newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గులాబీ లీడ‌ర్స్‌తో ఓవైసీ బ్ర‌ద‌ర్స్‌ గొడ‌వేంటి..?

23-01-202023-01-2020 08:01:47 IST
Updated On 23-01-2020 11:34:59 ISTUpdated On 23-01-20202020-01-23T02:31:47.657Z23-01-2020 2020-01-23T02:31:40.980Z - 2020-01-23T06:04:59.829Z - 23-01-2020

గులాబీ లీడ‌ర్స్‌తో ఓవైసీ బ్ర‌ద‌ర్స్‌ గొడ‌వేంటి..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్ర స‌మితికి మిత్ర‌ప‌క్షంగా ఉన్న ఎంఐఎం పార్టీ వైఖ‌రి ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఒక‌వైపు ఈ రెండు పార్టీల అధినేత‌లు స‌న్నిహితులుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా నేత‌లు మాత్రం ప‌రస్ప‌ర విమ‌ర్శ‌లు చేస్తూ క‌య్యానికి కాలు దువ్వుతున్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌తో మంచి సంబంధాలు నెర‌పుతున్న ఎంఐఎం అధినేత అస‌దుద్దిన్ ఓవైసీ, ఆయ‌న సోద‌రుడు అక్బ‌రుద్దిన్ ఓవైసీ వైఖ‌రి ఈ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కొంత మారింది. ఈ ఎన్నిక‌ల ద్వారా తెలంగాణ‌లో ముస్లింలు అధికంగా ఉన్న న‌గ‌రాల‌కు, ప‌ట్ట‌ణాల‌కు విస్త‌రించాల‌ని ఎంఐఎం భావిస్తోంది.

ఎంఐఎం మిత్ర‌ప‌క్షంగా ఉన్న పొత్తు లేక‌పోవ‌డంతో టీఆర్ఎస్ కూడా అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టింది. రెండు పార్టీల మ‌ధ్య కొన్ని చోట్ల అవ‌గాహ‌న కుదిరినా మెజారిటీ మున్సిపాలిటీల్లో రెండు పార్టీలు ప్ర‌త్యర్థుల్లానే త‌ల‌ప‌డ్డాయి. ఈ క్ర‌మంలో ఎంఐఎంకు ఎక్క‌డిక‌క్క‌డ స్థానిక టీఆర్ఎస్ నేత‌లు, ఎమ్మెల్యేల‌తో విభేదాలు మొద‌ల‌య్యాయి. ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్లిన అస‌దుద్దిన్‌, అక్బ‌రుద్దిన్ టీఆర్ఎస్ నేత‌ల‌ను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు.

బోధ‌న్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్లిన అస‌దుద్దిన్ ఓవైసీ అక్క‌డ బీజేపీ, కాంగ్రెస్ కంటే ఎక్కువ‌గా బోధ‌న్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ష‌కీల్‌ను టార్గెట్ చేసి విమ‌ర్శ‌లు గుప్పించారు. దీనికి ష‌కీల్ కూడా ధీటుగానే కౌంట‌ర్ ఇచ్చారు. అస‌దుద్దిన్ ఓవైసీ బీజేపీ ఏజెంట్ అని ఆరోపించారు. బోధ‌న్‌తో పాటు ఉమ్మ‌డి నిజామాబాద్‌, అదిలాబాద్ జిల్లాల్లో చాలా మున్సిపాలిటీల్లో ఎంఐఎం వ‌ర్సెస్ టీఆర్ఎస్ అన్న‌ట్లుగా ఎన్నిక‌లు న‌డిచాయి. స‌హ‌జంగా ఓవైసీ సోద‌రుల్లో అస‌దుద్దిన్ కొంత ఆచితూచి మాట్లాడుతుంటారు.

ఆయ‌న‌తో పోల్చితే అక్బ‌రుద్దిన్ ఓవైసీ చాలా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. తాజాగా ఆయ‌న టీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. తాండూరులో ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్లిన అక్బ‌ర్ ఏకంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కే వార్నింగ్ ఇచ్చిన‌ట్లుగా మాట్లాడారు. కార్ టైర్లు పంచ‌ర్ చేస్తామంటూ హెచ్చ‌రించారు. తాండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, మాజీ మంత్రి ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డిపై కూడా అక్బ‌రుద్దిన్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌పైన కూడా అక్బ‌రుద్దిన్ విమ‌ర్శ‌లు గుప్పించారు. శ్రీనివాస్ యాద‌వ్ ఒక‌సారి గెలుస్తార‌ని, రెండుసార్లు ఓడిపోతార‌ని పేర్కొంటూ ఎద్దేవా చేశారు. కుమారుడిని గెలిపించుకోలేక‌పోయిన త‌ల‌సాని ఎంఐఎం పార్టీ గురించి మాట్లాడ‌తాడా అంటూ విమ‌ర్శించారు.

దీనికి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ కుమారుడు త‌ల‌సాని సాయికిర‌ణ్ యాద‌వ్ ధీటుగా బ‌దులిచ్చారు. అక్బ‌రుద్దిన్ ఇలా మాట్లాడి, త‌ప్పుడు ప‌నులు చేసినందున ఆయ‌నపై గ‌తంలో దాడి జ‌రిగింద‌ని అక్బ‌ర్ వ్యాఖ్య‌ల‌ను తిప్పికొట్టారు.

చాంద్రాయ‌ణ‌గుట్ట నుంచి స‌న‌త్‌న‌గ‌ర్ ఎంత దూర‌మో, స‌న‌త్‌న‌గ‌ర్ నుంచి చాంద్రాయ‌ణ‌గుట్ట కూడా అంతే దూరం అంటూ ఖ‌య్యానికి కాలు దువ్వారు.నేత‌లు ఇలా విమ‌ర్శించుకుంటుండ‌గా కిందిస్థాయిలో ఎంఐఎం, టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య మ‌రింత దూరం పెరిగింది. అయితే, ఎన్నిక‌ల్లో రెండు పార్టీల‌కు మేలు జ‌ర‌గాల‌ని, బీజేపీకి లాభం క‌ల‌గ‌వ‌ద్ద‌నే ఉద్దేశంతోనే ఎంఐఎం, టీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య విభేదాలు ఉన్న‌ట్లు డ్రామాలు చేస్తున్నార‌ని బీజేపీ విమ‌ర్శిస్తోంది. మ‌రి కేసీఆర్‌, కేటీఆర్‌తో దోస్తీ న‌డుపుతున్న ఓవైసీ సోద‌రుల‌కు చాలా మంది టీఆర్ఎస్ నేత‌లు, ఎమ్మెల్యేల‌తో మాత్రం స‌ఖ్య‌త లేన‌ట్లు క‌నిపిస్తోంది.

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle