newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గాభరా వద్దు.. ‘రూ.5000 కోట్లు ఖర్చు చేసైనా కరోనాను కట్టడి చేస్తాం’

15-03-202015-03-2020 13:22:51 IST
2020-03-15T07:52:51.674Z15-03-2020 2020-03-15T07:52:49.164Z - - 19-04-2021

గాభరా వద్దు.. ‘రూ.5000 కోట్లు ఖర్చు చేసైనా కరోనాను కట్టడి చేస్తాం’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కరోనా వైరస్ పట్ల ప్రజలు భయాందోళనలకు గురికావద్దని, నివారణకు ప్రభుత్వం అన్ని రకాలుగా సంసిద్ధమవుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం పెద్దగా లేదని, అయినప్పటికీ తాము అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. శనివారం శాసనసభలో కరోనా వైరస్‌పై సీఎం కేసీఆర్‌ ప్రకటన చేశారు. ప్రజలు భయాందోళనకు గురికావద్దని.. కరోనాపై ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. అవసరమైతే రూ.1000 కోట్లు కాదు రూ.5000 కోట్లు ఖర్చు చేసైనా కరోనాను కట్టడి చేస్తామన్నారు. 

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలకు సరిపడా మాస్కులు, శానిటైజర్లు, సూట్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గతంలో కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తి కోలుకున్నాడని.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశామన్నారు. తెలంగాణలో రెండో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైందని చెప్పారు. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలిందని సభలో కేసీఆర్ తెలిపారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని, శాంపిల్స్‌ను పుణె ల్యాబ్‌కు పంపామని కేసీఆర్ చెప్పారు.

కరోనా వైరస్‌ వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి హైలెవల్‌ కమిటీ చర్చిస్తోంది. ప్రస్తుతం ప్రమాదం లేకున్నా ముందుజాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. బెంగళూరులో కూడా సంస్థలను మూసేశారు. చాలా రాష్ట్రాలలో థియేటర్లు, స్కూళ్లు బంద్‌ చేశారు. మేము కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కరోనా కోసం సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేశాం. డీసీపీ ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన కమిటీని పర్యవేక్షిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో 200 మంది స్క్రీనింగ్‌ చేస్తున్నారు.  హైలెవల్‌ కమిటీ చర్చించిన అంశాలను రాష్ట్ర మంత్రివర్గం కూడా చర్చిస్తుంది. ఈ సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చిస్తాం’ అని కేసీఆర్‌ అన్నారు.  

దేశంలో ఇప్పటి వరకు 65 మందికి కరోనా వైరస్‌ సోకగా ఇందులో 17 మంది విదేశీయులు ఉన్నారని సీఎం తెలిపారు. 65 మందిలో 10 మందిని డిశ్చార్జి చేశారని పేర్కొన్నారు. ఈ వైరస్‌ వల్ల కేవలం ఇద్దరు మాత్రమే చనిపోయారని కేసీఆర్‌ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం జరిగే కేబినెట్‌ సమావేశంలో కరోనాపై విస్తృతంగా చర్చిస్తామని చెప్పారు. పాఠశాలల బంద్‌, తదితర అంశాలపై కేబినెట్‌ సమావేశంలో చర్చించి సాయంత్రం ప్రకటిస్తామని చెప్పారు.

కాగా శనివారం సాయంత్రం మొదలైన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా మంత్రులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ భేటీ మూడు గంటల పాటు జరిగింది. కరోనా నివారణలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్లు, షాపింగ్ మాల్స్‌ను ఈ నెల 31 వరకు మూసివేయాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ‘‘ కరోనా మన దేశంలో పుట్టినది కాదు. దేశంలో 83 మందికి మాత్రమే కరోనా లక్షణాలు ఉన్నాయి. కరోనాపై ప్రజలెవరూ భయపడొద్దు. తెలంగాణ వాసులకు కరోనా రాలేదు. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి ఈ కరోనా వస్తోంది. ప్రస్తుతం ముగ్గురికి కరోనా లక్షణాలు కనిపించాయి. ఒకరికి చికిత్స సాగుతోంది. మరో ఇద్దరికి పరీక్షలు జరుగుతున్నాయి. ఫలితాలు రావాల్సి ఉంది అని చెప్పారు.

కరోనాపై ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. కరోనాపై ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొంటాం. ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదల చేసింది. తెలంగాణ ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉంది. కరోనా ఒక వ్యక్తి నుంచి... చాలా మందికి సోకే ప్రమాదం ఉంది. కరోనా పట్ల మనం తీసుకుంటున్నవి ముందు జాగ్రత్త చర్యలే. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే... కరోనాను నివారించవచ్చు. జనం ఉన్న చోట్లకు ప్రజలు వెళ్లకపోవడం మంచిది. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వచ్చే అవకాశమే లేదు. రాష్ట్రంలో మొత్తం 1020 ఐసోలేషన్‌ బెడ్లు రెడీగా ఉంచాం. 321 ఐసీయూ బెడ్లు, 240 వెంటిలేషన్లు సిద్ధం చేశాం.’’ అని  కేసీఆర్ భరోసా ఇచ్చారు 

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   2 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   an hour ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   6 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   7 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   3 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   9 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   10 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   2 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   4 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   10 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle