newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

21-02-202021-02-2020 14:21:56 IST
Updated On 21-02-2020 15:33:44 ISTUpdated On 21-02-20202020-02-21T08:51:56.127Z21-02-2020 2020-02-21T08:51:53.970Z - 2020-02-21T10:03:44.780Z - 21-02-2020

గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలంటే అధికార టీఆర్ఎస్ పార్టీ ఎగిరి గంతేస్తుంది. ముందస్తు అసెంబ్లీతో మొదలుపెట్టిన విజయ పరంపర మొన్న కార్పొరేషన్-మున్సిపల్, నిన్న వ్యవసాయ సహకార ఎన్నికల వరకు కొనసాగిస్తూనే ఉంది. ఇక మిగిలిన ఒకే ఒక్క ఎన్నికలు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు మాత్రమే. అది కూడా పూర్తిచేసి మరోసారి ప్రత్యర్థులకు బేజారెత్తించాలని టీఆర్ఎస్ పార్టీ ఆరాటపడుతుంది.

ప్రస్తుతం మాంచి జోష్ మీద ఉన్న పార్టీ, ప్రభుత్వం ఇదే జోష్ లో గ్రేటర్ ఎన్నికలు కూడా ముగిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. విజయ పరంపరకు ముహూర్తం పెట్టిన అసెంబ్లీ ఎన్నికలు కూడా ముందస్తుకు వెళ్లే మొదలుపెట్టగా గ్రేటర్ ఎన్నికలకు ముందస్తుగా వెళ్లి విజయాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్నట్లుగా అటు పార్టీ ఇటు ప్రభుత్వ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి.

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశ్యంలోనే పట్టణ ప్రగతి అంటూ మరోసారి మంత్రులు, ప్రజాప్రతినిధులను ప్రజలలోకి పంపినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా బస్తీలలో సమస్యలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఎక్కడిక్కడ పార్టీ నేతలకు ప్రజలతో మమేకం కావాలని సూత్రప్రాయంగా ఆదేశాలిచ్చినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆంధ్రా ఓటర్లు అధికంగా ఉండే ప్రాంతాలలో పార్టీ వర్గాలు మరింత దృష్టిపెట్టినట్లుగా చెప్తున్నారు.

ఇక అభివృద్ధిలో భాగంగా మున్సిపల్ ముందు పల్లెప్రగతి మొదలు పెట్టినట్లుగానే ఇప్పుడు పట్టణ ప్రగతి మొదలుపెట్టారు. ఇప్పటికే పలు ప్రాంతాలలో బ‌స్తీ ద‌వాఖానాల‌ను పెద్ద సంఖ్య‌లో ప్రారంభించారు. ఇంతకు ముందు 123 ఉన్న సంఖ్య‌ను మ‌రింత పెంచారు. ఆ దవాఖాలలో ముందుల అందుబాటుని కూడా పెంచాల‌ని సీఎం ఆదేశించారు. నగరంలో పలుచోట్ల రోడ్ల మ‌ర‌మ్మ‌తులను జీహెచ్ఎంసీ ప్రారంభించింది.

కాగా, అధికార పార్టీ ఈ రకంగా తన ప్రణాళికలో తానుంటే ప్రతిపక్షాలు మాత్రం ఇంకా మున్సిపల్ ఫలితాలు పుట్టించిన దడ నుండే బయటపడలేదు. పైగా గ్రేటర్ సమరానికి యధావిధిగా నిర్వహిస్తే మరో ఏడాది సమయం ఉంది కనుక ప్రస్తుతానికి ప్రతిపక్షాలు స్థబ్ధుగానే ఉన్నాయి. ఇదే అదనుగా అధికార పార్టీ సమర శంఖం పూరించి మరోసారి కోలుకోకుండా దెబ్బతీయాలని ఆరాటపడుతున్నట్లుగా తెలుస్తుంది.

ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్తే నగరంలో మిగతా పార్టీలు ఎన్నికలకు సిద్దమవడం కష్టమే అవుతుంది. పైగా ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ఫలితాలు అధికార పార్టీనే కైవసం చేసుకోగా ప్రజలలో కూడా ఒక రకమైన భావన కూడా ఉంది. అన్ని లెక్కలు చూసుకున్నాకే టీఆర్ఎస్ ఎన్నికలకు సిద్దమైనట్లుగా వినిపిస్తుంది. మరి అసెంబ్లీ ముందస్తు మాదిరే గ్రేటర్ ముందస్తులో కూడా కేసీఆర్ ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది చూడాల్సి ఉంది.

 

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   12 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   8 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   10 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   13 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   15 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   17 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   18 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   19 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   20 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle