గోకుల్ ఛాట్ క్లోజ్..నిర్వాహకుడికి కరోనా పాజిటివ్
16-06-202016-06-2020 18:36:15 IST
Updated On 16-06-2020 18:35:58 ISTUpdated On 16-06-20202020-06-16T13:06:15.281Z16-06-2020 2020-06-16T13:03:12.270Z - 2020-06-16T13:05:58.622Z - 16-06-2020

హైదరాబాద్ లో అణువణువు కరోనా మహమ్మారి బారిన పడుతోంది. జనం ఎక్కువగా తిరిగే ప్రాంతాలన్నీ కరోనా పాజిటివ్ కేసులతో సతమతం అవుతున్నాయి. తాజాగా కోఠిలోని గోకుల్ ఛాట్ నిర్వాహకుడికి కరోనా నిర్ధారణ అయింది. హైదరాబాద్ అనగానే గోకుల్ చాట్ గుర్తుకు రాకమానదు. ఎవరు హైదరాబాద్ వచ్చినా కోఠిలో గోకుల్ చాట్ లో టీ తాగుతారు, పానీపురి, ఛాట్ లాంటివి తినకుండా వుండరు. తాజాగా కరోనా వైరస్ వీరవిహారం చేస్తున్న వేళ గోకుల్ చాట్ నిర్వాహకుడికి కూడా కరోనా సోకడం కలకలం రేపుతోంది. దీంతో అతడిని చికిత్స కోసం తరలించారు.. అతడి కుటుంబ సభ్యులకు, ఛాట్ లోని సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.. వారందర్ని క్వారంటైన్ కి తరలించారు.. ఛాట్ కోసం ప్రతి రోజు వేలాది మంది ఇక్కడకు వస్తుంటారు.. మరి ఇక్కడ నిర్వాహకుడికి కరోనా సోకడంతో అతని ద్వారా ఎంతమందికి సోకిందోనని అధికారులు భయపడుతున్నారు. గత నాలుగు రోజులగా గోకుల్ ఛాట్ సందర్శించిన వారు కరోనా అనుమాన లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అధికారులు కోరారు.. ముందు జాగ్రత్త చర్యలగా గోకుల్ ఛాట్ ను మూసి వేసి, కోఠి ప్రాంతంలో శానిటైజేషన్ చేయించారు. తెలంగాణలో ప్రతిరోజూ వెలుగులోకి వచ్చే కరోనా పాజిటివ్ కేసులలో గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలోనే ఎక్కువగా వస్తున్నాయి. దీంతో హైదరాబాద్ పేరుచెబితేనే జనం భయపడిపోతున్నారు. గతంలో ఇక్కడ తీవ్రవాదులు పేలుడుకి పాల్పడిన సంగతి తెలిసిందే. 13 ఏళ్ల క్రితం గోకుల్ చాట్, లుంబినీ పార్కుల్లో తీవ్రవాదులు బాంబు పేలుడుతో అలజడి కలిగించారు. టైమర్ బాంబులు పేల్చి 44 మంది మరణాలకు కారణమైన ఉగ్రవాదులు అనీక్ షఫీక్ సయీద్, మహమ్మద్ అక్బర్ ఇస్మాయిల్‌కు న్యాయస్థానం 2018లో ఉరిశిక్ష విధించింది. మరో దోషి తారీఖ్ అంజూమ్‌కు జీవిత ఖైదు విధించింది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
14 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
10 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
13 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
17 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
20 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
21 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా