newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

గాజు గుర్తు ఇవ్వం.. కావాలంటే మద్దతిస్తాం!

09-01-202009-01-2020 13:26:47 IST
Updated On 09-01-2020 14:42:29 ISTUpdated On 09-01-20202020-01-09T07:56:47.519Z09-01-2020 2020-01-09T07:56:45.175Z - 2020-01-09T09:12:29.024Z - 09-01-2020

గాజు గుర్తు ఇవ్వం.. కావాలంటే మద్దతిస్తాం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. మున్సిపల్ ఎన్నికలు రానున్నాయని ముందే గ్రహించిన అధికార పార్టీ తమ నేతలను ప్రజల మధ్యకి నెట్టేసింది. మంత్రుల నుండి ద్వితీయ శ్రేణి నేతల వరకు గత నెల నుండే ప్రజల బాట పట్టారు. మంత్రులైతే ప్రాజెక్టులు.. పల్లె ప్రగతి అంటూ నిత్యం ప్రజా జపం చేస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ కూడా దూకుడు పెంచి ప్రభుత్వంపై మాటల దాడి మొదలుపెట్టింది.

ఇక బీజేపీ కేంద్రంలో తాను తెచ్చిన పౌరసత్వ చట్టం సాక్షిగా రాష్ట్రంలో బలపడే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. చివరికి టీడీపీ, కమ్యూనిస్టులు కూడా అభ్యర్థులు.. ప్రణాళికలు అంటూ సమావేశాలను నిర్వహించుకుంటున్నాయి. జనసేన పార్టీ మాత్రం అందుకు భిన్నంగా ప్రస్తుతం పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలకు దూరంగా ఉండనున్నామని ప్రకటించేశారు.

ఈ మేరకు జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో అయన కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా గ్లాస్ గుర్తుతో పోటీ చేయడంలేదని, కానీ పోటీచేయాలని ఆసక్తిఉన్న పార్టీ కార్యకర్తలు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీచేయడానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అనుమతి ఇచ్చారని, వారికి పార్టీ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.

ఒకవిధంగా చెప్పాలంటే తమ పార్టీ గాజు గుర్తు ఇవ్వలేము కానీ కావాలంటే మీరు పోటీ చేస్తే పార్టీ మద్దతు మాత్రం ఇస్తామని చెప్పారన్నమాట. ఈ ప్రకటనలో పేర్కొన్నట్లుగా.. ఎన్నికల్లో పోటీ చేయకుండా... పోటీ చేసే వారికి మద్దతు ఏంటనే దానిపై ఎవరికీ క్లారిటీ రావడం లేదు. ఒకవిధంగా తెలంగాణలోని జనసేన పార్టీ శ్రేణులు, పవన్ అభిమానులలో ఇది గందరగోళంగా మారింది.

అయితే, పవన్ కళ్యాణ్ తెలంగాణ పార్టీ శ్రేణులతో చర్చించే ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో రాజధానిపై జరుగుతున్న ఆందోళనలు, రైతుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని పూర్తి సమయాన్ని అక్కడే కేటాయించాలని పవన్ నిర్ణయించుకున్నారని అందుకే తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాలు సర్ది చెప్తున్నాయి.

ఎన్నికలలో దిగి కనీసం పార్టీ తరపున ప్రచారం లేకుండా కనీసం సముచిత ఓట్లు కూడా రాకపోతే అది ఇంకా పార్టీకి డ్యామేజ్ గా మారే అవకాశం ఉండడంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ ముఖ్య నేత ఒకరు చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయానికి ఏపీలో పరిస్థితులు మరింత దిగజారే పరిస్థితులు కనిపిస్తున్నాయని.. అప్పుడు ఎన్నికలలో పార్టీ ఉంటే ఏపీలో మరోలా సంకేతాలు వెళ్తాయని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. ఒకవిధంగా పార్టీ శ్రేణులను కన్ఫ్యూజ్ చేసిన పవన్ రాజకీయం మంచి నిర్ణయమే తీసుకున్నారంటున్నారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle