newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

గ్రేటర్ ఎన్నికలపై సర్కార్ నజర్.. బడ్జెట్లో పెద్ద పీట అందుకేనా?

09-03-202009-03-2020 09:32:53 IST
2020-03-09T04:02:53.632Z09-03-2020 2020-03-09T03:56:07.416Z - - 31-05-2020

గ్రేటర్ ఎన్నికలపై సర్కార్ నజర్.. బడ్జెట్లో పెద్ద పీట అందుకేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్థికమంత్రి హరీష్ రావు బడ్జెట్లో హైదరాబాద్ నగరాభివృద్ధికి నిధుల వరద పారింది. హైదరాబాద్‌ అభివృద్ధికి రూ.7,547 కోట్ల కేటాయించడం వెనుక ఎన్నికల వ్యూహం ఉందని అంటున్నారు. ఈసారి బడ్జెట్లో పురపాలక శాఖకు రూ.12,282.35 కోట్ల కేటాయింపులు చేశారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేటీయార్ హైదరాబాద్‌ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల కోసం ఈ నిధులు కేటాయించారని చెబుతున్నారు. హైదరాబాద్‌కు ఇంత పెద్దమొత్తంలో నిధులు కేటాయించడం ఇదే తొలిసారి అంటున్నారు.

2018–19లో పురపాలక శాఖకు ప్రగతి పద్దు కింద రూ.4,680.09 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.1,262.21 కోట్లు కలిపి మొత్తం రూ.5,942.9 కోట్లు కేటాయించగా, తాజా కేటాయింపులు రెట్టింపు చేసింది. నిర్వహణ పద్దు కింద జల మండలికి నీటిసరఫరా, పారిశుధ్యం నిర్వహణ కోసం రుణాలను రూ.825 కోట్ల నుంచి రూ.900 కోట్లకు పెంచడం విశేషం.

రాజధానితో పాటు శివారు ప్రాంతాల అభివృద్ధికి 50 వేలకోట్లరూపాయలు ఖర్చుపెడతామని మంత్రి కేటీయార్ ప్రకటించారు. నగరం కోసం 10 వేల కోట్లు కేటాయించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అని టీఆర్ఎస్ నేతలు సంబరపడుతున్నారు.హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చాలన్న తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతకు బలం చేకూర్చే విధంగా బడ్జెట్‌ కేటాయింపులు ఉన్నాయన్నారు.

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌డీపీ కార్యక్రమంతో నగరంలో ఇప్పటికే అనేక ప్రాజెక్టులను చేపట్టి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నామని, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ తగ్గించేందుకు ఫ్లై ఓవర్లు, అండర్‌పాసులను వినియోగంలోకి తెచ్చామన్నారు. రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ప్రణాళికలు కొనసాగుతున్నాయని కేటీయార్ చెబుతున్నారు.

త్వరలో గ్రేటర్ కు ముందస్తు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో బడ్జెట్ కేటాయింపులపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. మరోసారి గ్రేటర్ పీఠంపై కన్నేసిన టీఆర్ఎస్ ఆదిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే ప్రభుత్వం తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి.  జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సమీపిస్తుండటంతో... టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్ డ్రామాకు తెరలేపిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ లో కోటి మందికిపైగా జనాభా నివసిస్తున్నారు. ష్ట్రానికి ఎక్కువ ఆదాయం భాగ్యనగరం నుంచే సమకూరుతోంది. దీంతో బడ్జెట్లో నగరానికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు.

నిత్యం ట్రాఫిక్ జాంలతో సతమతం అయ్యేవారికి మెట్రోరైలు మరింత చేరువ కానుంది.  నిత్యం లక్షల మంది ప్రయాణికులు క్షేమంగా మెట్రోరైలు ద్వారా గమ్యస్థానాలకు చేరుతున్నారు. పాత బస్తీలో మిగిలిన మెట్రో రూట్‌ను త్వరగా పూర్తి చేయడమే కాకుండా... మిగతా మార్గాలకు విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాయదుర్గం నుంచి శంషాబాద్, బీహెచ్‌ఈఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు మెట్రో రైలు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.రానున్న రోజుల్లో హైదరాబాద్ మరింత సుందరంగా మారనుంది. 

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

   3 hours ago


తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

   8 hours ago


భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

   11 hours ago


మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

   11 hours ago


నిమ్మగడ్డ  ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

నిమ్మగడ్డ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

   12 hours ago


మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

   14 hours ago


యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

   14 hours ago


‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

   14 hours ago


తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

   15 hours ago


డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

   30-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle