newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గీత దాటకుండా తెలంగాణ ప్రభుత్వం కట్టడి చర్యలు..!

02-05-202002-05-2020 06:11:24 IST
Updated On 02-05-2020 09:34:31 ISTUpdated On 02-05-20202020-05-02T00:41:24.018Z02-05-2020 2020-05-02T00:41:20.758Z - 2020-05-02T04:04:31.503Z - 02-05-2020

గీత దాటకుండా తెలంగాణ ప్రభుత్వం కట్టడి చర్యలు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా కట్టడికి ఎంత పటిష్ట చర్యలు తీసుకుంటుందో రాష్ట్రాల సరిహద్దులలో కూడా అంతే కఠినంగా ఉంటుంది. అయితే, తాజాగా కేంద్రం దేశంలోని వలస కూలీలను, విద్యార్థులను, లేక ఇతర రాష్ట్రాల చిక్కుకున్న వారిని కూడా సొంత రాష్ట్రాలు వారిని తరలించుకోవచ్చని ఆదేశించింది. దీంతో వలసదారులకు కష్టాలు తీరినట్లేనని అంతా భావించారు.

అయితే ఈ తరలింపు ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది ఒక స్పష్టమైన నిర్ధేశాలేవీ కేంద్రం ఇవ్వకపోవడంతో అంతా రాష్ట్ర ప్రభుత్వాల వైపు ఆశగా చూస్తున్నారు. ఇందులో ముఖ్యంగా తెలంగాణలో చిక్కుకున్న పొరుగు రాష్ట్రాల వారైతే తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు ఒక అవకాశం అన్నట్లుగా ప్రభుత్వాలను విన్నవించుకుంటున్నారు. వీరి తరలింపుకు పొరుగు రాష్ట్రాలు ఇప్పటికే నివేదికలు సిద్ధం చేస్తున్నాయి.

ఇదంతా తెలంగాణలోని ఇతర రాష్ట్రాల వారికోసం కాగా తెలంగాణ ప్రజలు ఎవరూ కూడా ఇతర రాష్ట్రాలలో అడుగు పెట్టనే వద్దని తెలంగాణ ప్రభుత్వం తెగేసి చెప్తుంది. దీనికి కారణం తెలంగాణకు పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్రలలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడమే.తెలంగాణ ప్రభుత్వం గత మూడు వారాలుగా సరిహద్దు గ్రామాలలో ముమ్మర ప్రచారం చేస్తుంది.

ఆ రెండు రాష్ట్రాలలో కరోనా వ్యాధి తీవ్రత నేపథ్యంలో సరిహద్దు జిల్లాలలో నివసిస్తున్న పౌరులెవరూ సరిహద్దు దాటకూడదని ఆదేశాలు ఇచ్చింది. వైద్యం, అత్యవసర పనులకు కూడా ఏపీ, మహారాష్ట్రల్లోకి వెళ్లడానికి వీలు లేదని సరిహద్దుల్లోని ప్రాంతాల ప్రజలను హెచ్చరిస్తుంది. రెండు రాష్ట్రాల సరిహద్దు గ్రామాలలో భారీగా పోలీసు బలగాలను పెంచి భద్రతను కట్టుదిట్టం చేసింది.

ఓ మూడు వారాల క్రితం కర్నూలులో ఓ డాక్టర్ హస్తవాసి మంచిదని రోగులు క్యూ కట్టారు. వీరిలో తెలంగాణలోని గద్వాలకు చెందిన ప్రజలు కూడా ఉన్నారు. అయితే ఆ వైద్యుడు కరోనాతో చనిపోవడం.. గద్వాలలో కూడా కరోనా విజృంభించింది. ఇక ఇప్పుడు కూడా కర్నూలులో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో తెలంగాణ రాకపోకలను నిషేధించింది.

ఖమ్మం, నల్గొండ జిల్లాల వాళ్లు ఎక్కువగా విజయవాడ, గుంటూరుతో అనుబంధం ఉంటుంది. ఏ చిన్న అవసరం వచ్చినా ఇటు హైదరాబాద్ ఎలాగో అటు ఆ జంట నగరాలను ఆశ్రయిస్తారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం అటు వెళ్లడానికి వీలు లేకుండా భద్రతను పెంచింది. ఇక మహారాష్ట్రలో కూడా కరోనా తీవ్రంగా ఉంది. అందుకే అడుగు పెట్టనే వద్దంటూ ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరిస్తుంది.

ఇప్పటికే తెలంగాణలో పండే ఆహారపు పంటలను కూడా తామే సొంతంగా కొనుగోలు చేసేందుకు సిద్ధపడిన ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో ఎలాంటి రవాణాను కూడా ఇష్టపడడం లేదు. ముఖ్యంగా మహారాష్ట్రలోకి ఎలాంటి వాహనాలను కానీ.. అటు మహారాష్ట్ర నుండి ఎలాంటి వాహనాలను కూడా అనుమతించే ప్రసక్తే లేదంటున్నాయి. ప్రస్తుతం ఆ రెండు రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో వైరస్ ఉదృతి తక్కువగా ఉంది. దానిని నిలుపుకొనేందుకే ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధపడుతుంది.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle