newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గ్రేటర్‌లో కరోనా కల్లోలం... తెలంగాణ 985 పాజిటివ్‌ కేసులు

27-06-202027-06-2020 07:46:36 IST
Updated On 27-06-2020 11:25:43 ISTUpdated On 27-06-20202020-06-27T02:16:36.397Z27-06-2020 2020-06-27T02:15:00.821Z - 2020-06-27T05:55:43.439Z - 27-06-2020

గ్రేటర్‌లో కరోనా కల్లోలం... తెలంగాణ 985 పాజిటివ్‌ కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. శుక్రవారం కొత్తగా 985 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,349కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని 4,766 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 7,436 ఉన్నాయి. నేడు కరోనాతో ఏడుగురు మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 237గా నమోదైంది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 774, రంగారెడ్డి 86, మేడ్చల్ 53 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలంగాణలో శుక్రవారం కొత్తగా 985 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,349కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 7436. ఇవాళ తెలంగాణలో నమోదైన 985 కరోనా పాజిటివ్ కేసుల్లో 774 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదయినట్లు ప్రభుత్వం తెలిపింది. జీహెచ్‌ఎంసీ తర్వాత అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 86 కరోనా కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ 53 కేసులతో మూడో స్థానంలో ఉంది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,238కి చేరింది. తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య కూడా కలవరపెడుతోంది. శుక్రవారం ఒక్కరోజే ఏడుగురు మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటివరకూ 237 మంది కరోనా వల్ల మృతి చెందారు. తెలంగాణలో ఇవాళ కరోనా నుంచి 98 మంది కోలుకున్నారు. ఇప్పటివరకూ 4,766 మంది డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

నగరంలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 237 మంది కరోనాతో మృతి చెందగా.. వారిలో 200 మందికిపైగా గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ఛాతీ ఆస్పత్రిలో పనిచేస్తున్న విక్టోరియా జయమణి అనే హెడ్‌ నర్సు కరోనాతో మృతిచెందారు. ఈనెల 30న పదవీ విమరణ చేయాల్సిన తరుణంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. తాను వయసురీత్యా పెద్ద కావడంతో కరోనా ఐసోలేషన్‌ వార్డులో పనిచేయలేనని, ఆ విధుల నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని సూపరింటెండెంట్‌ను అభ్యర్థించినా ఆయన అంగీకరించలేదని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు.

కాగా, ఇప్పటివరకు గాంధీ ఆస్పత్రిలో 20 మంది వైద్యులు, పది మంది పారా మెడికల్‌ స్టాఫ్‌ కరోనా వైరస్‌ బారిన పడగా.. ఉస్మానియా వైద్య కళాశాల పరిధిలోని స్పెషాలిటీ ఆస్పత్రుల్లో సుమారు వంద మందికి వైరస్‌ సోకింది. ఇక నిమ్స్‌లో 67 మందికి కరోనా సోకగా, వీరిలో 26 మంది వైద్యులు, 41 మంది పారామెడికల్‌ సిబ్బంది ఉన్నారు. మలక్‌పేట్, కొండాపూర్‌ ఆస్పత్రుల్లోనూ 30 మంది వైద్య సిబ్బంది వైరస్‌ బారిన పడ్డారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో 6 కేసులు నమోదయ్యాయి. ఇదిలాఉండగా.. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ పరీక్షల కోసం కింగ్‌కోఠి ఆస్పత్రికి చేరుకున్న సత్తెమ్మ అనే బాధితురాలు ఆస్పత్రి గేటు ముందే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle