newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గులాబీ పార్టీలో హంగామా.. మిగ‌తా పార్టీలు డీలా..!

29-12-201929-12-2019 09:42:18 IST
Updated On 31-12-2019 15:26:03 ISTUpdated On 31-12-20192019-12-29T04:12:18.609Z29-12-2019 2019-12-29T04:11:50.377Z - 2019-12-31T09:56:03.454Z - 31-12-2019

గులాబీ పార్టీలో హంగామా.. మిగ‌తా పార్టీలు డీలా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. ఇప్ప‌టికే ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసింది. జ‌న‌వ‌రి 22న రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీల‌కు, 10 మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

దీంతో ఎన్నిక‌లు జ‌రిగే ప్రాంతాల్లో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. అయితే, ఎన్నిక‌ల‌పై అధికార టీఆర్ఎస్ పార్టీలో క‌నిపిస్తున్న దూకుడు, కోలాహ‌లం మిగ‌తా పార్టీల్లో క‌నిపించ‌డం లేదు.

స‌హ‌జంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీల‌కే స్థానిక సంస్థ‌ల్లో మొగ్గు ఉంటుంది. గెలుపు అవ‌కాశాలు ఆ పార్టీల‌కే ఎక్కువ ఉంటాయ‌ని గ‌తం చెబుతోంది. ఇటీవ‌లి జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లోని మొత్తం అన్ని జిల్లా ప‌రిష‌త్‌ల‌ను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవ‌డ‌మే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌.

దీంతో మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ టీఆర్ఎస్‌కు గెలుపు అవ‌కాశాలు మెరుగ్గా ఉన్నాయ‌నే అంచ‌నాలు ఉన్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే ఓటేస్తే త‌మ ప‌ట్ట‌ణాలు అభివృద్ధి అవుతాయ‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో స‌హ‌జంగానే ఉంటుంది.

దీంతో ఎన్నిక‌లు జ‌రిగే అన్ని ప్రాంతాల్లోనూ టీఆర్ఎస్‌లో కోలాహ‌లం క‌నిపిస్తోంది. ఇంకా రిజ‌ర్వేష‌న్లు కూడా ఖ‌రారు కాక‌ముందే ఆశావ‌హులు టిక్కెట్ల కోసం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు, పార్టీలోని గాడ్ ఫాద‌ర్ల చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నారు. కొంద‌రైతే ఇప్ప‌టికే అన‌ధికారికంగా ప్ర‌చారాన్ని సైతం మొద‌లు పెట్టేశారు.

టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఇప్ప‌టికే మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌పై వ్యూహ‌ర‌చ‌న జ‌రిగింది. అభ్య‌ర్థుల ఎంపిక‌, టిక్కెట్ల కేటాయింపున‌కు త్రిస‌భ్య క‌మిటీ ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ ఎన్నిక‌ల బాధ్య‌త‌ల‌ను పూర్తిగా కేటీఆర్ తీసుకోనున్నారు. మొత్తం అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌ను గెలుచుకునేలా టీఆర్ఎస్ క‌స‌ర‌త్తు చేస్తోంది.

అయితే, టీఆర్ఎస్ అధిష్టానంలో, క్షేత్ర‌స్థాయిలో ఇంత కొలాహ‌లం ఉంటే కాంగ్రెస్‌, బీజేపీలో మాత్రం నిశ్చ‌బ్దం ఆవ‌హించింది. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో లోపాలున్నాయ‌ని, ఎన్నిక‌లు వాయిదా వేయాల‌ని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ మేర‌కు కోర్టుకు కూడా వెళ్లే ఆలోచ‌న‌లో ఉంది. ఎన్నిక‌లు వాయిదా ప‌డే అవ‌కాశాలు ఏమేర‌కు ఉన్నాయో ప‌క్క‌న పెడితే పార్టీ శ్రేణుల‌ను ఎన్నిక‌ల‌కు సిద్ధం చేయ‌డంలో మాత్రం పీసీసీ వెనుక‌బ‌డింది.

ఇక‌, ప‌ట్ట‌ణ ఓట‌ర్లు త‌మ వైపు ఉంటార‌ని భావిస్తున్న బీజేపీ సైతం మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌పై భారీగా ఆశ‌లు పెట్టుకుంది. ఎక్కువ మున్సిపాలిటీలు గెలుచుకోవ‌డం, ఓటు బ్యాంకును బ‌ల‌ప‌ర్చుకోవ‌డం ద్వారా తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గాల‌ని ఆ పార్టీ భావించింది. కానీ, ల‌క్ష్యం పెట్టుకున్న స్థాయిలో ఆ పార్టీ ముందుకెళ్ల‌డం లేదు. పెద్ద‌గా పార్టీలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల హ‌డావుడి క‌నిపించ‌డం లేదు. దీంతో మున్సిప‌ల్ రేసులో కాంగ్రెస్‌, బీజేపీ కంటే టీఆర్ఎస్ వేగంగా ప‌రుగులు పెడుతోంది.

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   12 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   12 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   16 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   18 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   13 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   20 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   21 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   13 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   15 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   21 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle