గౌలిగూడ లెదర్ షూ మార్ట్లో మంటలు.. తప్పిన ప్రాణనష్టం
28-08-202028-08-2020 08:32:12 IST
Updated On 28-08-2020 09:12:50 ISTUpdated On 28-08-20202020-08-28T03:02:12.851Z28-08-2020 2020-08-28T03:01:49.210Z - 2020-08-28T03:42:50.308Z - 28-08-2020

వరుస అగ్ని ప్రమాదాలు తెలుగు రాష్ట్రాలను వేధిస్తున్నాయి. శ్రీశైలం ఎడమ విద్యుత్ ప్లాంటులో భారీ ప్రమాదం జరిగి 9మంది మరణించిన సంగతి తెలిసిందే. ఏపీలోని విజయవాడ డా.నార్లతాతారావు విద్యుత్ ప్లాంట్లో గురువారం ప్రమాదం జరిగింది. ఈ ఘటనలను మరిచిపోకముందే హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇలా నిత్యం ఏదో ఒక చోట వీటి కారణంగా ఆస్తి ప్రాణ నష్టం భారీగానే వాటిల్లుతోంది. పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రమాదాలు సర్వసాధారణం అయిపోయాయి. హైదరాబాద్లో అగ్ని ప్రమాదం సంభవించినా ప్రాణనష్టం మాత్రం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గౌలిగూడలోని లెదర్ షూ మార్ట్లో మంటలు అంటుకున్నాయి. భారీగా ఎగిసిపడిన మంటలను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పరుగులు తీసిన జనం వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఐదు ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పారు. ప్రమాద సమయంలో ఈ షాపులో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు. సాగర్ అనే వ్యాపారి గౌలిగూడలో మూడంతస్తుల భవనంలో లెదర్ షాపును నిర్వహిస్తున్నాడు. అందులో స్కూల్ బ్యాగులు, లెదర్ బెల్టులు, షూస్లను విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో రాత్రి 10:30 గంటల సమయంలో మొదటి అంతస్తు నుంచి దట్టమైన పొగలు వెలువడ్డాయి. అవి విస్తరించి బిల్డింగ్ మొత్తం అంటుకున్నాయి. పక్కనే ఉన్న ఓ వసతి గృహానికి కూడా మంటలు వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. లెదర్ వస్తువులు దగ్ధం కావడంతో దుర్వాసన తీవ్రంగా రావడంతో సమీప ప్రాంతంలోని వారు చాలా ఇబ్బంది పడ్డారు. షాపును మూసి ఇంటికెళ్లిన కొంతసేపటికే ఇది జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఇది జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. నష్టం భారీగానే వుంటుందని భావిస్తున్నారు.

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
an hour ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
2 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
2 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
4 hours ago

కేటీఆర్ కి అంత సీన్ లేదులే
5 hours ago

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!
6 hours ago

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ
21 hours ago

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!
20 hours ago

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!
21 hours ago

గత సావాసంతో టీఆర్ఎస్ కు కమ్యూనిస్టుల సపోర్ట్
19 hours ago
ఇంకా