గ్రేటర్ గజగజ.. కరోనా హాట్‌స్పాట్‌గా హైదరాబాద్
11-07-202011-07-2020 08:01:29 IST
Updated On 11-07-2020 11:33:52 ISTUpdated On 11-07-20202020-07-11T02:31:29.392Z11-07-2020 2020-07-11T02:31:26.454Z - 2020-07-11T06:03:52.839Z - 11-07-2020

తెలంగాణ రాష్ట్రంలో కరోనా తీవ్రరూపం దాలుస్తోంది. ప్రతిరోజూ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. తెలంగాణలో తొలి పాజిటివ్ కేసు మార్చి 2న నమోదవగా ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 30 వేలు దాటింది. కరోనా లాక్డౌన్ కాలంలో జనజీవనం స్తంభించడం వల్ల వైరస్ అదుపులో ఉన్నప్పటికీ ప్రభుత్వ సడలింపులతో వైరస్ వ్యాప్తి విస్తృతమైంది. ప్రస్తుతం రోజుకు రెండు వేలకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని పరిశీలిస్తే ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 51.13 శాతం కేసులు గత పది రోజుల్లోనే నమోదు కావడం గమనార్హం. పరీక్షల సంఖ్య పెంచుతున్న కొద్దీ పాజిటివ్ కేసులు పెరుగుతున్న తీరు ఎలా ఉందో స్పష్టమవుతోంది. ప్రపంచాన్ని వణకిస్తున్న కరోనా మహమ్మారి తెలంగాణలో రోజురోజుకూ విస్తరిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 1410 కేసులు నమోదయ్యాయి. ఇవాళ 8 మంది కరోనాతో మరణించారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 32,224కు చేరుకుంది. గత కొన్నిరోజులుగా రోజూ వెయ్యికిపైగానే కేసులు నమోదవుతుండటం గమనార్హం. కేసులు పెరిగిపోతుండటంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో శుక్రవారం ఒక్కరోజే 762 కేసులు నమోదయ్యాయి. మునుపటితో పోలిస్తే నగరంలో ఇవాళ తక్కువ కేసులే నమోదయ్యాయి. రంగారెడ్డిలో 171, మేడ్చల్‌లో 85 కేసులు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1410 కేసులు నమోదయ్యాయి. కాగా.. ఇప్పటి వరకూ మొత్తం 399 మంది కరోనాతో చనిపోయారు. ఓ వైపు పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటం.. మరోవైపు మరణాల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇవన్నీ అటుంచితే.. కేసీఆర్ సర్కార్ టెస్ట్‌లు సరిగ్గా చేయలేదని.. టెస్ట్‌ల సంఖ్య పెంచాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల వేగాన్ని భారీగా పెంచింది. ఈ క్రమంలో పాజిటివ్ కేసుల నమోదు కూడా అదే స్పీడ్‌లో ఉంది. గత పది రోజుల్లో (జూన్ 29–జూలై 8 వరకు) రాష్ట్రవ్యాప్తంగా 52,163 మంది నుంచి శాంపిల్స్ తీసుకొని ఆర్టీ–పీసీఆర్ పద్ధతిలో పరీక్షలు జరపగా ఇందులో 15,117 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన పరీక్షలు చేసిన శాంపిల్స్‌లో 29 శాతం పాజిటివ్ కేసులు నమోదైనట్లు స్పష్టమవుతోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నాటికి 1,34,801 నమూనాలను పరీక్షించారు. వాటిలో 29,536 నమూనాలు పాజిటివ్‌గా నిర్ధారణయ్యాయి. ఈ లెక్కన రాష్ట్రంలో పాజిటివ్ కేసుల శాతం 21.91గా ఉంది. జాతీయ స్థాయిలో పరీక్షలు, పాజిటివ్ కేసుల నమోదును పరిశీలిస్తే దేశవ్యాప్తంగా 1.07 కోట్ల శాంపిల్స్ పరిశీలించగా 7.67 లక్షల మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ లెక్కన జాతీయ సగటు పాజిటివ్ రేటు 7.1 శాతంగా ఉంది. జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్ర సగటు మూడు రెట్లు అధికంగా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో 80 శాతానికిపైగా పాజిటివ్ కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే బయటపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 30 వేల పాజిటివ్ కేసులు నమోదైతే అందులో రెండొంతులకు పైగా పాజిటివ్‌లు జీహెచ్ఎంసీ ఏరియాలో ఉన్నాయి. దీంతో గ్రేటర్ ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గ్రేటర్ తర్వాత రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో వైరస్ బారిన పడుతున్న వారు అధికంగా ఉన్నారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, నిజామాబాద్, కరీంగనర్ సంగారెడ్డి జిల్లాల్లోనూ వైరస్ ప్రభావం తీవ్రంగానే ఉంది. కరోనా కేసులతో పాటు మృతులు కూడా పెరుగుతుండడంతో తెలంగాణ జిల్లాల్లోని ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ప్రతీరోజు కేసుల సంఖ్య ఎక్కువవుతుండడంతో.. బయటకు వచ్చేందుకే జనం జంకుతున్నారు. కరోనా సోకిన వారి కుటుంబాలతో పాటు ఇతర జబ్బులు వచ్చిన వారు కూడా ఆందోళనతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. కరోనా పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో కొంత మందికే వ్యాప్తిచెందినా.. ప్రస్తుతం అన్ని ప్రాంతాల వారికి వస్తుండడంతో కరోనా లక్షణాలు ఉన్న వారు ఆసుపత్రులకు వెళుతున్నారు. జిల్లాకేంద్రాల్లోనే కాకుండా హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. జిల్లాల్లోని ప్రజాప్రతినిధులతో పాటు ఉద్యోగులు, సామాన్య ప్రజల్లోనూ కరోనా భయం పట్టుకుంది.

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
2 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
4 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
5 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
6 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
7 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
8 hours ago

వన్ ప్లస్ వన్ ఆఫర్
6 hours ago

నా రూటే సెపరేటు
10 hours ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
a day ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
a day ago
ఇంకా