newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గోదావరి బోర్డు సమావేశం సామరస్యమే కానీ.. లెక్కలు తేడాలు తేల్చేదెవరు?

06-06-202006-06-2020 09:23:08 IST
Updated On 06-06-2020 09:51:07 ISTUpdated On 06-06-20202020-06-06T03:53:08.178Z06-06-2020 2020-06-06T03:53:04.908Z - 2020-06-06T04:21:07.254Z - 06-06-2020

గోదావరి బోర్డు సమావేశం సామరస్యమే కానీ.. లెక్కలు తేడాలు తేల్చేదెవరు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కొత్త ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాలకు గోదావరి బోర్డు ఆదేశం

కాళేశ్వరంతో సహా అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఈ నెల 10లోగా ఇవ్వాలి

అపెక్స్‌ కౌన్సిల్‌కు తక్షణమే అజెండాలను పంపాలని రాష్ట్రాలకు సూచన

గోదావరి జలాల్లో తెలంగాణకు 967 టీఎంసీల వాటా వాదనను తోసిపుచ్చిన ఆంధ్రప్రదేశ్‌

ట్రిబ్యునల్‌ తెలంగాణకు ప్రత్యేకంగా నీటి కేటాయింపులు ఎక్కడ చేసిందో చూపాలని ప్రశ్న

నీటి వినియోగం లెక్కలు తేల్చేందుకు టెలీమీటర్ల ఏర్పాటుకు బోర్డు నిర్ణయం

దామాషా పద్ధతిలో పెద్దవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ వ్యయం

సమావేశం సామరస్యమే.. ముందుంది ముసళ్ల పండగ

గోదావరి నదీ యాజమాన్య బోర్డు కొత్త ప్రాజెక్టులు విషయమై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు శుక్రవారం సమావేశంలో ముకుతాడు వేసినట్లు కనబడుతున్నప్పటికీ ఇరు రాష్ట్రాల వాదనల నిగ్గు తేల్చే విషయంలో తేడా కొడుతోందా? తాజా బోర్డు సమావేశంలో కాస్త ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే గోదావరిపై కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని ఉభయ తెలుగు రాష్ట్రాలను గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఆదేశించడమే. జూన్ 10 లోగా రెండు తెలుగ రాష్ట్రాలు డీపీఆర్లను ఇవ్వాల్సిందే అని బోర్డు స్పష్టం చేయడం కొసమెరుపు. 

విభజన తర్వాత అంటే 2014 జూన్‌ 2 తర్వాత చేపట్టినవి, సీడబ్ల్యూసీ నుంచి సాంకేతిక అనుమతి లేని ప్రాజెక్టులన్నీ కొత్తవిగానే పరిగణిస్తామని బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ స్పష్టం చేశారు. గోదావరి బోర్డు, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) డీపీఆర్‌లను పరిశీలించి సాంకేతికంగా సిఫార్సు చేయాలని, అపెక్స్‌ కౌన్సిల్‌ నుంచి ప్రాజెక్టులకు అనుమతి తీసుకోవాలని ఇరు రాష్ట్రాలకు బోర్డు సూచించింది. కానీ రెండు రాష్ట్రాలు తమ వాదనలను సమర్థించుకుంటూ బోర్డు సమావేశంలో చేసిన ఆరోపణలు పరిశీలిస్తే నీటివినియోగంపై లెక్కల తప్పుల లెక్క తేలడం, తేల్చడం కేంద్ర జలశక్తి సంఘానికైనా అంత సులువు కాదనిపిస్తోంది.

శుక్రవారం హైదరాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన గోదావరి బోర్డు సమావేశంలో ఏపీ, తెలంగాణ అధికారాలు తమ వాదనలను తీవ్రస్థాయిలోనే వినిపించారు. తెలంగాణ సర్కార్‌ గోదావరిపై కొత్తగా ప్రాజెక్టులు చేపట్టలేదని ఆ రాష్ట్ర అధికారులు పేర్కొనటంపై ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘గోదావరి బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే 225 టీఎంసీల సామర్థ్యంతో కాళేశ్వరం ఎత్తిపోతల, 22 టీఎంసీల సామర్థ్యంతో జీఎల్‌ఐఎస్‌–3, 70 టీఎంసీలతో సీతారామ ఎత్తిపోతల, 100 టీఎంసీలతో తుపాకులగూడెం, 23.76 టీఎంసీలతో తెలంగాణ డ్రింకింగ్‌ వాటర్‌ ప్రాజెక్టు, 0.35 టీఎంసీల సామర్థ్యంతో భీమ్‌కుంద్‌ బ్యారేజీ, ఐదు టీఎంసీలతో చనాఖా–కోరటా, 1.20 టీఎంసీలతో పింపరాడ్‌–పర్సోడా బ్యారేజీల నిర్మాణాన్ని తెలంగాణ  చేపట్టింది. రామప్ప లేక్‌ నుంచి పాకాల లేక్‌కు మళ్లింపు ద్వారా మూడు టీఎంసీలు వెరసి 450.31 టీఎంసీల గోదావరి జలాలను తరలించేలా తెలంగాణ సర్కార్‌ పనులు చేపట్టింది’ అని ఏపీ అధికారులు వివరించారు. 

తెలంగాణ సర్కార్‌ కాళేశ్వరం ఎత్తిపోతల సామర్థ్యాన్ని 225 టీఎంసీల నుంచి 450 టీఎంసీలకు, సీతారామ ఎత్తిపోతల సామర్థ్యాన్ని 70 నుంచి 100 టీఎంసీలకు పెంచుతూ నిర్ణయం తీసుకుందని, దీనివల్ల 150 ఏళ్ల చరిత్ర ఉన్న గోదావరి డెల్టా, జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఏపీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. పైగా పట్టిసీమ, పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకు తరలిస్తున్న గోదావరి జలాలకుగానూ కృష్ణా నీటిలో తమకు 45 టీఎంసీల వాటా అదనంగా ఇవ్వాలని తెలంగాణ అధికారులు పేర్కొనటంపై ఏపీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రిబ్యునల్‌ తీర్పు ఉమ్మడి రాష్ట్రానికి వర్తిస్తుందని, నదీ పరీవాహక ప్రాంతంలో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు ఆ 45 టీఎంసీలు దక్కుతాయని, ఈ అంశాన్ని బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ–2) తేల్చుతుందని స్పష్టం చేశారు.

గోదావరి జలాల్లో 967 టీఎంసీలను వినియోగించుకునేలా తెలంగాణలో ప్రాజెక్టులు చేపడతామని ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారని, దీని ఆధారంగా తమ రాష్ట్రానికి గోదావరి జలాల్లో 967 టీఎంసీల వాటా ఉన్నట్లు స్పష్టమవుతోందని, వాటా జలాలను వినియోగించుకోవడానికే ప్రాజెక్టులు చేపట్టామని తెలంగాణ అధికారులు పేర్కొనడంపై ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటి కేటాయింపులకు బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పే ప్రామాణికమని, అందులో తెలంగాణకు ప్రత్యేకంగా నీటి కేటాయింపులు ఎక్కడ చేశారో చూపాలని ఏపీ అధికారులు ప్రశ్నించారు.

రాష్ట్ర విభజన చట్టానికి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని గతనెల 19న ఆంధ్రప్రదేశ్‌ ఇచ్చిన ఫిర్యాదుపై ప్రధానంగా చర్చ జరిగింది. కాళేశ్వరం ఎత్తిపోతలకు 225 టీఎంసీలు, జీఎల్‌ఐఎ్‌స-3కి 22 టీఎంసీలు, సీతారామ ప్రాజెక్టుకు 70 టీఎంసీలు, తుపాకులగూడెంకు 110 టీఎంసీలు, తెలంగాణ తాగునీటి అవసరాల కోసం 23.76 టీఎంసీలు, ఇతరత్రా పథకాలతో కలిపి మొత్తం 450.31 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రాజెక్టులను కొత్తగా నిర్మిస్తోందని ఆంధ్ర తన ఫిర్యాదులో పేర్కొనగా.. ఆంధ్రప్రదేశ్‌ నిర్మించిన పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలపై తెలంగాణ ఫిర్యాదు చేసింది. 

గోదావరిలోని 1,426 టీఎంసీల జలాల్లో 650 టీఎంసీలు తెలంగాణకు.. 776 టీఎంసీలు తమకు దక్కుతాయని ఆంధ్రప్రదేశ్‌ ఈ సమావేశంలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టులకు 660 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 116 టీఎంసీలు దక్కుతాయని వివరించింది. తెలంగాణ ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టులకు 472 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 178 టీఎంసీలు.. మొత్తం 650 టీఎంసీలు వాటాగా వినియోగించుకునే వీలుందని పేర్కొంది. కాగా.. కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలను రెండు రాష్ట్రాలూ తక్షణమే నిలుపుదల చేయాలని.. వాటికి డీపీఆర్‌లను సమర్పించాలని జీఆర్‌ఎంబీ ఆదేశించింది. 

పట్టిసీమ, పురుషోత్తపట్నం డీపీఆర్‌లను ఇప్పటికే సమర్పించామని.. సాంకేతికాంశాలు కొన్ని చూపుతున్నందున వాటికి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో డీపీఆర్‌లను సమర్పిస్తామని ఆంధ్రప్రదేశ్‌ తెలిపింది. తాము నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ పాతవే అయినందున.. డీపీఆర్‌లను సమర్పించాల్సిన అవసరం లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ వాదించారు. ఉమ్మది ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణఱ భూభాగంలో సాగు నీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహించినందునే ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం వచ్చిందని చెప్పారు. తమ ప్రభుత్వాన్ని సంప్రదించాకే.. డీపీఆర్‌లను సమర్పిస్తామన్నారు. అయితే డీపీఆర్‌లను సమర్పించాల్సిందేనని జీఆర్‌ఎంబీ తేల్చిచెప్పింది. ఇందుకు తెలంగాణ సరేనంది. ఆంధ్ర కూడా అంగీకరించింది. ఈ నెల పదో తేదీలోపు వాటిని సమర్పించేందుకు రెండు రాష్ట్రాలూ సమ్మతించాయి. 

గోదావరి జలాల వినియోగం లెక్కలను తేల్చడానికి టెలీమీటర్లు ఏర్పాటు చేయాలన్న బోర్డు ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. వీటిని ఏర్పాటు చేసే ప్రాంతాలను గుర్తించేందుకు సీడబ్ల్యూసీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సీపీడబ్ల్యూఆర్‌ఎస్‌ (పుణే) అధికారులతో కమిటీని నియమించాలని బోర్డు నిర్ణయించింది. కమిటీ నివేదిక ఆధారంగా టెలీమీటర్ల ఏర్పాటుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి.

బోర్డు సర్వసభ్య సమావేశం స్నేహపూర్వకమే కానీ..

బోర్డు సర్వసభ్య సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ ఆ  తర్వాత విలేకరులకు వెల్లడించారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 2014 తర్వాత గోదావరి నదిపై కొత్తగా నిర్మించే ప్రాజెక్టుల డీపీఆర్‌లను కేంద్ర జలసంఘానికి, బోర్డుకు సమర్పించి.. అపెక్స్‌ కౌన్సిల్‌ సమ్మతిని పొందేందుకు తెలంగాణ అంగీకరించిందన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ కూడా గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుకు సప్లిమెంటరీ డీపీఆర్‌లను ఇవ్వడానికి సమ్మతించిందని చెప్పారు. గోదావరి జలాల వినియోగాన్ని లెక్కించేందుకు వీలుగా టెలిమెట్రీల ఏర్పాటుకు వీలుగా జీఆర్‌ఎంబీ ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ, జలసంఘం, పుణేలోని సీడబ్ల్యుపీఆర్‌కు చెందిన నిపుణులతో కమిటీ వేయాలని తీర్మానించినట్లు తెలిపారు. 

ఇంతవరకు బాగానే ఉంది కానీ రెండు రాష్టాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్టుల విషయంలో కేంద్ర జలశక్తి సంస్థ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు దానికి కట్టుబడతాయా అనేదే సందేహంగా ఉంది.

 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   16 minutes ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   9 minutes ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   an hour ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   4 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   3 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   6 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   19 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle