newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

21-02-202021-02-2020 17:43:11 IST
Updated On 21-02-2020 17:43:05 ISTUpdated On 21-02-20202020-02-21T12:13:11.397Z21-02-2020 2020-02-21T12:12:38.058Z - 2020-02-21T12:13:05.775Z - 21-02-2020

గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో గ్రామాల అభివృద్దిపైనే దృష్టిపెడుతున్నారు సీఎం కేసీయార్, మంత్రి కేటీయార్. తరచూ గ్రామాల్లో పర్యటిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రం స‌మ‌గ్ర అభివృద్ది సాధించాలంటే గ్రామాలు ఎదగాలంటున్నారు ఐటీ మంత్రి కేటీయార్. సిరిసిల్లలో జరిగిన పంచాయతీరాజ్ సమ్మేళనంలో మంత్రి పాల్గొని పాలన ఎలా వుండాలో నిర్దశించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి సంబంధిత గ్రామ ప్రజలు నడుం బిగించాలన్నారు. ప్రభుత్వం అంటే ప్రజలే అని.. గ్రామాల్లోని పాలనను నడిపే బాధ్యత వారిదేనన్నారు. 

పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అనే నానుడిని ముఖ్యమంత్రి  కేసీఆర్‌ నిజం చేస్తున్నారని, గ్రామాల సమగ్ర ప్రగతికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి కేటీయార్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు పంచాయితీరాజ్ సమ్మేళనంలో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని స్వ‌రాష్ట్రంలో గొప్పగా నిర్వహించుకుంటున్నామ‌ని చెప్పారు. 

పరిపాలన సౌలభ్యం కోసమే రాష్ట్రం ఏర్పడిందని, అనంతరం ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకే జిల్లాల విభజన జరిగిందన్నారు. రాష్ట్రంలో 12751 గ్రామపంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగిందని‌ ప్రజలకు మెరుగైన ఫలాలు అందించాలన్పది ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు. అందుకే సంస్కరణలు చేయడం జరిగిందని, కొత్త పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాలను తీసుకురావడానికి కారణం కూడా ఇదేనన్నారు. అభివృద్ధి ఎలా చేస్తారని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారన్నారు. కొత్త చట్టాలు కఠినంగా ఉన్నాయి. పని చేయక పోతే పదవులు పోతాయన్న విషయం గుర్తు పెట్టుకోవాలని కేటీఆర్ సూచించారు.

తమ అభివృద్ధికి పాటుపడేవారినే ప్రజలు పదికాలాలపాటు గుర్తుంచుకుంటారన్నారు. పారిశుద్ధ్యం, పచ్చదనంపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్రం దేశంలో ఏదీలేదని, మీ గ్రామానికి మీరే కథానాయకులు అనుకుంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని కేటీఆర్ అన్నారు. అవసరం అయితే మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలను ఆపేసైనా గ్రామపంచాయతీలకు సీఎం నిధులిస్తున్నారంటే గ్రామాల అభివృద్ధిపై చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   12 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   7 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   10 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   12 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   15 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   16 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   17 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   19 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   19 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle