newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గ్రేటర్ కు విపక్షాలకు షాక్ ఇచ్చేలా తెరాస 'ముందస్తు' వ్యూహం!

23-09-202023-09-2020 17:12:20 IST
Updated On 23-09-2020 17:16:53 ISTUpdated On 23-09-20202020-09-23T11:42:20.155Z23-09-2020 2020-09-23T11:42:18.042Z - 2020-09-23T11:46:53.096Z - 23-09-2020

గ్రేటర్ కు విపక్షాలకు షాక్ ఇచ్చేలా తెరాస 'ముందస్తు' వ్యూహం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కరోనా మహమ్మారి కట్టడి చర్యల నుంచి తెరాస ప్రభుత్వం ఒకింత విరామం తీసుకుని రాజకీయ కార్యకలాపాలకు ఉపక్రమిస్తున్నది. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు, మునిసిపల్ ఎన్నికలు, అలాగే గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో...రాజకీయ వ్యూహాలకు అధికార పార్టీ పదును పెడుతున్నది. ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు, గ్రేటర్ ఎన్నికలనూ అత్యంత ప్రతిష్టాత్మకంగా  తీసుకున్న అధికార పక్షం గెలుపు వ్యూహల రచనలో నిమగ్నమైంది. ఇటీవలి  వర్షాల కారణంగా  హైదరాబాద్ ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు గ్రేటర్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న అనుమానంతో డబుల్ ఇళ్ల ప్రచారానికి తెరతీసింది. అంతే కాకుండా విపక్షాలకు షాక్ ఇచ్చే విధంగా గ్రేటర్ కు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలన్న యోచన చేస్తున్నట్లు తెరాస వర్గాల సమాచారం.

విపక్షాలకు వ్యూహ రచనకు సమయం ఇవ్వకుండా ఈ ఏడాది డిసెంబర్ లోనే గ్రేటర్ ఎన్నికలు నిర్వహించాలన్నది అధిష్టానం వ్యూహంగా కనిపిస్తున్నది. ఒకే సారి మునిసిపోల్స్, గ్యాడ్యుయేట్ ఎన్నికలకు వెళ్లడం వల్ల అధికార  పార్టీకి అంత అనుకూలం కాదన్నది మునిసిపల్ మంత్రి, పార్టీ  కార్యనిర్వాహక అధ్యక్షుడు కేసీఆర్ భావనగా చెబుతున్నారు. అందుకే డిసెంబర్ లోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగితే విపక్షాలు ఎన్నికల సన్నాహకాలను పెద్దగా సమయం ఉండదని కేటీఆర్ భావనగా కనిపిస్తున్నది. ‘గ్రేటర్’కు  ముందస్తు ఎన్నికలు జరిపించి, ఆ తరువాత షెడ్యూల్ ప్రకారం గ్యాడుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వెళ్లడానికి తెరాస కసరత్తులు చేస్తున్నదని  చెబుతున్నారు.

అందుకే విపక్షాల కంటే ముందే తెరాసలో ఎన్నికల సన్నద్ధత  ఊపందుకుంది. సన్నాహక  సమావేశాలతో పార్టీ కేడర్ లో జోష్ పెంచింది. అభ్యర్థుల ఎంపికపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినా...అభ్యర్థి ఎవరైనా గెలుపు కోసం క్యాడర్  పని చేయాలన్న విధంగా కేడర్ ను సమాయత్తం చేస్తున్నది. గ్రేటర్ లో సెంచరీ కొట్టడమే  లక్ష్యమని  ప్రకటించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  ఆ దిశగా నగరంలో పార్టీ  కేడర్ ను  సమాయత్తం  చేయడంలో నిమగ్నమయ్యారు. విశ్వనగరంగా  హైదరాబాద్  అన్న నినాదంతో కిందటి సారి ఎన్నికలలో ఘన విజయాన్ని అందుకున్న తెరాస మరోసారి ఆ ఫీట్ ను రిపీట్ చేయాలన్న పట్టుదలతో ఉంది.


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle