గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగుల మెనూ ఏంటో తెలుసా?
24-04-202024-04-2020 18:39:59 IST
Updated On 24-04-2020 19:21:02 ISTUpdated On 24-04-20202020-04-24T13:09:59.163Z24-04-2020 2020-04-24T13:09:47.281Z - 2020-04-24T13:51:02.028Z - 24-04-2020

కరోనా వైరస్ బారినపడిన రోగులను కంటికి రెప్పలా కాపాడుతున్నారు గాంధీ ఐసోలేషన్ వార్డులోని వైద్యులు, నర్సులు. కరోనా పాజిటివ్ వచ్చినవారికి అత్యాధునిక సదుపాయాలతో చికిత్స అందిస్తున్నారు. కరోనా రోగులకు ఎలాంటి ఆహారం అందిస్తున్నారనేది చాలామందికి అనుమానంగా వుంటుంది. కానీ వారికి కూడా బలమైన ఆహారాన్ని అందజేస్తున్నారు. కరోనా బాధితులు ఐసోలేషన్‌లో ఉంచడం వల్ల మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఆ సమయంలో రోగికి ఇమ్యూనిటీ చాలా ముఖ్యం. రోగి త్వరగా కోలుకోవాలంటే ఒక్క మందులు మాత్రమే సరిపోవు. పౌష్టికాహారం కూడా ఎంతో అవసరం. దీంతో గాంధీ ఆస్పత్రిలో పాజిటివ్ వచ్చిన బాధితులకు రోజువారిగా పౌష్టికాహారం అందజేసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కరోనా చికిత్స అందుకుంటున్న రోగులకు ఉదయం అల్పాహారంలో టిఫిన్ గా ఇడ్లీ, మంచి చట్నీ, టీ అందజేస్తున్నారు. ఇందులో ఇడ్లీ, దోశ, చపాతీ, పాలు, బ్రెడ్డు కూడా అందజేస్తున్నారు. ఇక మధ్యాహ్నం సమయంలో లంచ్‌లో భాగంగా భోజనంలో రెండు రకాల కూరలు, అన్నంతో సహా పెరుగు, ఉడకబెట్టిన కోడిగుడ్డు, సాంబారు, మినరల్ వాటర్ ఇస్తున్నారు. ఇక స్నాక్స్‌గా బాదం, జీడిపప్పు వంటి డ్రైప్రూట్తో పాటు ఇతర పండ్లను కరోనా రోగులకు అందజేస్తున్నారు. కరోనా ఎదుర్కొనేందుకు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నట్లు గాంధీ ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. టీ తాగే అలవాటున్నవారికి బాదంతో తయారుచేసిన బిస్కట్లు అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. ఇదిలా వుండగా కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణలో పెరుగుతూనే వున్నాయి. శుక్రవారం కొత్తగా మరో 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 984కు చేరింది. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 25కు చేరుకోగా, 262 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వైరస్ వేడి పెరిగితే నశించిపోతుందని అమెరికన్ సైంటిస్టులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో దేశంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయి. దీంతో వైరస్ వ్యాప్తి కూడా తగ్గుముఖం పడుతుందని వైద్యులు ఆశాభావంతో వున్నారు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
5 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
8 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
11 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
2 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
12 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
9 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
12 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
12 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
6 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
15 hours ago
ఇంకా