newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గుడ్ న్యూస్... జేబీఎస్ టు ఎంజీబీఎస్ కారిడార్ ప్రారంభానికి ముహూర్తం

05-02-202005-02-2020 09:36:38 IST
Updated On 05-02-2020 11:13:43 ISTUpdated On 05-02-20202020-02-05T04:06:38.094Z05-02-2020 2020-02-05T04:06:18.890Z - 2020-02-05T05:43:43.419Z - 05-02-2020

గుడ్ న్యూస్... జేబీఎస్ టు ఎంజీబీఎస్ కారిడార్ ప్రారంభానికి ముహూర్తం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్ లో లక్షలాదిమంది ప్రయాణికుల కల నెరవేరనుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మెట్రో కారిడార్ 2 త్వరలో ప్రారంభం కానుంది. ఎల్ అండ్ టీ ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసింది. ఈనెల 7వ తేదీన హైదరాబాద్‌ మెట్రో రైల్ కారిడార్ 2 ప్రారంభం కానుంది. ఎప్పటి నుంచో దీనిపై ప్రచారం జరుగుతున్నా ఇప్పుడు మాత్రం ఈ ముహూర్తం ఖరారైంది. కారిడార్ 2 ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేసింది హైదరాబాద్ మెట్రో రైల్.

ఈ నెల 7వ తేదీన సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎంజీబీఎస్-జేబీఎస్ మధ్య మెట్రో రైలు సేవలను ప్రారంభించనున్నారు. ఇప్పటికే నిర్మాణం, ట్రయల్‌ రన్‌ పూర్తి చేసుకుని మెట్రోరైలుకు భద్రతా శాఖ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది.

ఈ విషయాన్ని హైదరాబాద్ మెట్రో రైల్‌తో పాటు మంత్రి కేటీఆర్ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇప్పటికే కారిడార్ 1లో మియాపూర్-ఎల్బీనగర్ మధ్య 29 కిలోమీటర్లు, కారిడార్ 3 కింద నాగోల్ – హైటెక్ సిటీ మధ్య 29 కిలోమీటర్లు మెట్రో సర్వీసులు కొనసాగుతుండగా.. ఈ నెల 7వ తేదీ నుంచి ఎంజీబీఎస్-జేబీఎస్ మధ్య 11 కిలోమీటర్ల పరిధిలోని కారిడార్ -2 ప్రారంభం కానుంది. 

హైదరాబాద్ మెట్రో రైలు మొత్తం 69 కిలోమీటర్ల మేర అందుబాటులోకి రానుంది. మరింత సులువుగా, సౌకర్యవంతంగా, వేగంగా హ్యాపీగా జర్నీ చేసే అవకాశం వచ్చింది. 2019 నవంబరు 29న హైదరాబాద్ హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకూ మరో రూట్ అందుబాటులోకి వచ్చింది. సాఫ్ట్ వేర్ నిపుణులకు ఈ రూట్ సౌకర్యవంతంగా వుంది. 2017 నవంబర్ 28న నాగోల్-అమీర్ పేట-మియాపూర్ మార్గంలో 30 కిలోమీటర్లు మార్గాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు.

సెప్టెంబర్ 24న అమీర్ పేట-ఎల్బీనగర్ మధ్య 16 కిలోమీటర్లు మార్గాన్ని అప్పటి గవర్నర్ నరసింహన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.2019 మార్చి 20న అమీర్ పేట-హైటెక్ సిటీ మార్గంలో 10 కిలోమీటర్ల మెట్రోసేవలను నరసింహన్ ప్రారంభించారు. తాజాగా  జేబీఎస్ టు ఎంజీబీఎస్ కారిడార్ ప్రారంభం అయితే తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఎంజీబీఎస్ కు వెళ్లి బస్సుల్లో గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. 

చదవండి : ఇక హైదరాబాద్ నగర ప్రయాణం ఈజీ

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   12 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   8 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   10 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   13 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   15 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   17 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   18 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   19 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   20 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle