newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

గులాబీ పార్టీలో ఆరని స్టేషన్‌ఘన్‌పూర్‌ చిచ్చు..!

29-04-202029-04-2020 07:56:35 IST
Updated On 29-04-2020 09:45:25 ISTUpdated On 29-04-20202020-04-29T02:26:35.734Z29-04-2020 2020-04-29T02:26:31.050Z - 2020-04-29T04:15:25.196Z - 29-04-2020

గులాబీ పార్టీలో ఆరని స్టేషన్‌ఘన్‌పూర్‌ చిచ్చు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో ఒక్క నియోజకవర్గంలో ఏళ్ల క్రితం రాజుకున్న చిచ్చు ఇప్పటికీ ఇంకా రగులుతూనే ఉంది. ఎప్పటికప్పుడు అధిష్టానం పెద్దలు అగ్గిని ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అప్పటికి సద్దుమణిగినట్లే కనిపించి మళ్ళీ మళ్ళీ రేగుతూనే ఉంది. తాజాగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా మరోసారి ఇద్దరు సీనియర్ నేతల మధ్య వివాదం బయటపడింది.

తెలంగాణ రాజకీయాలలో సీనియర్ నేత, రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం, ప్రస్తుతం స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే తండ్రి, మంత్రి అన్నీ అవుతారన్నారు. అందుకే నా నియోజకవర్గంలోకి ఎవరు రావాలన్నా నా అనుమతితోనే రావాలన్నారు.

అక్కడితో ఆగని ఈ సీనియర్ నేత మరో వివాదాస్పమైన వ్యాఖ్య చేశారు. ఒక తల్లి, తండ్రికి పుట్టిన వాళ్ళైతే తల్లి రొమ్ముకోసే ప్రయత్నం చేయొద్దన్నారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు మరోసారి రచ్చకెక్కాయి. రాజయ్య చేసిన వ్యాఖ్యలు మరో సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని ఉద్దేశించే చేశారన్నది రాజకీయ వర్గాల మాట.

దీంతో యుద్ధవిధిగా అసలు ఈ ఇద్దరు నేతల మధ్య వాదన ఏంటి? ఇప్పుడు మరోసారి తెరపైకి రావాల్సిన అవసరం ఏమొచ్చిందని చర్చలు మొదలయ్యాయి. వీరి ఇద్దరు మధ్య వివాదం ఈనాటిది కాదు. ఏళ్ల తరబడి ఇక్కడ ఆధిపత్య పోరు కొనసాగుతుంది. గతంలో ఈ ఇద్దరిలో కడియం ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ నుండి కీలక ముఖ్యనేతగా ఎన్నోహోదాలలో పనిచేశారు.

ఒకదశలో కేంద్రంలో టీడీపీకి మిత్రపక్షం అధికారంలోకి వస్తే కడియంను ఉపరాష్ట్రపతి చేస్తారన్న చర్చలు కూడా జరిగాయి. ఇక అదే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో రాజయ్య ఓ వెలుగు వెలిగారు. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో కడియం కంటే ముందుగా రాజయ్య టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. ఆ తరవాత కడియం కూడా గులాబీ గూటికే చేరినా ఈ ఇద్దరి మధ్య పోరు మాత్రం ఆగలేదు.

ముందుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాజయ్య డిప్యూటీ సీఎం కాగా కడియం వర్గానికి ఏ మాత్రం ప్రాధాన్యత లేకుండా చేయాలని చూసారన్న ఆరోపణ ఉంది. అయితే అప్పుడు ఆరు నెలలు తిరగకుండానే వివిధ కారణాలతో రాజయ్య డిప్యూటీ పదవిని కడియంకి అప్పగించారు. అయితే, అధిష్టానం కడియంను నియోజకవర్గం వ్యవహారాల జోలికి వెళ్లకుండా ఒప్పందం చేసుకుందని అనేవారు.

కడియం డిప్యూటీగా ఉన్న సమయంలోనే 2018 ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో అయన వర్గం ఆవేదన సభలు నిర్వహించారంటే అక్కడి పరిస్థితి ఏంటన్నది అర్ధం చేసుకోవచ్చు. అయితే ఆ ఎన్నికలకు రాజయ్య స్వయంగా కడియంను కలిసి తనకు సహకరించాలని కోరడం.. పార్టీలో కీలక నేత కేటీఆర్ ఇద్దరి మధ్య చర్చలు జరపడంతో ఆ ఎన్నికలకు కలిసిపనిచేసారు.

ఎన్నికలు అయిన తర్వాత ఎవరి పని వారు చేసుకుంటున్నట్లుగానే కనిపిస్తున్నా అప్పుడప్పుడు పాత వాసన వస్తూనే ఉంటుంది. గత ఏడాది కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శన పేరుతో ఒకే నియోజకవర్గంలో ఇద్దరు వేర్వేరుగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుండి కడియం సైలెంట్ గా ఉన్నారని రాజకీయ వర్గాలలో వినిపిస్తుండగా పరోక్షంగా నియోజకవర్గం మీద పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తున్నారన్నది రాజయ్య వర్గం వాదన.

అందుకే ఇప్పుడు మరోసారి తాను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని రాజయ్య ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇద్దరు బడా బడా సీనియర్ నేతల మధ్య మరోసారి గుప్పుమన్న ఈ వివాదాన్ని గులాబీ అధిష్టానం ఎలా తీసుకోనుంది? ఇకైనైనా ఈ పోరుకు ఒక పరిష్కారం దొరికేనా? అన్నది భవిష్యత్ రాజకీయాలే తేల్చాల్సి ఉంది. 

 

 

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

   2 hours ago


తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

   6 hours ago


భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

   9 hours ago


మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

   9 hours ago


నిమ్మగడ్డ  ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

నిమ్మగడ్డ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

   10 hours ago


మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

   12 hours ago


యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

   13 hours ago


‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

   13 hours ago


తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

   13 hours ago


డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

   30-05-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle