newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

గులాబీ బాస్‌ టాస్క్‌..! తలలు పట్టుకుంటున్న ఎమ్మెల్యేలు!!

03-11-201903-11-2019 08:41:46 IST
2019-11-03T03:11:46.029Z03-11-2019 2019-11-03T03:08:33.509Z - - 22-02-2020

గులాబీ బాస్‌ టాస్క్‌..! తలలు పట్టుకుంటున్న ఎమ్మెల్యేలు!!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్టీసీ సమ్మె ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారినట్లు కనిపిస్తుంది. దాదాపు నెల రోజులుగా ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద నిరసనలు చేపడుతున్నారు.

అటు ఆర్టీసీ కార్మికులవైపు మాట్లాడలేక, అధినేత కేసీఆర్‌ గీసిన గీతను దాటలేక ఎమ్మెల్యేలు లోలోన మదనపడుతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తయితే.. తాజాగా గులాబీ బాస్‌ ఇచ్చిన టాస్క్‌ ఎమ్మెల్యేలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నట్లు తెలుస్తోంది. మింగలేక కక్కలేక అన్నట్లు ఎమ్మెల్యేల పరిస్థితి మారిందని తెరాస నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెబుతుంది. కానీ క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి లేదు.

అటు కార్మిక కుటుంబాలు, ఇటు ప్రజలు సైతం, ప్రభుత్వంపైన ఆగ్రహంతో ఉన్నారని, సొంత పార్టీ ఎమ్మెల్యేలే వణికిపోతున్నట్లు టీఆర్‌ఎస్‌ నేతలు చర్చించుకుంటున్నారు. ప్రజల్లో టీఆర్‌ఎస్‌పై అసమ్మతి పెరుగుతోందన్న నివేదికలు అధినేత చేతికి అందాయి. దీంతో సమ్మెను నిర్వీర్యం చేసే పనిలో గులాబీ బాస్‌ తలమునకలయినట్లు తెలుస్తోంది.

ఆయా జిల్లాల్లో సమ్మె ప్రభావాన్ని తగ్గించే బాధ్యతలను అధినేత కేసీఆర్‌ ఎమ్మెల్యేలకు అప్పగించినట్లు తెలుస్తోంది. స్థానికంగా డిపోల యూనియన్‌ నాయకులతో మాట్లాడి సమ్మె విరమణకు ఒప్పించడం, డ్యూటీలో చేరేలా చెయ్యడం వంటి బాధ్యతలను ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ అప్పగించారంట.

ఇక ఎమ్మెల్యేలు అందరితోనూ రోజూ మాట్లాడి వారితో పని చేయించే బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ మంత్రికి అప్పగించారని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. దీంతో కరీంనగర్‌కి చెందిన ఆ మంత్రి నిత్యం తన చాంబర్‌లో కూర్చుని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నారట.

ఉద్యోగంలో చేరాలని చూస్తున్న కార్మికులను డిపోలకు పంపి బస్సులు నడిపేలా చూడాలని ఆ మంత్రి ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేస్తున్నారని తెలుస్తుంది. కానీ ఎమ్మెల్యేలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆర్టీసీ కార్మికులు మాత్రం వినడం లేదట.

ఇంకా కొందరు కార్మికులు అయితే ఎమ్మెల్యేలు కలిసి చివాట్లు కూడా పెట్టారని చర్చ నడుస్తోంది. ఉద్యమం, ఎన్నికల్లో సహకరించామని, కానీ కష్టకాలంలో పట్టించుకోవడం లేదని, ఫోన్‌ చేసిన ఎమ్మెల్యేలకే కార్మిక సంఘాల నాయకులు రివర్స్‌ క్లాస్‌ ఇస్తున్నారట.

దీంతో తాము ఈ పని చెయ్యలేం బాబోయ్‌ అంటూ ఎమ్మెల్యేలు చేతులెత్తేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. తమ అసహాయతను అధిష్టానానికి చెప్పుకోలేక, ఇటు కార్మికులను సముదాయించలేక ఎమ్మెల్యేలు తలలు పట్టుకొంటున్నారట. సమ్మెను నిర్వీర్యం చేసేందుకు, కార్మిక సంఘాలను విభజించు పాలించు అన్నట్టుగా రకరకాల వ్యూహాలు రచిస్తున్నా, చివరికి స్థానిక ఎమ్మెల్యేలను రంగంలోకి దింపినా, ఫలితం ఉండటం లేదని ఎమ్మెల్యేలపై కేసీఆర్‌ అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం సాగుతుంది.

ఏకంగా మంత్రి ఆపరేషన్‌ ఆకర్ష్‌ మొదలుపెట్టినా ఫలితం మాత్రం ఉండటం లేదని, ఎమ్మెల్యేలపై మంత్రి ఒత్తిడి పెంచినా పనయ్యేలా లేదని కేసీఆర్‌ భావించినట్లు తెలుస్తోంది. మరోసారి ఇచ్చిన టార్గెట్‌ను పూర్తిచేసేలా ప్రయత్నించాలని కేసీఆర్‌ సదరు మంత్రిని ఆదేశించడంతో టార్గెట్‌ పూర్తిచేసేందుకు సదరు మంత్రి అష్టకష్టాలు పడుతున్నట్లు టీఆర్‌ఎస్‌ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   an hour ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   2 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   3 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   4 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   5 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   5 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   7 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   7 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   7 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   8 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle