newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సులకు మినహాయింపులు

28-05-202028-05-2020 10:12:23 IST
Updated On 28-05-2020 11:16:47 ISTUpdated On 28-05-20202020-05-28T04:42:23.752Z28-05-2020 2020-05-28T04:41:46.565Z - 2020-05-28T05:46:47.730Z - 28-05-2020

గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సులకు మినహాయింపులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్ డౌన్ అమలవుతున్న వేళ హైదరాబాద్ సిటీ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారి కోసం సీఎం కేసీయార్ కొన్ని సడలింపులు ఇచ్చారు. తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇస్తున్నట్లు సీఎం కేసిఆర్ ప్రకటించారు. గురువారం నుంచి ఈ రూల్ అమలులోకి రానుండగా.. రాష్ట్రంలో యధావిధిగా ఆర్టీసీ బస్సు సర్వీసులు కొనసాగనున్నాయి. ఇప్పటివరకు జిల్లాల నుంచి వచ్చే బస్సులను హైదరాబాద్ లోని జేబీఎస్ లోకి మాత్రమే అనుమతించిన అధికారులు.. గురువారం నుంచి ఎంజీబీఎస్ లోకి కూడా అనుమతిస్తారు.

అయితే అంతా ఆశించినట్టు హైదరాబాద్ నగరంలో సిటీ బస్సు సర్వీసులపై మరికొన్ని రోజుల పాటు నిషేధం కొనసాగిస్తామన్నారు. బస్టాండ్లలోకి ట్యాక్సీలు, ఆటోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. బస్సు టికెట్ కలిగిన ప్రయాణీకులు రాత్రి పూట కూడా ప్రైవేటు వాహనాల్లో తమ ఇళ్లకు చేరుకోవచ్చునని.. పోలీసులు అభ్యంతరం తెలపరని రవాణాశాఖ వెల్లడించింది. కాగా, అంతర్రాష్ట్ర ఆర్టీసీ సర్వీసులకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ ఆర్టీసీ బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం కేసీయార్. 

ఈ నెల 19 నుంచి రాష్ట్రంలో ప్రజా రవాణాను పునరుద్ధరించింది ప్రభుత్వం. హైదరాబాద్‌లో సిటీ బస్సులు, అంతర్‌ రాష్ట్ర సర్వీసులు మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే.. రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ ఉంటున్న నేపథ్యంలో, ఆ సమయాల్లో మాత్రం బస్సులు తిరగరాదని, కర్ఫ్యూ వేళలకు పూర్వమే గమ్యం చేరుకోవాలని అప్పట్లో కేసీయార్ సూచించారు. దీంతో సాయంత్రం ఏడుగంటల లోపు గమ్యాలకు చేరలేని వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్సులు ప్రారంభమైనా.. కరోనా భయంతో జనం వాటిల్లో ప్రయాణించేందుకు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. దీంతో ఆర్టీసీకి టికెట్‌ రూపంలో ఆదాయం బాగా పడిపోయింది. బస్సులు తిరిగి ప్రారంభమయ్యాక తొలి రోజు కేవలం రూ.65 లక్షల ఆదాయం మాత్రమే రాగా, ఆ తర్వాత మూడ్రోజులకు అది రూ.2 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం సగటున నిత్యం రూ.2 కోట్లు మాత్రమే ఆదాయం వస్తోంది. 

ఇతర ప్రాంతాలకు వెళ్లే చాలామంది రాత్రి వేళ ప్రయాణానికి మొగ్గు చూపుతారు. కర్ఫ్యూ నేపథ్యంలో ఆ అవకాశం లేకపోవటంతో అలాంటి వారు ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో జనం పగటి వేళ బస్సెక్కేందుకు జంకుతున్నారు. ఈ విషయాలను మంత్రి పువ్వాడ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రాత్రి వేళ ప్రయాణాలకు అనుమతినిస్తే ఆర్టీసీ ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. దీనికి సీఎం అంగీకరించారు. మరోవైపు సిటీలో కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సిటీ బస్సులకు మాత్రం అనుమతినివ్వలేదు. 10 -15 రోజులు వేచి చూడాలని సీఎం ఆర్టీసీ అధికారులకు సూచించారు. దీంతో జూన్ 1 నుంచి సిటీ బస్సులు తిరుగుతాయని భావించిన వారికి కాస్త నిరాశే ఎదురవుతోందని చెప్పవచ్చు. 

 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   3 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   36 minutes ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   6 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle