటు చిన్నపిల్లల వార్డులను పరిశీలించింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఇన్ఫోసిస్ భవనంలోని మొదటి, రెండో, మూడో అంతస్తుల్లోని వార్డులను పరిశీలించారు. కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపధ్యంలో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటింటికీ వెళ్లి వైద్య సిబ్బంది పరీక్షలు చేయనున్నారు. తాజాగా జిల్లా వైద్య అధికారులు, హాస్పిటల్ సూపరింటెండెంట్లు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్స్, ఏఎన్ఎం, ఆశా వర్కర్స్‌తో జరిగిన విడియో కాన్ఫరెన్స్‌లో ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి పరీక్షలు నిర్వహించాలన్నారు. జలుబు, జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఊపిరితిత్తుల్లో న్యుమోనియా వంటి లక్షణాలు ఉన్నవారికి తప్పనిసరిగా పరీక్షలు చేయాలని మంత్రి అన్నారు. ఒక్కొ ఏ.ఎన్.ఎంకు వంద ఇళ్లు కేటాయించనుండగా.. మూడు, నాలుగు రోజుల్లో వైద్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
3 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
5 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
22 minutes ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
7 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
7 hours ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
2 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
8 hours ago

ఇక కేటీఆర్ టైం వచ్చినట్లేనా
9 hours ago

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం
18-04-2021

చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!
18-04-2021
ఇంకా