newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గ్రేటర్‌లో పరిస్థితులు చేయిదాటిపోతున్నాయ్.. తక్షణం లాక్ డౌన్ విధించాల్సిందే

30-06-202030-06-2020 07:18:56 IST
Updated On 30-06-2020 08:52:43 ISTUpdated On 30-06-20202020-06-30T01:48:56.659Z30-06-2020 2020-06-30T01:48:54.109Z - 2020-06-30T03:22:43.523Z - 30-06-2020

గ్రేటర్‌లో పరిస్థితులు చేయిదాటిపోతున్నాయ్.. తక్షణం లాక్ డౌన్ విధించాల్సిందే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్‌ విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా లాక్‌డౌన్‌పై చర్చించేందుకు తెలంగాణ మంత్రివర్గం జూలై 1 లేదా 2న‌ సమావేశం కానుంది. గ్రేటర్‌లో కమ్యూనిటీ వ్యాప్తి ప్రారంభమైందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో పరిస్థితులు చేయి దాటిపోయే ప్రమాదముందని, తక్షణమే జీహెచ్‌ఎంసీ పరిధిలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించింది. 

సీఎం కేసీఆర్‌ ఇప్పటికే కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ, వైరస్‌ సోకిన వారికి అందుతున్న చికిత్స, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై ఆదివారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఇక పరిస్థితుల దృష్ట్యా నగరంలో 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించనున్నట్లు ఇప్పటికే వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. 

అయితే ఈసారి కఠినమైన లాక్‌డౌన్‌ను విధించాలని, 15 రోజుల పాటు ప్రజలను పూర్తిగా ఇళ్లకే పరిమితం చేయాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కేవలం ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యసేవలు, మందుల దుకాణాలకు మాత్రమే లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపునివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 975 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15,394కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 5,582 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 9,559 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనాతో మరో 6 గురు మృతిచెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 253కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 861 ఉన్నాయి.

ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి గ్రేటర్‌లో 11,813కు కరోనా పాజిటివ్‌ కేసులు చేరుకున్నాయి. రంగారెడ్డి 40, మేడ్చల్‌ 20, సంగారెడ్డి 14, కరీంనగర్‌లో 10 కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి 8, వరంగల్‌ రూరల్‌ 5, వరంగల్‌ అర్బన్‌లో 4 కేసులున్నట్లు అధికారులు తెలిపారు. మహబూబ్‌నగర్‌ 3, కామారెడ్డి, యాదాద్రి, నల్గొండలో రెండేసి కేసులు నమోదయినట్లు అధికారులు చెబుతున్నారు. సిద్దిపేట, కుమ్రం భీం, గద్వాల, మహబూబాబాద్‌లో ఒక్కో కేసు నమోదయింది.

సోమవారం హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో హోంమంత్రికి వైద్యం అందిస్తున్నారు. మూడురోజుల క్రితమే మహమూద్‌ అలీ టెస్టులు చేయించుకున్నారు. అస్తమా ఉండటంతో ముందుగానే కుటుంసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. 

భాగ్యనగరంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో వెలుగుచూస్తున్న కేసుల్లో ఎక్కువగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉంటున్న నేపథ్యంలో.. వైరస్‌ వ్యాప్తి నియంత్రణ కోసం ప్రభుత్వం లాక్‌డౌన్ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ విషయాన్ని సూచన ప్రాయంగా తెలిపిన విషయం తెలిసిందే. జులై 1వ తేదీ లేదా 2వ తేదీ తెలంగాణ కేబినెట్‌ భేటీ కాబోతోంది. ఈ భేటీలో హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ విధించే అంశంపై చర్చించే అవకాశం ఉంది. 

కాగా, ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 3,227 మందికి పరీక్షలు నిర్వహించగా ఏకంగా 30% మందికి పాజిటివ్‌ రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 82,458 మందికి పరీక్షలు నిర్వహించగా 17.48%మందికి పాజిటివ్‌ వచ్చింది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle