newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 71 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 1991 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

06-04-202006-04-2020 08:56:40 IST
Updated On 06-04-2020 09:02:02 ISTUpdated On 06-04-20202020-04-06T03:26:40.600Z06-04-2020 2020-04-06T03:26:10.672Z - 2020-04-06T03:32:02.610Z - 06-04-2020

గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిముషాల పాటు దేశవ్యాప్తంగా లైట్లు ఆర్పేశారు. ప్రధాని మోడీ పిలుపుతో కరోనా చీకట్లను తరిమేసేందుకు జాతియావత్తూ ముందుకు కదిలింది. ముందుగా పక్కా వ్యూహం అమలుచేయడంతో పవర్ గ్రిడ్ పై భారం పడలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి లైట్లు ఆర్పేసినా విద్యుత్‌కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండాచేసిన విద్యుత్‌శాఖను ముఖ్యమంత్రి కేసీయార్ అభినందించారు. అంచనావేసిన దానికన్నా భారీగా డిమాండ్‌ పడిపోయింది. కానీ వ్యూహాత్మకంగా బ్యాలెన్స్‌చేయగలిగామని జెన్‌కో-ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. దీంతో  ప్రభాకర్ రావుతో పాటు డైరెక్టర్లు, ఇంజినీర్లకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రంలో ఆదివారం రాత్రి 9 గంటలకు  ఒకేసారి విద్యుత్‌ దీపాలు ఆర్పేశారు. విద్యుత్‌ వినియోగంలో ఒకేసారి భారీ మార్పులు సంభవించినప్పటికీ ఉత్పత్తి-సరఫరా మధ్య పూర్తిస్థాయి సమతూకాన్ని సాధించారు.  ఈ విపయంలో జెన్‌కో, ట్రాన్స్‌కో విజయం సాధించాయి. విద్యుత్‌ గ్రిడ్‌కు ఎలాంటి నష్టం కలుగకుండా చూసేందుకు విద్యుత్‌ సంస్థల సీఎండీ ప్రభాకర్‌రావు ఆదివారం ఉదయం నుంచి విద్యుత్‌సౌధలోని స్టేట్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్ లోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

రాత్రి 9 గంటల వరకు 7,300 మెగావాట్లున్న విద్యుత్‌ డిమాండ్‌.. తర్వాత ఒక్కసారిగా లైట్లు ఆర్పివేయడంతో 5,800 మెగావాట్లకు పడిపోయిందని తెలిపారు. తగ్గిన 1,500 మెగావాట్ల డిమాండ్‌ను మెయిన్‌టెయిన్‌ చేసేందుకు నాగార్జునసాగర్‌, శ్రీశైలం రిజర్వాయర్ల వద్ద రివర్స్‌ పంపింగ్‌ నిర్వహించారు. దీనివల్ల విద్యుత్ వినియోగం సమతూకం అయింది. ఇటు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పరిధిలో 120 మెగావాట్ల సామర్థ్యంతో పంపింగ్‌ కొనసాగించారు. 

ఈ కార్యక్రమానికి ముందే ఎలక్ట్రికల్ ఇంజనీర్లు కొన్ని సూచనలు చేశారు. వీధి లైట్లు, ఇంట్లో టీవీలు, ఫ్రిజ్ లు, ఇన్వర్టర్లు, ఫ్యాన్లు, ఏసీలు ఆపవద్దని కోరారు. ప్రధాని పిలుపును పాటిస్తున్న సందర్భంగా వీధి లైట్లను బంద్‌ చేయాలని ఎవరూ ఎటువంటి పిలుపు ఇవ్వలేదని, శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని వీధి లైట్ల ఆర్పొద్దని స్థానిక సంస్థలకు కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ సూచించింది. అర్ధగంట ముందుగానే అగ్రికల్చర్ విద్యుత్తు అందించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. మరోవైపు ఎలక్ట్రికల్ ఇంజనీర్లు పలు సూచనలు చేశారు. లైట్లు ఆర్పేసినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాని మోడీ పిలుపునకు మంచి స్పందన లభించింది. ప్రమిదలు, కొవ్వొత్తులతో జనం దీపకాంతులు వెదజల్లారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle