newssting
BITING NEWS :
పాకిస్తాన్‌లో కొనసాగుతున్న మీడియాపై దారుణ అణచివేత. పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులను అదుపులోకి తీసుకున్న ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. మీడియాపై అణచివేత లేనేలేదంటూ చెబుతున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. జర్నలిస్టు ముబషిర్ జైదీ తన సహచరుల అరెస్టులను బయటపెట్టడంతో వెలుగులోకి వచ్చిన వ్యవహారం * నేపాల్ దేశంలోని సింగిజా జిల్లాలో భారీవర్షాలతో కొండచరియలు విరిగిపడటం వల్ల ఒకే కుటుంబంలోని 9 మంది మరణించారని చీఫ్ జిల్లా ఆఫీసర్ గంగా బహదూర్ చెట్రీ ప్రకటన. భారీవర్షాలు, వరదల వల్ల నేపాల్ దేశంలో మొత్తం 10 మంది మరణించగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయయని అధికారుల ప్రకటన * వైరస్‌తో పోరాటం చేస్తున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌‌ సిసోడియా. ప్రస్తుతం విషమంగా ఆయన ఆరోగ్యం. కరోనాతో పాటు డెంగ్యూ కూడా ఎటాక్‌ చేయడంతో గడిచిన 24 గంటల్లో మరింత విషమంగా ఉందని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నాయక్‌ ఆస్పత్రి వైద్యుల ప్రకటన * వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా ఆగని పోరు మంటలు. వ్యవసాయ, కార్మిక సంస్కరణల బిల్లులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలను. పంజాబ్‌లో రైల్‌ రోకో నిర్వహించిన రైతులు. కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్ కమిటీ, ఇతర రైతు సంఘాలు సంయుక్తంగా ఆందోళనలు * పార్లమెంట్‌లో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ శుక్రవారం తలపెట్టిన భారత్‌ బంద్‌కు 20కి పైగా రైతు సంఘాలు మద్దతు. పంజాబ్‌, హరియాణాల్లో పార్టీలకు అతీతంగా ఆందోళనలో పాల్గొంటున్న 31 రైతు సంఘాలు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలోనూ పలు రైతు సంఘాలు షట్‌డౌన్‌కు పిలుపు, హిందూ మజ్ధూర్‌ సభ వంటి పలు కార్మిక సంఘాలు మద్దతు ప్రకటన * కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలతో పలు రైళ్ల రాకపోకల రద్దు. అమృత్ సర్-జయానగర్ ఎక్స్ ప్రెస్, జయానగర్-అమృత్ సర్ ఎక్స్ ప్రెస్ ల రద్దు చేయడంతో పాటు మరికొన్ని ప్యాసింజర్ రైళ్ల రద్దు. మరికొన్ని రైళ్ల ప్రయాణ దూరం కుదింపు * ఆరునెలల తర్వాత హైదరాబాద్‌లో శుక్రవారం నుంచి రోడ్డెక్కిన సిటీ బస్సులు. మొత్తం బస్సుల్లో 25 శాతమే తిప్పనున్న ఆర్టీసీ. శుక్రవారం ఉదయం షిఫ్ట్‌ నుంచి బస్సులు ప్రయాణం మొదలు కాగా వారం, పది రోజుల తర్వాత పరిస్థితిని బట్టి 50 శాతం బస్సులకు అనుమతి * నేడు హైదరాబాద్‌ లోని దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభం. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45 ఎలివేటెడ్‌ కారిడార్‌ కూడా ప్రారంభం. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర మునిసిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ చేతుల మీదగా శుక్రవాదం సాయంత్రం బ్రిడ్జ్ ప్రారంభం * పారిశుద్ధ్య కార్మికుల సర్వీసు క్రమబద్ధీకరణకు సంబంధించిన కేసులో‌ ఘాటు వ్యాఖ్యలు చేసిన హైకోర్టు డివిజన్‌ బెంచ్. ఉచితంగా ఊడిగం చేయించుకోడానికి ఇదేమీ రాచరికం కాదని వ్యాఖ్య. సర్వీసు రూల్‌ 1994లోని సెక్షన్‌ 3 ప్రకారం దినసరి కూలీలుగా కొనసాగించరాదని హైకోర్టు మరోసారి స్పష్టం * పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో రేపటి నుండి అధిక ఆశ్వీజమాస తిరుకళ్యాణోత్సవాలు. 30న ఆలయంలో ఏకాంతంగా స్వామివారి కళ్యాణం. కళ్యాణోత్సవాల రోజుల్లో స్వామి వారి నిత్య కళ్యాణాలు, నిత్య ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో డి భ్రమరాంబ వెల్లడి * 283వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు. రాజధాని గ్రామాల్లోని శిబిరాల్లో సాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్న రాజధాని రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ సాగుతున్న అమరావతి ఉద్యమం * శ్రీశైలంలో కలకలం రేపిన అన్యమత పార్సిల్‌. ఆలయానికి సమీపంలోని దళిత కాలనీకి చెందిన ఓ కుటుంబానికి కర్నూలు నుంచి క్రిస్టియన్‌ సంస్థ ద్వారా వచ్చిన ఓ పార్సిల్‌. దానిపై కల్వరి టెంపుల్‌ చిరునామా . స్థానికులిచ్చిన సమాచారంతో పార్సిల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. పార్సిల్‌లో నిత్యావసర వస్తువులున్నట్లుగా పోలీసుల వెల్లడి * కేంద్ర సుగంధ ద్రవ్యాల మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మిర్చి టాస్క్‌ఫోర్స్‌కు చైర్మన్ గా బీజెపీ ఎంపీ, బోర్డు సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు నియామకం. మిర్చి పంట అభివృద్ధి, వాటి ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం ఈ టాస్క్‌ఫోర్స్‌ విధి. జీవీఎల్‌తోతోపాటు మరో 15మందిని కమిటీ సభ్యులుగా నియామకం.

గిరిజన జాతర మహా కుంభమేళా మేడారంకి పోటెత్తిన జనం

01-02-202001-02-2020 09:46:18 IST
Updated On 01-02-2020 09:47:32 ISTUpdated On 01-02-20202020-02-01T04:16:18.849Z01-02-2020 2020-02-01T04:16:07.492Z - 2020-02-01T04:17:32.275Z - 01-02-2020

గిరిజన జాతర మహా కుంభమేళా మేడారంకి పోటెత్తిన జనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచంలోనే అతిపెద్ద జాతర. లక్షల మంది ఒకేచోటికి చేరుకునే విశిష్టమయిన పర్వదినం.. మూడు రోజుల పండగ.. గిరిజన కుంభమేళా మేడారం జాతరకు ఒక్క శుక్రవారం నాడే అయిదు లక్షలకు పైగా భక్తులు వచ్చారు. సమ్మక్క-సారలమ్మల సన్నిధికి భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు సకల ఏర్పాట్లు చేశారు పోలీసులు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతరకు జనం లక్షలాదిగా తరలివెళుతున్నారు. జాతర ప్రారంభానికి ముందే భక్తులు సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుంటున్నారు. 

https://www.photojoiner.net/image/HxmCjOPT

రెండేళ్లకు ఒకసారి వచ్చే వనదేవతల సంబరం ఈమహోత్సవం. మేడారం జాతరకు వేళైంది. ఫిబ్రవరి 5 నుంచి 8 వ తేదీ వరకు నిర్వహించతలపెట్టిన జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌ నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. మూడు రోజుల వేడుకల్లో పాల్గొని.. సమ్మక్క సారక్కలను దర్శించుకుంటారు. అయితే దేశంలో ఎక్కడి నుంచైనా చేరుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గతంలో కంటే ఈ సారి భిన్నంగా అమ్మలను దర్శించుకునే అవకాశం వుంది.

ఎలా చేరుకోవాలి?

మేడారం జాతరకు హైదరాబాద్ నుంచే కాదు ఇతర ప్రాంతాలనుంచి చేరుకోవచ్చు. హైదరాబాద్‌ నుంచి వెళ్లే భక్తులు.. భువనగిరి, ఆలేరు, జనగామ, వరంగల్, ములుగు, పసర, తాడ్వాయి మీదుగా లేదా పసర నుంచి నార్లపూర్ మీదుగా సమ్మక్క సారక్క గద్దెల దగ్గరకు చేరుకోవచ్చు. జాతరకు ఇదే ప్రధాన రహదారిగా చెబుతారు.

కరీంనగర్‌ జిల్లా నుంచి వచ్చే భక్తులు హుజూరాబాద్‌, పరకాల, ములుగు, పసర, నార్లపూర్‌ మీదుగా సమ్మక్క సారక్క గద్దెల దగ్గరకు చేరుకోవచ్చు. అలాగే కరీంనగర్‌ నుంచి మరో దారిలో కూడా మేడారం చేరుకోవచ్చు.. అది పెద్దపల్లి, మంథని, కాటారం, భూపాలపల్లి, బయ్యక్కపేట మీదుగా జంపన్నవాగుకు చేరుకోవచ్చు. 

విజయవాడ నుంచి వచ్చే భక్తులు నందిగామ, ఖమ్మం, ఇల్లందు, పసర, నార్లపూర్‌ మీదుగా జాతర ప్రాంతానికి వెళ్ళవచ్చు. మరోవైపు ఖమ్మం దగ్గర నుంచి మరో దారి గుండా జాతరకు చేరుకోవచ్చు. భద్రాచలం మంగపేట లేదా వాజేడు వెంకటాపురం మీదుగా ఏటూరు నాగారం, తాడ్వాయి మీదుగా మేడారం చేరుకోవచ్చు. కొన్ని ప్రైవేట్ హెలికాప్టర్ సంస్థలు కూడా సేవలు అందించనున్నాయి. 

రైలు ప్రయాణీకులు మేడారం చేరుకోవాలంటే వరంగల్‌ లేదా కాజీపేట స్టేషన్‌లో దిగి.. అక్కడి నుంచి బస్సు లేదా ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాలి. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే భక్తులకు మాత్రం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

జంపన్న వాగు చుట్టుపక్కల సుమారు 10 ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాల పార్కింగ్‌లను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి గద్దెల వరకు సుమారు 2 కిలోమీటర్ల వరకు నడిచి వెళ్లాలి. హైదరాబాద్ లోని 10 ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ నెల 8వ తేదీ వరకు 500 బస్సులను నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఆర్టీసీ బస్సుల్లో మేడారం సీట్ల బుకింగ్‌ ప్రక్రియను ప్రారంభించి 50 మంది ఒకేసారి బుక్‌ చేసుకుంటే వారికి అనువైన ప్రాంతానికి బస్సును పంపించనున్నారు అధికారులు. 

 

అటు కేంద్రం వ్యవసాయ చట్టం- ఇటు కేసీఆర్ రెవెన్యూ చట్టం- తెలంగాణలో బీజేపీకి కష్టం

అటు కేంద్రం వ్యవసాయ చట్టం- ఇటు కేసీఆర్ రెవెన్యూ చట్టం- తెలంగాణలో బీజేపీకి కష్టం

   7 hours ago


బ్రేకింగ్ : కరోనా మృతదేహాల వద్ద కనిపించని నగలు, సెల్ఫోన్లు

బ్రేకింగ్ : కరోనా మృతదేహాల వద్ద కనిపించని నగలు, సెల్ఫోన్లు

   10 hours ago


బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా- కోవిడ్ జాగ్రత్తలపైనే అందరి దృష్టీ

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా- కోవిడ్ జాగ్రత్తలపైనే అందరి దృష్టీ

   10 hours ago


నేడే దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభం.. ప్రత్యేకతలివే..

నేడే దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభం.. ప్రత్యేకతలివే..

   11 hours ago


కరోనా లెక్కల తకరారు? ఎవరిని  నమ్మించడానికి? ఎవరికి  వంచించడానికి??

కరోనా లెక్కల తకరారు? ఎవరిని నమ్మించడానికి? ఎవరికి వంచించడానికి??

   13 hours ago


ఏపీ నీటి తరలింపునకు కేసీఆర్‌ చక్కటి సహకారం.. ఉత్తమ్‌ మండిపాటు

ఏపీ నీటి తరలింపునకు కేసీఆర్‌ చక్కటి సహకారం.. ఉత్తమ్‌ మండిపాటు

   13 hours ago


ఎమ్మెల్సీ పోరు.. కోదండరాం టార్గెట్‌గా టీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్!

ఎమ్మెల్సీ పోరు.. కోదండరాం టార్గెట్‌గా టీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్!

   13 hours ago


కులపిచ్చి, ధన అహంకారమే హేమంత్ హత్యకు కారణమా ?

కులపిచ్చి, ధన అహంకారమే హేమంత్ హత్యకు కారణమా ?

   14 hours ago


మంత్రి హ‌రీష్‌రావుచే 500 ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల పంపిణీ..

మంత్రి హ‌రీష్‌రావుచే 500 ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల పంపిణీ..

   16 hours ago


తెలంగాణలో మరో పరువు హత్య..!

తెలంగాణలో మరో పరువు హత్య..!

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle