newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గాంధీ దవాఖానకి మరో మరక.. బార్ గా మార్చేసిన ఉద్యోగులు!

19-05-202019-05-2020 07:48:03 IST
Updated On 19-05-2020 08:07:39 ISTUpdated On 19-05-20202020-05-19T02:18:03.167Z19-05-2020 2020-05-19T02:17:59.534Z - 2020-05-19T02:37:39.174Z - 19-05-2020

గాంధీ దవాఖానకి మరో మరక.. బార్ గా మార్చేసిన ఉద్యోగులు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలోనే కరోనా మహమ్మారికి వైద్యం అందించిన తొలి ఆసుపత్రులలో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి కూడా ఒకటి. కరోనాకు వైద్యం అందించడమే కాదు కరోనా వ్యాధికి చికిత్సలో అత్యంత కీలకమైన ప్లాస్మా థెరపీలో కూడా అడుగు ముందుకు వేసేందుకు ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అనుమతులు రాగానే ఈ థెరపీ ఇక్కడ మొదలు కానుంది.

కేవలం కరోనా మాత్రమే కాదు ఇకపై ప్రపంచ వ్యాప్తంగా వచ్చే కొత్త వైరస్ లకు కూడా వ్యాక్సిన్, మెడిసిన్ ల ప్రయోగానికి గాంధీని ప్రయోగశాలగా మార్చేందుకు వైద్య నిపుణులు, వైద్యులు ప్రయత్నాలను మొదలుపెట్టారు. అయితే అదంతా ఒకెత్తు అయితే గాంధీలో పనిచేసే వైద్య సిబ్బంది, సాధారణ సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తిన సందర్భాలకు కొదువేలేదు.

దారితప్పిన వైద్యం.. అక్రమాలకు నిలయం.. అవకతవకల దవాఖాన అనే శీర్షికలతో గాంధీ ఆసుపత్రిపై పలు సందర్భాలలో వార్తాపత్రికలలో కథనాలు కూడా ఇప్పుటికే మనం చూశాం. అయితే ఈసారి అక్కడి ఉద్యోగులు ఏకంగా ఆసుపత్రినే బార్ గా మార్చేశారు. ఒకపక్క కరోనా లాంటి భయంకరమైన మహమ్మారికి ఇక్కడ వైద్యం అందిస్తుండగా కొందరు ఉద్యోగులు ఏకంగా ఆసుపత్రిలోనే గానాబజానా మొదలు పెట్టారు.

గాంధీలో పనిచేసే కొందరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆసుపత్రి సెల్లార్ లోనే బార్ ఓపెన్ చేసి రాత్రంతా మందుతోనే జాగారం చేశారు. మొత్తం ముగ్గురు ఉద్యోగులు శనివారం రాత్రి సెల్లార్ లో పార్టీ మొదలుపెట్టి ఆదివారం తెల్లవారు జామువరకు విందు చేసుకున్నారు. ఆదివారం ఉదయాన్నే ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. అయితే ముగ్గురిలో ఒకరు గుండెపోటుతో మృతిచెందాడు.

దీంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆదివారం విషయాన్ని పెద్దగా పట్టించుకోని అధికారులు సోమవారం గోప్యంగా విచారణ ప్రారంభించారు. అయితే ప్రస్తుతం కరోనా రోగులకు ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. తెలంగాణకి సంబంధించి ఇది కోవిడ్ ఆసుపత్రి. పైగా గాంధీలో మూడంచెల భద్రత అని ప్రభుత్వం బల్లగుద్ది ఒకటికి పదిసార్లు చెప్పుకుంది. మరి ఆసుపత్రిలోనే ఒక రాత్రతా పార్టీ ఎలా సాధ్యమైంది.

ముగ్గురు ఉద్యోగులు ఒక రాత్రంతా సెల్లార్ లో మందుకొడుతుంటే భద్రతా సిబ్బంది కంట పడలేదా? పడినా చూసి చూడనట్లుగా వదిలేశారా? గాంధీలో అడుగుగడుగునా పోలీసులు పహారా కాస్తున్నారని చెప్తుండగా ఆసుపత్రి ఆవరణలోనే జరుగుతున్న గానాబజాను ఎందుకు కనిపెట్టలేకపోయారు? ఇలా ఎన్నో అనుమానాలు వెంటాడుతున్నాయి.

ఇంతకు ముందు కూడా గాంధీలో పటిష్ట భద్రత ఉంటుందని ప్రభుత్వ అధికారులు చెప్పే మాట. ఇక కోవిడ్ ఆసుపత్రిగా మార్చిన అనంతరం మరింత పటిష్టం చేశామని చెప్పుకున్నారు. కానీ ఈ ఘటనతో ప్రభుత్వం పటిష్ట భద్రత వెనుక లొసుగులు ఎన్నో బట్టబయలయ్యాయి. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేసి పునరావృతం కాకుండా చూసుకోకపోతే ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు ఎంత సేవ చేసినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.

 

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   an hour ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   an hour ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   6 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   7 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   2 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   9 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   10 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   2 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   4 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   10 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle