newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గులాబీ నేతలకు నిబంధనలు వర్తించవా?

16-05-202016-05-2020 19:22:33 IST
Updated On 17-05-2020 09:23:20 ISTUpdated On 17-05-20202020-05-16T13:52:33.808Z16-05-2020 2020-05-16T13:52:25.034Z - 2020-05-17T03:53:20.010Z - 17-05-2020

గులాబీ నేతలకు నిబంధనలు వర్తించవా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు తెలంగాణలో కరోనా వైరస్ బాగా వ్యాపిస్తోంది. కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు అమలుచేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో మాత్రం ఆంక్షలను అధికార పార్టీ నేతలే పక్కన పెడుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం భౌతిక దూరం పాటించడంతో పాటు అన్ని వేడుకలను రద్దు చేసుకొని ఇంటికే పరిమితం కావాలని సూచించింది.. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించిన శిక్షార్హులు అంటూ కూడా హెచ్చరించింది. 

అయితే అధికార పార్టీ నేతలే ఆ నిబంధనల్ని తుంగలో తొక్కారు. ఏ చిన్న అవకాశం దొరికినా కరోనా తన ప్రతాపం చూపేందుకు సిద్ధమవుతోంది. అయితే టీఆర్ఎస్ నేతలు మాత్రం కరోనాను లెక్కచేయడం లేదు. రెండు రోజుల క్రితమే యాదాద్రి జిల్లా కేంద్రంలోని ఒక ప్రముఖ హోటల్లో నిబంధనలకు విరుద్ధంగా ఘనంగా పెళ్లి వేడుకలు నిర్వహించడంతో అధికారుల హోటల్ని సీజ్ చేశారు.

ప్రభుత్వ అధికారులు నిబంధనలు కచ్చితంగా అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటే.,, అధికార పార్టీ నేతలు మాత్రం ఆ ప్రయత్నాలకు తూట్లు పొడుస్తున్నారు. దీనికి ఈ ఘటనే ఉదాహరణ.. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండల కో ఆప్షన్ సభ్యుడు అదిల్ జన్మదిన వేడుకలు మర్యాల గ్రామంలోని ఓ తోటలో ఘనంగా నిర్వహించారు. తోటనిండా కార్లు, పెద్ద టెంట్.. ఇంకేముంది వందలాదిమంది వేడుకలకు హాజరయ్యారు.

అంతేకాదు ఈ కార్యక్రమానికి ఆలేరు ఎమ్మెల్యే,  ప్రభుత్వ విప్ స్వయంగా హాజరు కావడంతో పాటు ఆదిల్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. అధికార పార్టీ నేతలే ఇలా వ్యవహరించడం ఏంటని స్థానికులు విమర్శలు చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోకపోవడం పట్ల జనం మండిపడుతున్నారు. ఈ వేడుకలలో వందలాది మంది గుమిగూడడం,  భౌతిక దూరాన్ని పాటించకపోవడం... అడుగడుగునా ఉల్లంఘించడం.. అందులో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఉండడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంలో పోలీసులు ఎందుకు మౌనంగా వున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle