newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గుట్టుచప్పుడు కాకుండా ఇసుక అక్రమ రవాణా

31-07-202031-07-2020 11:00:47 IST
2020-07-31T05:30:47.031Z31-07-2020 2020-07-31T05:30:26.481Z - - 15-04-2021

గుట్టుచప్పుడు కాకుండా ఇసుక అక్రమ రవాణా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పాత పాలమూరు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. నదీ పరివాహక ప్రాంతాలు, వాగుల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఓ వ్యాపారి రాత్రి పూట గుట్టు చప్పుడు కాకుండా ఇసుక తరలించే క్రమంలో రైతు బలయ్యాడు. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం తిర్మలాపూర్‌‌కు చెందిన దళిత రైతు గుర్రంకాడి నర్సింహులు ఇసుక లారీ కింద నలిగి ప్రాణాలు కోల్పోయారు.

ఇది ప్రమాదవశాత్తూ జరిగింది కాదనీ.. ఇసుక తవ్వకాలకు అడ్డొస్తున్నాడనే కారణంతోనే ఉద్దేశపూర్వకంగా తొక్కించి చంపారనే ఆరోపణలు వస్తున్నాయి. తిర్మలాపూర్‌ శివారులోని దుంధుబి వాగు నుంచి రోజూ భారీ మొత్తంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం. దీంతో బోర్లలో నీరు ఎండిపోతుండటంతో ఆ ప్రాంత రైతులు అధికారులకు ఫిర్యాదులు చేశారు.

రాత్రిపూట గుట్టు చప్పుడు కాకుండా ఇసుకను తరలిస్తోన్న ఈ లారీలను అప్పుడప్పుడు రైతులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి నర్సింహులు లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయారు. గురువారం తెల్లవారుజామున అక్కడికి చేరుకున్న రైతులు ఆందోళన చేపట్టగా.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు కూడా నిరసన చేపట్టారు.ఈ ఘటన వెనుక రాజపూర్‌కు చెందిన ప్రజాప్రతినిధి హస్తం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఆయన అండతోనే ఇసుక మాఫియా రెచ్చిపోతుందని అంటున్నారు.  ఇసుక తవ్వకాలకు అనుమతి ఉన్న ప్రాంతాల నుంచి వ్యాపారులు వివిధ ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారని.. ఎన్ని ట్రిప్పులు తరలించినా ఒకేటే బిల్లు చూపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 

రాత్రి వేళలో ఇసుక రవాణాను అడ్డుకుంటున్నామని పోలీసులు చెబుతుండగా.. చీకట్లోనే లారీ కింద నలిగి రైతు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోవడానికి కారణం ఎవరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.నర్సింహులు కుటుంబ సభ్యులతో రాజీ కుదర్చడానికి అధికార పార్టీకి చెందిన నాయకుడొకరు రంగంలోకి దిగారని.. కేసు నమోదు చేయకుండా అడ్డుకున్నారని తెలుస్తోంది.

నా రూటే సెప‌రేటు

నా రూటే సెప‌రేటు

   27 minutes ago


బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   14 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   15 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   14 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   18 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   19 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   18 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   20 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   21 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   16 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle